E-Paper
Advertisement

Jio Recharge Plans: అద్భుతమైన జియో ప్లాన్.. 900 GB 5G డేటా, ఉచిత ఓటీటీలు.. 365 రోజుల పాటు..

Jio Recharge Plans: అద్భుతమైన జియో ప్లాన్.. 900 GB 5G డేటా, ఉచిత ఓటీటీలు.. 365 రోజుల పాటు..
Advertisement

Jio Recharge Plans: ప్రముఖ టెలికాం సంస్థ జియో.. తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం రెండు అద్భుతమైన ప్లాన్స్ ను తీసుకొచ్చింది. ఏడాది పాటు సూపర్ ఫాస్ట్ 5 డేటా, వినోదం, అన్ లిమిటెడ్ కాల్స్ ను ఈ ప్లాన్స్ అందించనున్నాయి. అలాగే మరికొన్ని అదనపు ప్రయోజనాలను ఉచితంగా యూజర్లకు లభించనున్నాయి. ఇంతకీ ఆ ప్లాన్స్ ఏంటీ? వాటి ద్వారా యూజర్లకు ఒనగూరే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.

జియో రూ. 3599 ప్లాన్

జియో తీసుకొచ్చిన లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ లో రూ. 3599 ప్లాన్ ఒకటి. దీనిని రీఛార్జ్ చేసుకుంటే ప్రతీ రోజూ 2.5 GB 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ పూర్తయ్యేసరికి 912.5GB డేటాను యూజర్ పొందవచ్చు. అలాగే హై-స్పీడ్ డేటా పరిమితి ముగిసిన తర్వాత కూడా ఇంటర్నెట్ కొనసాగనుంది. అయితే 64 Kbps స్పీడ్ తో దానిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. అలాగే రోజుకు 100 SMS, అపరిమిత వాయిస్ కాల్స్ ఈ ప్లాన్ లో లభిస్తాయి. ఇక ఇదే ప్లాన్ లో జియో హాట్ స్టార్ కు సంబంధించి 3 నెలల సబ్‌స్క్రిప్షన్ (మొబైల్/టీవీ) వస్తుంది. అలాగే Google Gemini AI Pro సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో JioTV మరియు JioCloud వంటి యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్‌లు కూడా ఉన్నాయి. JioTV యాప్ ద్వారా 365 రోజుల పాటు వివిధ రకాల టీవీ షోలను ఆస్వాదించవచ్చు.

జియో రూ. 3999 ప్లాన్

Advertisement

జియో ప్రకటించిన రెండో ప్రిపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే.. ఇది ప్రతీ రోజూ 2.5 GB డేటాను అందిస్తుంది. అపరిమిత లోకల్, STD కాలింగ్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌లోనూ రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 3 నెలల జియో హాట్‌స్టార్ మొబైల్/టీవీ సబ్‌స్క్రిప్షన్, గూగుల్ జెమిని AI ప్రోకి ఉచిత యాక్సెస్ లభిస్తాయి. జియో టీవీ, జియోక్లౌడ్ వంటి యాప్‌లను ఫ్రీగా వినియోగించుకోవచ్చు.

Also Read: Restaurant Tax Evasion: 1.77 లక్షల రెస్టారెంట్లు.. రూ.70,000 కోట్ల స్కామ్.. తీగలాగితే డొంకంతా కదిలింది!

ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్

Advertisement

జియో తన రూ. 3999 ప్లాన్‌తో ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్‌ను సైతం అందిస్తోంది. ఇది వినియోగదారులకు లైవ్ స్పోర్ట్స్‌ను అందించే ఫ్యాన్‌కోడ్ ఓటీటీ యాప్‌కు ఫ్రీ యాక్సెస్ ను అందిస్తుంది. దీని ద్వారా ఫార్ములా – 1 రేసింగ్ వంటి లైవ్ స్పోర్ట్స్‌ను యాప్‌లో ఉచితంగా ఆస్వాదించవచ్చు. జియో తీసుకొచ్చిన రెండు ప్లాన్స్ ఒకే తరహా ప్రయోజనాలనే అందిస్తున్నాయి. రోజూవారి డేటా లిమిట్ లోనే కొద్దిగా మార్పులు ఉండటం గమనార్హం.

Also Read: Taliban Law: భార్యలను హింసించొచ్చు.. పిల్లల్ని సైతం వేధించొచ్చు.. అఫ్గాన్‌లో తాలిబన్ల కొత్త చట్టం!

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×