Small Business Ideas: మహిళలు తమ నైపుణ్యాలు, అభిరుచులు, ఆసక్తులను ఆదాయంగా మార్చుకోవచ్చు. ఇంటి నుంచే తీరిక దొరికినప్పుడు పనిచేసినా… మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే స్మాల్ బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకుందాం. మహిళలు తమ కుటుంబాన్ని చూసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూనే.. నచ్చినప్పుడల్లా పని చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో లేదా అసలు ఖర్చు లేకుండానే చిన్న వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఫుడ్, చేతి పనులు, టీచింగ్, డిజిటల్ స్కిల్స్… ఇలా వారి అనుభవాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించవచ్చు. సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ కూడా చేసుకోవచ్చు.
1. హోమ్ ఫుడ్స్, టిఫిన్, భోజన సెంటర్- కేవలం రూ.5,000 నుంచి 20,000 పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీ చుట్టు పక్కల వారి కోసం టిఫెన్, భోజనం సిద్ధం చేయవచ్చు. అలాగే చిరుతిండి, ఊరగాయలు, హోమ్ ఫుడ్స్ ఇలా ఏదైనా సరే తయారు చేయవచ్చు. స్నేహితులు, తెలిసిన వారితో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయవచ్చు. సమయం ఉంటే సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే జొమాటో, స్విగ్గీ డెలివరీ యాప్‌లతో భాగస్వామ్యానికి ప్రయత్నించవచ్చు.
2. హ్యాండీ క్రాఫ్ట్స్- ఈ రోజుల్లో చేతి నైపుణ్యానికి చాలా డిమాండ్ ఉంది. కేవలం రూ.5,000 నుంచి రూ.20,000 పెట్టుబడితో ఈ బిజినెస్ మొదలుపెట్టొచ్చు. కళలు, చేతి పనులపై ఇంట్రెస్ట్ ఉన్న గృహిణులు తమ అభిరుచులను ఆదాయంగా మార్చుకోవచ్చు. నగలు, అలంకరణ, కొవ్వొత్తులు, సబ్బులు, పెయింటింగ్‌ల ఇలా మార్కెట్ లో డిమాండ్ తమ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకోవచ్చు. అమెజాన్ హ్యాండ్‌మేడ్, ఇన్ స్టా గ్రామ్, క్రాఫ్ట్ ఫెయిర్‌లలో వీటికి మంచి ఆదరణ ఉంటుంది.
3. ఆన్‌లైన్ ట్యూటరింగ్, కోచింగ్ – కేవలం రూ.2,000 నుంచి రూ.10,000 ట్యూటరింగ్, కోచింగ్ సెంటర్ ప్రారంభించవచ్చు. ఆన్‌లైన్ లెర్నింగ్ కు ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉంది. స్కూల్ సబ్జెక్టులు, మ్యూజిక్, భాషలు, స్కిల్స్ కోర్సులలోని మీ నైపుణ్యం ట్యూటరింగ్ కు సహాయపడుతుంది. కంప్యూటర్, ఇంటర్నెట్ యాక్సెస్, వెబ్ క్యామ్, తగిన సామాగ్రి ఉంటే వీడియోలు రికార్డు చేసి సంబంధిత ప్లామ్ ఫామ్స్ కు విక్రయించవచ్చు.
4. బ్లాగింగ్ & ఫ్రీలాన్స్ రైటింగ్- రాయడం ఇష్టపడే గృహిణులు బ్లాగింగ్, కంటెంట్ రైటింగ్ లేదా కాపీ రైటింగ్‌ను ఎంచుకోవచ్చు. పేరెంటింగ్ సలహాలు, ఫుడ్ బ్లాగులు, లైఫ్ స్టైల్ , ఇలా చాలా బ్లాగ్ లకు కంటెంట్ అందించవచ్చు. ఒరిజినల్ కంటెంట్ కు ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉంది.
5. డే కేర్ సెంటర్స్- డే కేర్ సెంటర్ ను రూ.10,000 నుంచి రూ. 30,000 పెట్టుబడితో స్టార్ చేయవచ్చు. మీకు పిల్లలను చూడటం ఇష్టమైతే.. హోమ్ డే కేర్ సెంటర్ ప్రారంభించి ఆదాయం పొందవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి అనుకూలంగా ఆట గది ఉండేలా డేకేర్ సెంటర్ ను ఏర్పాటు చేసుకుంటే చాలు. దాంతో మంచి ఆదాయాన్ని లభిస్తుంది.
Also Read: బట్టలు ఇస్త్రీ చేస్తూ.. నెలకు రూ. 2,83,500 సంపాదన.. నివ్వెరపోతున్న నెటిజన్లు!
బ్యూటీ, వెల్నెస్ సర్వీసులు, బోటిక్, టైలరింగ్ సర్వీసులు, ఈవెంట్ ప్లానింగ్ , ఆన్ లైన్ రీసెల్లింగ్.. ఇలా తక్కువ పెట్టుబడితో మీరు బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. వ్యాపార రంగాల్లో మహిళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముద్ర యోజన, స్టాండ్ అప్ ఇండియా, SIDBI ప్రోగ్రామ్ ద్వారా రుణాలు అందిస్తుంది.