Dry Cleaning Business: సాధారణంగా ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వ్యాపారస్థులు నెలకు లక్షల్లో సంపాదిస్తుంటారు. నిరక్షరాస్యులతో పోలిస్తే.. చదువుకున్న వారికే ఈ రోజుల్లో అధిక మెుత్తంలో సంపాదించేందుకు మార్గాలు అధికంగా ఉంటాయని చాలామంది నమ్మకం. కానీ మహిళ మాత్రం ఈ అభిప్రాయాలను పటాపంచలు చేశారు. డబ్బు సంపాదనకు చదువుతో ఏమాత్రం సంబంధం లేదని మరోమారు నిరూపించారు. డ్రై క్లీనింగ్ ద్వారా నెలకు రూ.2.83 లక్షలు సంపాదిస్తూ ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
డ్రై క్లీనింగ్ చేసే ఓ మహిళ ఆదాయం గురించి.. నలిని ఉనగర్ అనే మహిళ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఇంటి దగ్గర ఉన్న డ్రై క్లీనింగ్ షాపులో భార్య భర్తలు (యజమానులు), ఒక ఇద్దరు వర్కర్లు పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. వారి ఆదాయం ఎలా ఉందని సూచాయగా అడగ్గా.. వారు చెప్పిన అంకెలు విని తాను ఆశ్చర్యపోయినట్లు నళిని తెలిపారు. వారు నెలకు రూ.2 లక్షలకు పైగా ఆదాయాన్ని గడిస్తున్నారని.. ఇది భారత్ లో పదేళ్లకు పైగా అనుభవం కలిగిన ఐటీ ఉద్యోగికి వచ్చే జీతంతో సమానమని ఆమె చెప్పారు.
Yesterday, I was talking with the dry cleaning shop owner near my house, where I regularly go. He and his wife both work together, and they have two helpers on salary. I was shocked when they said they earn around ₹2,00,000 per month, which is equal to a 10+ years experienced… pic.twitter.com/BjPddpb9Me
— Nalini Unagar (@NalinisKitchen) February 9, 2026
నళిని తెలిపిన లెక్కల ప్రకారం.. డ్రై క్లీనింగ్ ద్వారా భార్య భర్తలు నెలకు రూ. 2,83,500 సంపాదిస్తున్నారు. విద్యుత్ కోసం రూ.6000, సహాయకుల జీతాలకు రూ.40,000 తీసేసినా.. నెలకు రూ.2,37,500 లాభం వారికి వస్తోంది. వారు రోజూ 350 బట్టల వరకూ ఇస్త్రీ చేస్తున్నట్లు నళిని తెలిపారు. ఒక్కొక్కటి రూ.10 చొప్పున రోజుకు రూ.3,500 సంపాదిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇది కాకుండా బెడ్ షీట్స్, దుప్పట్లు వంటి భారీ వస్త్రాలను సైతం వారు డ్రై క్లీన్ చేస్తారని ఒక్కొక్కదానికి రూ.350 చొప్పున ఛార్జ్ చేస్తారని నళిని చెప్పారు. అలా రోజుకు 20 భారీ వస్త్రాలను డ్రై క్లీనింగ్ చేయడం ద్వారా మరో రూ.7000 అదనంగా సంపాదిస్తున్నట్లు తెలిపారు. నెలలో 3 రోజులు సెలవు కూడా తీసుకుంటామని డ్రై క్లీనింగ్ షాపు యజమానులు చెప్పినట్లు నళిని చెప్పుకొచ్చారు.
డ్రై క్లీనింగ్ చేస్తూ నెలకు రూ.2 లక్షలపైగా సంపాదిస్తుండటం నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీసింది. సంపాదన కోసం సొంత ఊరిని వదిలి.. ఎక్కడెక్కడికో పని చేయాల్సి వస్తోందని.. కానీ ఈ జంట తమకు వచ్చిన పనిని ఏంతో సంతృప్తిగా చేసుకుంటూ లక్షల్లో సంపాదిస్తోందని ఓ నెటిజన్ అన్నారు. ఈ రోజుల్లో సంపాదనకు ఉద్యోగం ఒక్కటే మార్గం కాదని.. మరెన్నో అవకాశాలు ఉన్నాయని ఇంకొకరు పేర్కొన్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ తాను నెల మెుత్తం కష్టపడి ఉద్యోగం చేస్తే రూ.50,000 కూడా రావడం లేదని వాపోయారు.
Also Read: YS Jagan: అసెంబ్లీకి జగన్.. తిరుమల కల్తీ నెయ్యిపై స్పందిస్తారా? సంతకం చేసి వెళ్తారా?