E-Paper
Advertisement

ఇంకా క్రెడిట్ హిస్టరీ లేదా? ఎలా పొందాలో తెలుసా?

ఇంకా క్రెడిట్ హిస్టరీ లేదా? ఎలా పొందాలో తెలుసా?
Advertisement

Credit History:మీరు లోన్ కోసం అప్లై చేసుకుంటే.. బ్యాంకు ఫస్ట్ మీ క్రెడిట్ స్కోర్ ను చెక్ చేస్తుంది. మీ లోన్ ఎలిజిబిలిటీ, రిస్క్ ను అంచనా వేస్తుంది. మీరు గతంలో తీసుకున్న లోన్ లేదా క్రెడిట్ కార్డు బిల్స్ ఎలా కట్టారో, దాని ఆధారంగా క్రెడిట్ బ్యూరోలు లోన్ ఎలిజిబిలిటీ నిర్ణయిస్తాయి. ఒకవేళ మీరు గతంలో ఎప్పుడూ లోన్ లేదా క్రెడిట్ కార్డు తీసుకోకపోతే, మీకు క్రెడిట్ హిస్టరీ ఉండకపోవచ్చు. అలాగే క్రెడిట్ స్కోర్ కూడా ఉండదు.

క్రెడిట్ హిస్టరీ లేకపోతే.. మొదటిసారి లోన్ లేదా క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకున్న వాళ్లు ఇబ్బంది పడతారు. ఎందుకంటే లోన్ లేదా క్రెడిట్ కార్డు ఇచ్చేందుకు మంచి క్రెడిట్ హిస్టరీ ఉండాలి. అందుచేత, కొత్తగా లోన్ కు అప్లై చేసుకునే వాళ్లు చిన్న మొత్తంలో లోన్ లేదా ఎంట్రీ లెవల్ క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలి. వీటిని తొందరగా గ్రాంట్ చేస్తారు. ఈ లోన్ సకాలం చెల్లిస్తే క్రెడిట్ హిస్టరీ డెవలప్ అవుతుంది. దీంతో పెద్ద మొత్తంలో లోన్ లేదా ప్రీమియం క్రెడిట్ కార్డు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.

సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు

Advertisement

ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను హామీగా చూపించి సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్‌ను పొందవచ్చు. ఎఫ్డీలో కొంత మీ క్రెడిట్ లిమిట్ గా మారుతుంది. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును కరెక్ట్ వాడుకుని క్రెడిట్‌ హిస్టరీని బిల్డ్ చేసుకోవచ్చు. FD హామీతో ఉండే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు బ్యాంకు సులభంగా జారీ చేస్తుంది. ఫస్ట్ టైమ్ లోన్ తీసుకునే వారు.. తమ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడానికి ఇదొక సులభమైన మార్గం.

బై నౌ పే లేటర్ (BNPL) రిటైల్ లావాదేవీలకు సంబంధించిన ఇదొక సులభమైన పద్ధతి. దీంట్లో కస్టమర్లు ముందుగా కొనుగోలు చేసి, బకాయిని తర్వాత చెల్లించవచ్చు. తక్కువ విలువ గల ఉత్పత్తులను కొనుగోలు చేసి పేమెంట్ తర్వాత చెల్లించే ఈ విధానం బాగా పాపులర్ అయింది. ఈఎంఐల రూపంలో నెలవారీ తిరిగి చెల్లించవచ్చు. ఈ లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేసి క్రెడిట్ స్కోరును పెంచుకోవచ్చు.

కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్

Advertisement

కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్ సాయంతో.. మీరు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, హౌస్ లేదా ఆఫీస్ ఫర్నిచర్ కొనుగోలు చేయవచ్చు. పర్సనల్ లోన్, హోమ్ లోన్, వ్యాపార రుణాలు, ఆటో రుణాలతో పోలిస్తే క్రెడిట్‌ హిస్టరీ పొందేందుకు కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లు బాగా ఉపయోగపడతాయి. కార్డు ప్రొవైడర్లు కస్టమర్ల లావాదేవీలను క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేస్తాయి. కాబట్టి, లోన్ మార్కెట్ లో కి కొత్తగా వచ్చిన వాళ్లు క్రెడిట్ హిస్టరీ పెంచుకునేందుకు కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్ ఉపయోగపడుతుంది.

Also Read: క్రెడిట్ కార్డు ఖర్చులు కంట్రోల్ ఉంచే 6 టిప్స్

సాలరీ అకౌంట్ క్రెడిట్ కార్డు

క్రెడిట్‌ కార్డు కోసం మీ సాలరీ అకౌంట్ లేదా బిజినెస్ అకౌంట్ ఉన్న బ్యాంకును సంప్రదించొచ్చు. ఈ లావాదేవీలు మెరుగ్గా ఉంటే అకౌంట్ హోల్డర్లకు బ్యాంకులు క్రెడిట్‌ కార్డులు, పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తాయి. చాలా బ్యాంకులు కస్టమర్ల సాలరీ అకౌంట్ ఆధారంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తాయి. క్రెడిట్‌ కార్డు లావాదేవీలు మెరుగ్గా ఉంటే మంచి క్రెడిట్‌ స్కోరు తద్వారా క్రెడిట్‌ హిస్టరీ పొందొచ్చు.

Related News

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

కొత్త ఉద్యోగంలో చేరారా? మీ PF ఖాతాలో ఈ 5 వివరాలు తప్పనిసరిగా చూడండి

Big Stories

Advertisement
×