E-Paper
Advertisement

Credit Card Tips: క్రెడిట్ కార్డు ఖర్చులు కంట్రోల్ ఉంచే 6 టిప్స్

Credit Card Tips: క్రెడిట్ కార్డు ఖర్చులు కంట్రోల్ ఉంచే 6 టిప్స్
Advertisement

Credit Card Tips: చేతిలో క్రెడిట్ కార్డు ఉంటే అప్పు కోసం వెతుక్కోవాల్సిన అవసరంలేదు. క్రెడిట్ కార్డులు ఆర్థిక ఇబ్బందులను తగ్గించడమే కాకుండా రివార్డులు, ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నాయి. అయితే అసలు సమస్య బిల్లు కట్టేటప్పుడు మొదలవుతుంది. కరెక్ట్ టైమ్ కి క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే.. క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. క్రెడిట్ కార్డు ఖర్చులను కంట్రోల్ లో పెట్టుకునే ఆరు సింపుల్ మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నెలవారీ ఖర్చులపై లిమిట్

క్రెడిట్ కార్డు నెలవారీ ఖర్చులపై లిమిట్ పెట్టుకోండి. మీ శాలరీ లేదా ఇన్ కమ్ ఆధారంగా ప్రతి నెలా మీరు ఎంత ఖర్చు చేస్తే.. సకాలంలో తిరిగి చెల్లించగలరో ముందే నిర్ణయించుకోండి.

రెగ్యులర్ ట్రాకింగ్

Advertisement

ఖర్చులను రెగ్యులర్ గా ట్రాక్ చేయండి. క్రెడిట్ కార్డును ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత, ప్రతి వారం కనీసం ఒక్కసారైనా మీ లావాదేవీలను చెక్ చేయండి. ఇలా ట్రాక్ చేయడం వల్ల అదనపు ఖర్చులు చేయకుండా మీ బడ్జెట్ లోబడి ఉండవచ్చు.

బిల్లుల పేమెంట్

బిల్లును పూర్తిగా చెల్లించండి.. ప్రతి నెలా గడువు తేదీకి ముందే క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని చెల్లించండి. మినిమమ్ అమౌంట్ పే ట్రాప్ లో పడకండి. ఎందుకంటే ఇందులో ఎక్కువ వడ్డీ ఛార్జ్ చేస్తారు.

30 శాతం లిమిట్

Advertisement

క్రెడిట్ కార్డును తక్కువగా వాడండి. మీ క్రెడిట్ లిమిట్ లో 30% కంటే తక్కువే ఖర్చు చేయండి. మీరు తక్కువ ఖర్చు చేస్తుంటే.. క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది.

తక్కువ క్రెడిట్ కార్డులు

వీలైనన్ని తక్కువ క్రెడిట్ కార్డులు వాడండి… మీరు రెండు కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తుంటే, వాటి వినియోగాన్ని రివ్యూ చేస్తూ ఉండండి. ఎందుకంటే, ఎక్కువ క్రెడిట్ కార్డులు గందరగోళానికి గురిచేసి, ఖర్చును పెంచేస్తాయి. పరిమిత సంఖ్యలో క్రెడిట్ కార్డులు ఉంటే.. తక్షణ అవసరాలు తీర్చుకోవడంతో పాటు ఆర్థిక స్థితిని హెల్తీగా ఉంచుకోవచ్చు.

ఆటోమేటిక్ చెల్లింపులు

క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడే బిల్లు పేమెంట్ కు ఆటోడెబిట్ ఆప్షన్ పెట్టుకోండి. క్రెడిట్ కార్డు బిల్లు తేదీలను మిస్ అయితే.. క్రెడిట్ స్కోర్‌పై ఎఫెక్ట్ పడుతుంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఆటోడెబిట్ బెస్ట్ ఆప్షన్.

ఇవి గుర్తుపెట్టుకోండి

ఇష్టారీతిన క్రెడిట్ కార్డు వాడితే అప్పులు, అధిక వడ్డీలు, లేట్ ఫైన్, క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రతికూల ప్రభావాలు..ఇలా అనేక రిస్క్ లు ఉంటాయి. అందుకే, క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకునే ముందు మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అంచనా వేసుకోవాలి.

Also Read:  మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? వీటిని అస్సలు కొనొద్దు.. చేశారో చిక్కుల్లో పడ్డట్లే!

Related News

ఫుడ్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. SBI ఎటర్నల్ కార్డ్ లాంచ్.. ఉచితంగా జొమాటో గోల్డ్ సేవలు!

బంగారం-వెండి వస్తువుల ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

చిన్న వయసులోనే కోటీశ్వరుడు అవ్వడం ఎలా? ఇదిగో అత్యుత్తమ ప్లాన్.. రూ.10 వేలు ఉంటే చాలు!

పోటీకి మేం సిద్ధమే.. మస్క్ ఆరోపణలపై రిలయన్స్ స్ట్రాంగ్ కౌంటర్

మధ్యతరగతి రిటైర్మెంట్ కోసం రూ.1 కోటి సరిపోతుందా? భవిష్యత్తు కోసం మేజిక్ ఫిగర్ ఎంత?

భార్య లోన్ కట్టకపోతే భర్త పెన్షన్ డబ్బులు కట్ చేసిన బ్యాంక్.. కోర్టు తీర్పు ఇదే

తప్పుడు అకౌంట్‌కు యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!

డబ్బులు కావాలని ఫోన్ చేస్తే.. బంధువులు, స్నేహితులకు ‘నో’ చెప్పడం ఎలా?

Big Stories

Advertisement
×