E-Paper
Advertisement

Ola Electric First Bike: ఓలా తొలి ఎలక్ట్రిక్‌ బైక్‌.. పూనకాలకు రెడీగా ఉండండి ఫ్రెండ్స్..!

Ola Electric First Bike: ఓలా తొలి ఎలక్ట్రిక్‌ బైక్‌.. పూనకాలకు రెడీగా ఉండండి ఫ్రెండ్స్..!
Advertisement

ola electric first ever bike: ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మార్కెట్‌లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఓలా కింగ్ మేకర్‌గా ఉంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా ఎలక్ట్రిక్ ముందు వరుసలో ఉంది. ఇక ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో తన సత్తా చాటిన ఓలా ఇప్పుడు మరొక అడుగు ముందుకేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఓలా ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌పై ఫోకస్ పెడుతున్నట్లు సమచారం. ఇది ఓలా ఎలక్ట్రిక్ నుంచి రాబోతున్న మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఇదే కావడం గమనార్హం. అయితే ఇది ఒక బైక్‌ కాకుండా నాలుగు ఎలక్ట్రిక్ బైక్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

అయితే ఈ ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లు ఎప్పుడు లాంచ్ అవుతాయనేదానిపై తాజాగా కొన్ని లీక్‌లు బయటకొచ్చాయి. ఓలా ఎలక్ట్రిక్ తన తొలి ఈవీ బైక్‌ని 2026 ఏడాదిలోని తొలి 6 నెలల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగాలో మార్కెట్‌ని శాసిస్తున్న ఓలా.. త్వరలో ఎలక్ట్రిక్ బైక్‌ల విభాగంలో మరింత టాప్ ప్లేస్‌లో ఉండబోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Also Read: మాస్ అప్డేట్‌లతో మళ్లీ వస్తున్న ‘హీరో డెస్టినీ 125’.. ఇక చూసుకో మావా..!

2025 ప్రథమార్ధంలో ఓలా ఎస్1ఎక్స్ సిరీస్‌లో ఎస్ 1ఎక్స్(2కిలో వాట్), ఎస్1ఎక్స్ (3 కిలో వాట్స్) ఎలక్ట్రిక్ స్కూటర్లను రిలీజ్ చేయనుంది. దీని తర్వాత 2026 ప్రథమార్ధం నుంచి డైమండ్ హెడ్, రోడ్ స్టర్, అడ్వెంచర్, క్రూయిజర్ వంటి కొత్త బైక్‌లను ఓలా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2026 లో తొలి ఆరు నెలల నాటికి ఓల ఎలక్ట్రిక్ బైక్‌లను వినియోగదారులకు డెలివరీ చేయడం ప్రారంభించే అవకాశం ఉంది.

Advertisement

ఈ బైక్ బుకింగ్స్ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఓలా రిలీజ్ చేయనుంది. కాగా ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే రోడ్‌స్టర్ బైక్ డిజైన పేటెంట్ కోసం అప్లై చేసుకున్నట్లు సమాచారం. ఈ నాలుగు ఎలక్ట్రిక్ బైక్‌లను ఓలా ఎలక్ట్రిక్ ఒకే ప్లాట్ ఫార్మ్‌పై నిర్మించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కావున ఈ నాలుగు బైక్‌లకి ఒకే బ్యాటరీ, ఒకే ఎలక్ట్రిక్ మోటారును అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో ఈ బైక్‌ల గురించి మరిన్ని అప్డేట్లు రానున్నాయి.

Tags

Related News

Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్.. కేంద్రం క్లారిటీ, వారే అర్హులు

ఆభరణాలకు పింక్ పేపరే ఎందుకు? దాని వెనుక ఉన్న రహస్యమేంటి?

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆషాడ వేళ పసిడి షాక్.. ఆశలకి బ్రేక్ వేస్తూ మళ్ళీ పైపైకి బంగారం ధరలు!

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

Big Stories

Advertisement
×