BigTV English
Advertisement

Ola Electric Offer: కిక్కిచ్చే ఆఫర్.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్లు.. మరో నాలుగు రోజులు మాత్రమే..!

Ola Electric Offer: కిక్కిచ్చే ఆఫర్.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్లు.. మరో నాలుగు రోజులు మాత్రమే..!

ola electric announces up to rs 15000 discounts on s1 ev portfolio: భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అతి తక్కువ కాలంలోనే ఎవరూ ఊహించని ప్రజాదరణ అందుకొని అగ్రస్థానంలో ఉంది. తరచూ కొత్త కొత్త అప్డేట్‌లతో పలు మోడళ్లను తీసుకొస్తూ ఎలక్ట్రిక్ వాహన ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ రాబడుతుంది. అంతేకాకుండా సేల్స్‌లో కూడా తన హవా చూపిస్తుంది. గత నెలలో ఓలా ఎలక్ట్రిక్స్ 37191 ఎలక్ట్రిక్ స్కూటర్లను సేల్ చేసి అదరగొట్టేసింది. ఇక ఇప్పుడు తన స్కూటర్ల సేల్స్‌ను మరింత పెంచేందుకు అదిరిపోయే నిర్ణయం తీసుకుంది.


ఇందులో బాగంగానే ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్లు జూన్ 20 నుంచి స్టార్ట్ అయ్యాయి. జూన్ 26 వరకు కొనసాగనున్నాయి. ఈ సేల్‌లో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 లైన‌ప్‌లో ఉన్న స్కూటర్ల కొనుగోలుపై ఏకంగా రూ.15000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 లైనప్‌లో ఉన్న ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ కొనుగోలుపై రూ.5000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Also Read: భారతీయులకు ఇష్టమైన బైకులు ఇవే.. పిచ్చపిచ్చగా కొనేస్తున్నారు!


అయితే కంపెనీ ఈ స్కూటర్‌పై రూ.5000 ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.5000, క్యాష్‌బ్యాక్ రూ.5000 పొందొచ్చు. అలాగే దీంతోపాటు ఎస్ 1 ఎయిర్, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుపై రూ.5000 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ లభిస్తుంది. ఇదేకాదు.. రూ.2999 ధర గల ఉచిత ఓలా కేర్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీ కూడా ఫ్రీగా లభిస్తుంది. ఇక ఇందులో ఓలా ఎస్1 ఎక్స్ 2కిలో వాట్స్ బ్యాటరీ కలిగిన స్కూటర్ రూ.74,999 ధరతో లభిస్తుంది. అలాగే ఎస్1 ప్రో రూ.1,29,999 ధరతో అందుబాటులో ఉంటుంది.

కాగా ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం డిస్కౌంట్లతో పాటు తన లైనప్‌లో ఉన్న మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద ఎక్స్‌ట్రా ఖర్చు లేకుండా 8 ఏళ్లు లేదా 80,000 కి.మీ వారంటీ ఇస్తుంది. అందువల్ల తక్కువ ధరలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుక్కోవాలనుకునే వారికి ఇదొక మంచి ఛాన్స్ అనే చెప్పాలి. ఇక్కడ మరోసారి గుర్తుంచుకోవలసిన విషయం ఏంటేంటే.. ఈ ఆఫర్ జూన్ 26 వరకు మాత్రమే ఉంటుంది.

Tags

Related News

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Big Stories

×