BigTV English

Top 5 Selling Bikes: భారతీయులకు ఇష్టమైన బైకులు ఇవే.. పిచ్చపిచ్చగా కొనేస్తున్నారు!

Top 5 Selling Bikes: భారతీయులకు ఇష్టమైన బైకులు ఇవే.. పిచ్చపిచ్చగా కొనేస్తున్నారు!

Top 5 Selling Bikes: భారతదేశంలో బడ్జెట్ సెగ్మెంట్ బైక్‌లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దీంతో పాటు ప్రీమియం బైక్‌ల విక్రయాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ప్రతి నెలా ద్విచక్ర వాహనాల కంపెనీలు తమ విక్రయాల నివేదికలను విడుదల చేస్తాయి. ఈసారి కూడా బెస్ట్ సెల్లింగ్ బైక్స్ వివరాలు వచ్చాయి. ఈ క్రమంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 5 బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త బైక్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేసినప్పుడు.. ఏ మోడల్‌కు ఎక్కువ డిమాండ్ ఉందో కూడా తెలుసుకోవచ్చు.


1. Hero Splendor
ఈసారి కూడా హీరో మోటోకార్ప్‌కు చెందిన స్ప్లెండర్ ప్లస్ బెస్ట్ సెల్లింగ్ బైక్‌గా నిలిచింది. గత నెలలో 3,04,663 యూనిట్ల స్ప్లెండర్ సేల్ అవగా.. గతేడాది మే నెలలోనే 3,42,526 యూనిట్ల స్ప్లెండర్ అమ్ముడైంది. గతేడాది కంటే ఈసారి కంపెనీ 37,863 యూనిట్లు తక్కువగా అమ్మకాలు జరిపింది. ప్రస్తుతం ఈ బైక్ మార్కెట్ వాటా 36.03శాతం. ఈ బైక్‌లో 100 సీసీ ఇంజన్ ఉంది. స్ప్లెండర్  సాధారణ డిజైన్ దీని ప్రత్యేకత. బైక్ ఎక్స్-షో రూమ్ ధర రూ.75,141 నుండి ప్రారంభమవుతుంది.

Also Read: కొత్త పల్సర్ లాంచ్.. ఇక రోడ్లపై దుమ్ములేపుడే!


2.Honda Shine
గత నెలలో హోండా షైన్ 1,49,054 యూనిట్లు విక్రయించగా గతేడాది మే నెలలోనే 1,03,699 యూనిట్ల షైన్ అమ్ముడయ్యాయి. గతేడాది కంటే ఈసారి కంపెనీ 45,355 యూనిట్లు తక్కువగా విక్రయించింది. ప్రస్తుతం ఈ బైక్ మార్కెట్ వాటా 17.63 శాతం. హోండా షైన్ 100సీసీ, 125సీసీ ఇంజన్లలో లభిస్తుంది. బైక్ ఎక్స్-షోరూం ధర రూ.65 వేల నుంచి మొదలవుతుంది.

3. Bajaj Pulsar
పల్సర్ సిరీస్‌ను చాలా కాలంగా భారత్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. మీరు పల్సర్‌లో అనేక వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. బజాజ్ గత నెలలో 1,28,480 యూనిట్ల పల్సర్‌లను విక్రయించగా, గత ఏడాది మే నెలలోనే పల్సర్ 1,28,403 యూనిట్లను సేల్ చేసింది. గతేడాది కంటే ఈసారి కంపెనీ 77 యూనిట్లు ఎక్కువగా అమ్మకాలు జరిపింది. ప్రస్తుతం ఈ బైక్ మార్కెట్ వాటా 15.1 శాతం పల్సర్ సిరీస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 89,984 నుండి ప్రారంభమవుతుంది.

4.Hero HF Deluxe
హీరో మోటోకార్ప్ తన ఎంట్రీ లెవల్ బైక్ హెచ్‌ఎఫ్ డీలక్స్‌ను గత నెలలో 87,143 యూనిట్లు అమ్మకాలు జరపగా, గత ఏడాది మే నెలలోనే 1,09,100 యూనిట్ల హెచ్‌ఎఫ్ డీలక్స్ అమ్ముడయ్యాయి. గతేడాది కంటే ఈసారి కంపెనీ 21,957 యూనిట్లు ఎక్కువగా సేల్ చేసింది. ప్రస్తుతం ఈ బైక్ మార్కెట్ వాటా 10.1శాతం. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో బాగా పాపులర్ అయిన బైక్. చిన్న పట్టణాలు, గ్రామాలను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్‌ను తీసుకొచ్చారు. ఈ బైక్‌లో 100సీసీ ఇంజన్ ఉంది.

Also Read:బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూ.10 ఖర్చుతో 100 కిమీ నడుస్తాయి!

5. TVS Apache
టీవీఎస్ మోటార్ గత నెలలో 37,906 యూనిట్ల అపాచీని విక్రయించగా, గత ఏడాది కంపెనీ 41,955 యూనిట్లు సేల్ చేసింది. ప్రస్తుతం ఈ బైక్ మార్కెట్ వాటా 4.48శాతం. అపాచీ సిరీస్ ధర రూ.95 వేల నుంచి ప్రారంభమవుతుంది.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×