E-Paper
Advertisement

ఆకాశమే హద్దుగా పసిడి పరుగులు.. సామాన్యుడికి భారంగా మారుతున్న పసిడి కల!

ఆకాశమే హద్దుగా పసిడి పరుగులు.. సామాన్యుడికి భారంగా మారుతున్న పసిడి కల!
Advertisement

Gold Silver Rates: వామ్మో.. బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి ధరలు ఒక్కసారిగా రెక్కలు తొడిగాయి. గడిచిన కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు, ఒక్కసారిగా ఊహించని రీతిలో పెరగడంతో అటు పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న తరుణంలో కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,930 ఉండగా.. నేడు బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,350 వద్ద పలుకుతుంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,100 కాగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,400 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,420 పెరిగింది.

Advertisement

పెరుగుతున్న ధరలకు కారణాలేంటి? మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు?
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ పరిశీలిస్తే, మునుపెన్నడూ లేని విధంగా 10 గ్రాముల బంగారం ధర సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. డాలర్ విలువలో మార్పులు, సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేసుకోవడం వంటి అంశాలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దీనికి తోడు వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తుండటంతో సామాన్యుడు ఇల్లు గడవడం కష్టమవుతున్న వేళ, ఈ పసిడి భారం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ మీరు ఏదైనా శుభకార్యాల కోసం బంగారం కొనాలని ప్లాన్ చేస్తుంటే, మార్కెట్ కదలికలను నిశితంగా గమనించి సరైన నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,350 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,400 వద్ద కొనసాగుతుంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,350 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,400 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,350 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,400 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,500 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,42,550 వద్ద ఉంది.

నేటి సిల్వర్ ధరలు..
ద్యావుడా.. నిన్నమొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న సిల్వర్ ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి. అయితే నేటి ధరలు చూసుకుంటే.. నిన్న మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,65,000 కాగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,75,000 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ. 10,000 పెరిగింది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ రూ. 15,000 పెరిగి.. ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర రూ. 2,70,000 వద్ద పలుకుతోంది.

Also Read: లేఆఫ్‌లో రెండుసార్లు ఉద్యోగం ఫట్.. కట్ చేస్తే నెలకు రూ.1.3 కోట్లు సంపాదన, అదెలా?

Related News

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

కొత్త ఉద్యోగంలో చేరారా? మీ PF ఖాతాలో ఈ 5 వివరాలు తప్పనిసరిగా చూడండి

Big Stories

Advertisement
×