E-Paper
Advertisement

Layoffs to Business: లేఆఫ్‌లో రెండుసార్లు ఉద్యోగం ఫట్.. కట్ చేస్తే నెలకు రూ.1.3 కోట్లు సంపాదన, అదెలా?

Layoffs to Business: లేఆఫ్‌లో రెండుసార్లు ఉద్యోగం ఫట్.. కట్ చేస్తే నెలకు రూ.1.3 కోట్లు సంపాదన, అదెలా?
Advertisement

Layoffs to Business: కార్పొరేట్ కంపెనీల్లో లేఆఫ్స్ (ఉద్యోగాల్లో కోత) అనేవి సర్వ సాధారణంగా మారిపోయాయి. ఈ క్రమంలో ఉద్యోగంలో వరుసగా రెండుసార్లు లేఆఫ్స్ ఎదుర్కొన్న 34 ఏళ్ల వ్యక్తి.. ఇప్పుడు సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించి నెలకు ఏకంగా ₹1.3 కోట్లు (1,40,000 డాలర్లు) సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంతకీ అతనెవరు? అతడి లైఫ్ లో టర్నింగ్ పాయింట్స్ ఏంటీ? ఈ కథనంలో పరిశీలిద్దాం.

పాకిస్థాన్ మూలాలు ఉన్న అమెరికన్ పారిశ్రామికవేత్త జీషన్ బఖ్రానీ (Zeeshan Bakhrani) తను ఈ స్థాయికి రావడానికి గల కారణాలను వెల్లడించారు. సీఎన్‌బీసీ (CNBC)కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం.. ఆయన గతంలో న్యూయార్క్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా దాదాపు పదేళ్లపాటు కార్పొరేట్ రంగంలో పనిచేశారు. 2023లో మొదటిసారి, ఆ తర్వాత 2025లో రెండోసారి లేఆఫ్స్ కారణంగా జీషన్ తన ఉద్యోగాన్ని కోల్పోయారు. దీంతో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న జీషన్.. తనకున్న వంట నైపుణ్యాన్ని వ్యాపారంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే న్యూయార్క్‌లోని మాన్హాటన్‌లో ‘నిషాన్’ (Nishaan) పేరుతో 2025 ఆగస్టులో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. తను దాచుకున్న సొమ్ము నుంచి సుమారు రూ.65 లక్షలు (70,000 డాలర్లు) పెట్టుబడి పెట్టారు. తన రెస్టారెంట్ లో పాకిస్తానీ, అమెరికన్ రుచులను కలిపి విభిన్నమైన మెనూను జీషన్ రూపొందించారు. ఉదాహరణకు బిహారీ టకోస్, పాకిస్తానీ చాప్డ్ చీజ్ శాండ్‌విచ్‌లు, బఫెలో తందూరి చికెన్ శాండ్‌విచ్‌లు వంటి వంటకాలను స్థానికంగా ఎంతో పాపులర్ చేశారు.

Also Read: Bihar New CM: బిహార్‌కు కొత్త సీఎం.. నితీశ్ స్థానంలోకి సామ్రాట్ చౌదరి.. ఆయన ఎంత పవర్‌ఫుల్లో తెలుసా?

Advertisement

రెస్టారెంట్ ప్రారంభించిన కొద్ది నెలల్లోనే వ్యాపారం బాగా పుంజుకున్నట్లు జీషన్ బఖ్రానీ తెలిపారు. ప్రస్తుతం నెలకు రూ.1.3 కోట్ల వరకు రెవెన్యూ లభిస్తోందని అన్నారు. కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్నప్పుడే వీకెండ్స్‌లో చిన్నపాటి ఫుడ్ స్టాల్స్ (Pop-ups) నిర్వహించడం, అలాగే ‘ద గ్రేట్ ఫుడ్ ట్రక్ రేస్’ వంటి పోటీల్లో పాల్గొని గెలవడం ద్వారా తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని జీషన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రోజుకు 14 గంటల వరకు కష్టపడుతున్నప్పటికీ తన సొంత నిర్ణయాలతో వ్యాపారం చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

Also Read: TCS Nashik Case: మహిళా ఉద్యోగులపై వేధింపులు.. మత మార్పిడికై ఒత్తిడి.. వెలుగులోకి నమ్మలేని నిజాలు!

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×