E-Paper
Advertisement

అక్షయ తృతీయ వేళ అదిరిపోతున్న గోల్డ్ రేట్లు.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి

అక్షయ తృతీయ వేళ అదిరిపోతున్న గోల్డ్ రేట్లు.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి
Advertisement

Gold Rate Hike: అయ్యయ్యో.. దేశీయ మార్కెట్‌లో పసిడి పరుగు ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు వెరసి బంగారాన్ని ఆకాశానికి చేరుస్తున్నాయి. గడిచిన మూడు రోజులుగా తులం బంగారం ధర వేలల్లో పెరుగుతూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు ఏప్రిల్ 19న రాబోతున్న అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా డిమాండ్ భారీగా పెరగడం కూడా ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,350 ఉండగా.. నేడు గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,570 వద్ద పలుకుతుంది. అలాగే బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,400 కాగా.. నేడు గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,600 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.220 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,570 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,600 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,570 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,600 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,570 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,600 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,720 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,42,750 వద్ద ఉంది.

నేటి సిల్వర్ ధరలు..
హమ్మయ్య.. నేడు పసిడి ధరలు పెరిగిన.. సిల్వర్ ధరలలో ఎలాంటి మార్పు లేదు.. నేటి ధరలు చూసుకుంటే.. నేడు గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 2,75,000 వద్ద కొనసాగుతుంది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో కూడా నేడు కేజీ సిల్వర్ ధర రూ. 2,70,000 వద్ద పలుకుతోంది.

Also Read: ఇంకా క్రెడిట్ హిస్టరీ లేదా? ఎలా పొందాలో తెలుసా?

Related News

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

Big Stories

Advertisement
×