E-Paper
Advertisement

Gold Rate Dropped: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎంతంటే?

Gold Rate Dropped: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎంతంటే?
Advertisement

Gold Rate Dropped: అయ్యబాబోయ్.. నిన్నమొన్నటి వరకు దూసుకెళ్లిన బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలడంతో సామాన్య వినియోగదారులకు భారీ ఊరట లభించింది. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ 2026 ప్రకటనల నేపథ్యంలో మార్కెట్‌లో అనిశ్చితి నెలకొనడం, అంతర్జాతీయంగా డాలర్ విలువ బలపడటం ఈ భారీ పతనానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. గత రెండు, మూడు రోజుల్లోనే తులం బంగారం ధర వేలల్లో తగ్గడం విశేషం. గ్లోబల్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు తమ లాభాలను స్వీకరిస్తూ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల దేశీయంగా కూడా పసిడి రేట్లు రికార్డు స్థాయిలో కిందికి దిగివస్తున్నాయి.

నేడు బంగారం ధరలు ఇలా..
బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,580 ఉండగా.. నేడు సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,530 వద్ద ఉంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,200 కాగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,900 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.9,050 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,51,530 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,900 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,530 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,900 వద్ద కొనసాగుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,530 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,900 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,530 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,38,900 వద్ద కొనసాగుతోంది.

Also Read: రూ. 20 వేల కంటే ఎక్కువ క్యాష్ ఇస్తున్నారా?.. 100 శాతం జరిమానా తెలుసా?

నేటి సిల్వర్ ధరలు ఇలా..
హమ్మయ్య.. బంగారం ధరలతో పాటు సిల్వర్ ధరలు కూడా భారీగా పతనమవుతున్నాయి. గత మూడు రోజుల నుంచి ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు తగ్గుతున్నాయి. దీంతో బంగారం, సిల్వర్ కొనాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. అయితే శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 3,20,000 కాగా.. నేడు సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,00,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.20,000 తగ్గింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 3,00,000 వద్ద పలుకుతోంది. అయితే పెళ్లిళ్లు, శుభకార్యాల వేళ పసిడి, సిల్వర్ ధరలు తగ్గడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ఎవరైనా.. పసిడి, సిల్వర్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. లేదంటే మళ్లీ పెరిగితే అప్పుడు మీరే నష్టపోతారు.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×