E-Paper
Advertisement

Income Tax Rules: రూ.20 వేల కంటే ఎక్కువ క్యాష్ అప్పు ఇస్తున్నారా? అడ్డంగా బుక్కైపోతారు!

Income Tax Rules: రూ.20 వేల కంటే ఎక్కువ క్యాష్ అప్పు ఇస్తున్నారా? అడ్డంగా బుక్కైపోతారు!
Advertisement

Income Tax Rules: మీరు మీ స్నేహితుడికి రూ.20,000 కంటే ఎక్కువ మొత్తం నగదు రూపంలో ఇస్తే అది చట్ట విరుద్ధం. ఆదాయపన్ను చట్టం మేరకు మీకు భారీగా జరిమానాలు విధిస్తారు. మీరు మీ స్నేహితుల నుండి రూ.20,000 కంటే ఎక్కువ నగదు రుణాలు లేదా డిపాజిట్లను తీసుకుంటే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 269SS, 271D కింద భారీగా జరిమానా విధిస్తారు. పన్ను ఎగవేతను అరికట్టడానికి ఈ నియమాలు తీసుకొచ్చారు. రూ.20 వేల పరిమితికి మించి నగదు లావాదేవీలు చట్ట విరుద్ధం. అందుకే రూ.20 వేలకు పైబడిన చెల్లింపులను UPI, బ్యాంక్ ద్వారా ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ లేదా చెక్కులు ద్వారా చెల్లించడం ఉత్తమం.

స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు పెద్ద మొత్తంలో డబ్బును నగదు రూపంలో ఇవ్వడం ప్రమాదకరమే. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, రూ.20,000 కంటే ఎక్కువ నగదు అప్పుగా ఇవ్వడం లేదా తిరిగి చెల్లించడం చట్టవిరుద్ధం. దీనిని నల్లధనం, గుర్తించలేని లావాదేవీలుగా పరిగణిస్తారు. అందుకే ఎప్పుడూ డిజిటల్ లేదా బ్యాంక్ ద్వారా NEFT, RTGS, లేదా చెక్కు ద్వారా లావాదేవీలు కొనసాగించాలి.

సే నో టు క్యాష్

Advertisement

ఆదాయపు పన్ను చట్టం మేరకు వ్యక్తిగత నగదు లావాదేవీలపై పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితికి మించి నగదు చెల్లింపులు చేస్తే పన్ను ఎగవేతగా భావించవచ్చు. అందుకే సురక్షితంగా, ఎలాంటి జరిమానా పడకుండా ఉండేందుకు UPI లేదా బ్యాంక్ ట్రాన్స్ ఫర్ చేయడం మంచిదని అధికారులు అంటున్నారు.

స్నేహితుడికి నగదు రుణం

మీరు మీ స్నేహితుడి నుండి రూ.30,000 క్యాష్ అప్పు రూపంలో తీసుకుంటే.. మీరు సెక్షన్ 269SS ను ఉల్లంఘించినట్లు లెక్క. ఈ మొత్తంపై భారీగా పెనాల్టీ విధిస్తారు. UPI, NEFT, RTGS, చెక్కు లేదా బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా మనీ బదిలీ చేయాలని నిపుణులు అంటున్నారు.

సెక్షన్ 269SS ఏం చెబుతుంది?

Advertisement

మీరు రూ.20,000 లేదా అంతకంటే ఎక్కువ నగదును ఇవ్వడం లేదా తీసుకోవడం నిషేధం. రూ.20 వేలు కంటే ఎక్కువ నగదు లోన్, డిపాజిట్, అడ్వాన్స్ రూపంలో తీసుకోకూడదని సెక్షన్ 269SS చెబుతోంది. అయితే ఈ సెక్షన్ నుంచి బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలకు మినహాయింపు ఉంది.

సెక్షన్ 269ST ప్రకారం ప్రతి వ్యక్తికి రూ.2 లక్షల నగదు పరిమితి ఉంది. అంటే రూ.2,00,000 లేదా అంతకంటే ఎక్కువ నగదును ఒకే రోజులో ఒక వ్యక్తి నుండి స్వీకరించడం లేదా ఇవ్వడం చట్ట విరుద్ధం. రూ.2 లక్షల పరిమితి దాటితే సెక్షన్ 271DA ప్రకారం 100% జరిమానా విధిస్తారు. రుణాలను నగదు రూపంలో తిరిగి చెల్లిస్తే కూడా భారీగా జరిమానాలు విధిస్తారు. రూ.2 లక్షలకు మించితే ఎలక్ట్రానిక్ చెల్లింపుల ద్వారానే చెల్లించాలి.

Also Read: బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్లకు ఏముంది?.. విలేకరి ప్రశ్నకు నిర్మలమ్మ రియాక్షన్ వైరల్

Related News

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

Big Stories

Advertisement
×