E-Paper
Advertisement

Qatar LNG production Halt: ఎల్‌ఎన్‌జి ఉత్పత్తికి బ్రేక్ వేసిన ఖతార్.. ప్రపంచ గ్యాస్ మార్కెట్లపై ప్రభావం

Qatar LNG production Halt: ఎల్‌ఎన్‌జి ఉత్పత్తికి బ్రేక్ వేసిన ఖతార్.. ప్రపంచ గ్యాస్ మార్కెట్లపై ప్రభావం
Advertisement

Qatar LNG production Halt: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరమయ్యాయి. దీనికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు ఉధృతం చేసింది ఇరాన్. అమెరికా-ఇజ్రాయెల్ దేశాలకు అండగా నిలబడే మిడిల్‌ఈస్ట్ లోని కొన్ని దేశాలపై విరుచుకుపడింది. ఆయల్ ఉత్పత్తి చేసే ప్రాంతాలపై డ్రోన్లతో దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో ఖతార్ సోమవారం నుంచి LNG సహజ వాయువు ఉత్పత్తిని నిలిపి వేసింది. ఆ బాటలో చుట్టుపక్కల దేశాలు పయనిస్తున్నాయి.

ఇరాన్ దాడులు.. ఎల్‌ఎన్‌జి ఉత్పత్తికి బ్రేక్ వేసిన ఖతార్

Advertisement

ప్రపంచ సరఫరాలో ఖతార్ ఎల్‌ఎన్‌జి ఉత్పత్తి సరఫరా దాదాపు 20 శాతం. ఆసియా, యూరోపియన్ మార్కెట్ల ఇంధన డిమాండ్‌ను సమతుల్యం చేయడంలో ఆ దేశానికి కీలక పాత్ర. మధ్యప్రాచ్యంలో వరుసగా మూడో రోజు దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని అతిపెద్ద దేశీయ చమురు శుద్ధి కర్మాగారంలో కార్యకలాపాలు నిలిచిపోయాయి.

ఇరాకీ కుర్దిస్తాన్‌లో ఇజ్రాయెల్ గ్యాస్ క్షేత్రాలలో చమురు ఉత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా ఈజిప్టుకు ఎగుమతులు నిలిచిపోయాయి. సహజ వాయువు ప్రాసెసింగ్ యూనిట్లకు నిలయంగా ఉన్న ఖతార్‌లోని రాస్ లఫాన్ కాంప్లెక్స్‌పై ఆదివారం రాత్రి డ్రోన్ దాడులు జరిగాయి. ఈ కాంప్లెక్స్ నుంచి ఓడల ద్వారా వివిధ దేశాలకు ఎగుమతి జరిగేది.  సహజ వాయువును ద్రవ రూపంలోకి మార్చే భారీ ప్రాసెసింగ్ యూనిట్లు ఇక్కడే ఉన్నాయి.

Advertisement

ఫలితంగా ఖతార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఖతార్ ఎనర్జీ కంపెనీకి 82 శాతం క్లయింట్లు ఆసియన్లు. ఖతార్ దక్షిణ ప్రాంతంలో మెసాయిద్ పారిశ్రామిక జోన్‌ని డ్రోన్లు తాకాయి.  ఈ ప్రాంతం పెట్రో కెమికల్ తయారీకి కేరాఫ్. గ్యాస్ క్షేత్రాలకు దూరంగా ఉంది కూడా. ఖతార్ ఎనర్జీ అమ్మకాలలో 82 శాతం ఆసియా దేశాలకు జరుగుతుంది.

ఖతార్ బాటలో మరికొన్ని దేశాలు.. ప్రపంచ మార్కెట్లపై గ్యాస్ ప్రభావం

ఉత్పత్తి నిలిపివేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇతర మార్కెట్లపై ఒత్తిడిని పెంచింది.  ఫలితంగా గ్యాస్ ధరలు మార్కెట్లో అమాంతంగా పెరిగాయి. ఖతార్ ఎనర్జీ ప్రకటన తర్వాత సోమవారం బెంచ్‌ మార్క్ డచ్, బ్రిటిష్ హోల్‌సేల్ గ్యాస్ ధరలు 50 శాతానికి పెరిగాయి. ఇటు ఆసియాలో గ్యాస్ ధరలు దాదాపు 39 శాతం పెరిగాయి.

ప్రపంచంలో అతిపెద్ద LNG ఎగుమతిదారుగా ఒకప్పుడు రష్యా ఉండేది. 2022 లో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ తర్వాత యూరోపియన్ దేశాలు రష్యా చమురు, గ్యాస్‌పై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద LNG ఎగుమతిదారుడిగా ఎదిగింది.

ALSO READ:  యుద్ధం ఎఫెక్ట్..  తగ్గుతున్న బంగారం ధరలు, ఎంత తగ్గిందంటే

ఆ తర్వాత ఖతార్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ప్రపంచంలో సహజ వాయువు ప్రధాన దిగుమతిదారుడు చైనా.  ఎక్కువ భాగం ఆస్ట్రేలియా నుండి దిగుమతి చేసుకుంటోంది. ఆ దేశం దిగుమతుల్లో 34 శాతం వాటా అని యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలియజేసింది. ఖతార్ ఉత్పత్తి నిలిపి వేయడం వల్ల బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్ లపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనుంది.

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఇటు వైపు నౌకలు వస్తే పేల్చివేస్తామని హెచ్చరిక జారీ చేసింది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. LNG మోసు కెళ్ళే నౌకలతో సహా కనీసం 150 నౌకలు హార్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో ఓడల ట్రాఫిక్ దాదాపు 86 శాతం తగ్గినట్టు చెబుతున్నాయి. 700 నౌకలు ఆ మార్గానికి ఇరువైపులా ఉన్నట్లు ప్రస్తావించాయి.

 

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×