E-Paper
Advertisement

Renault Alpine A290: ఇరగదీసిండు.. సింగిల్ ఛార్జింగ్‌తో 400 కి.మీ మైలేజీ.. కొత్త రెనాల్ట్ కార్ అదిరిపోయింది బాసు..!

Renault Alpine A290: ఇరగదీసిండు.. సింగిల్ ఛార్జింగ్‌తో 400 కి.మీ మైలేజీ.. కొత్త రెనాల్ట్ కార్ అదిరిపోయింది బాసు..!
Advertisement

Renault Alpine A290 Launch Date In India: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్ కొత్త కొత్త కార్లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. ఫీచర్ల పరంగా ఎక్కడా తగ్గకుండా తమ వినియోగదారులకు మంచి అనుభూతిని అందించేందుకు ఎప్పుడూ కష్టపడుతూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేసిన రెనాల్ట్ తాజాగా తన కొత్త EV ‘Renault Alpine A290’ కారును తీసుకువచ్చింది. ఈ కారు ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయబడింది. ఇది ప్రీమియం స్థాయి హై క్లాస్ కారు.

ఇందులో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు 2025 మధ్యలో భారతదేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ దాని ధరలను వెల్లడించనప్పటికీ.. దీని ప్రారంభ ధర రూ. 35 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ మార్కెట్‌లో అందించవచ్చని భావిస్తున్నారు. దీని కారణంగా ధరల విభాగంలో MG ZS EVతో పోటీ పడుతుందని తెలుస్తోంది. ఈ రెనాల్ట్ కొత్త ఈవీ.. ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్, ఫోక్స్‌వ్యాగన్ ప్రీమియం సెగ్మెంట్‌తో పోటీపడుతుంది.

Advertisement

Also Read: రెనాల్ట్ కిగర్ నుంచి స్పోర్టియర్ వెహికల్.. ఫీచర్లు మాములుగా లేవు!

తాజా సమాచారం ప్రకారం.. కంపెనీ 2030 నాటికి భారతదేశంతో సహా గ్లోబల్ మార్కెట్‌లో మొత్తం ఏడు ఎలక్ట్రిక్, ఇతర వాహనాలను విడుదల చేయాలని యోచిస్తోంది. అందువల్ల ఇది భారతదేశంలో దాని మొదటి EV కారు కావచ్చని ఓ సమాచారం వినిపిస్తోంది. రెనాల్ట్ ఆల్పైన్ A290 EV కారు గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ కారులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది డ్రైవర్‌కు హై క్లాస్ డ్రైవ్ అనుభవాన్ని ఇస్తుంది. రెనాల్ట్ ఈ కారులో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను అందిస్తోంది.

Advertisement

ఇది హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కారు. ఐదు సీట్ల పరిమితితో అందుబాటులోకి వస్తుంది. కారు ముందు భాగంలో ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. అది ఈ కారు ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. అలాగే ఈ వెహికల్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. Renault Alpine A290 కారు 6 సెకన్లలో 0 నుండి 60kmph వరకు వేగవంతం అవుతుంది. ఇది అధిక పికప్ కారు ఇది. 215bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 52 kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. దీని ద్వారా ఈ బ్యాటరీకి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే సుమారు 400 కిలోమీటర్ల డ్రైవింగ్ మైలేజీని అందిస్తుంది. అలాగే సీట్ బెల్ట్ రిమైండర్ ఫీచర్‌తో వస్తుంది.

Tags

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×