E-Paper
Advertisement

Discounts On Tata Electric Cars: టాటా మోటార్స్ ప్లాన్ అదిరింది.. పంచ్, నెక్సాన్, టియాగో ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్స్..!

Discounts On Tata Electric Cars: టాటా మోటార్స్ ప్లాన్ అదిరింది.. పంచ్, నెక్సాన్, టియాగో ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్స్..!
Advertisement

Discounts On Tata Electric Cars: ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ టాటా మోటార్స్ ఆటో మొబైల్ మార్కెట్‌లో అత్యధిక సేల్స్‌తో దూసుకుపోతూ నెంబర్ వన్‌గా కొనసాగుతుంది. ఇతర బ్రాండ్‌లకు గట్టి పోటీనిస్తూ మరింత ముందుకు సాగుతుంది. ఈ కంపెనీ 1991 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 33 ఏళ్లలో దేశ వ్యాప్తంగా 20 లక్షల ఎస్‌యూవీలను సేల్స్‌ చేసింది. దీంతో ఈ మైలురాయిని చేరుకోవడంతో టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే తన ఎస్యూవీలపై భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది.

తాజాగా సఫారీ, హారియర్, నెక్సాన్, పంచ్ వంటి నంబర్ వన్ ఎస్యూవీలపై మోడల్‌ బట్టి దాదాపు రూ.1.4 లక్షల వరకు భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు టాటా ఎలక్ట్రిక్ కార్లపై కూడా డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. అందులో టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీతో పాటు టియాగో ఈవీపై కూడా ఈ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు పెంచడంలో కూడా ఓ ఉద్దేశం ఉంది.

Advertisement

గత నెల అంటే జూన్‌లో దేశీయ మార్కెట్‌లో టాటా మోటార్స్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు చాలా వరకు క్షీణించాయి. జూన్ నెలలో ఈవీ విభాగంలో సేల్స్ బాగా పడిపోయాయి. దాదాపు 14 శాతం తగ్గుముఖం పట్టాయి. మొదటి ఆరు నెలల్లో చూసుకుంటే ఇప్పటి వరకు 8.39 లక్షలకు పైగా ఈవీలు సేల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో టాటా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే తమ ఎలక్ట్రాక్ కార్ల సేల్స్ పెంచేందుకు ఈ డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ డిస్కౌంట్ ఆఫర్లు తమ కార్ల సేల్స్ మరింత పెంచేందుకు దోహదపడతాయని కంపెనీ భావిస్తుంది. అయితే ఇందులో నెక్సాన్ ఎలక్ట్రాక్ కార్‌పై ఇంతకు ముందెన్నడూ లేనంతగా డిస్కౌంట్లను అందిస్తున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది.

Also Read: కారుపై ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.లక్ష డిస్కౌంట్!

Advertisement

ఇదిలా ఉంటే టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెహికల్‌పై దాదాపు రూ.30,000 డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఈ టాటా పంచ్ ఈవీ ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయింది. ఈ ఈవీ భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో మంచి రేటింగ్‌ను సాధించింది. ఏకంగా నెక్సాన్ ఈవీతో పాటుగా 5స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను అందుకుంది. ఈ టాటా పంచ్ ఈవీ రూ.10.99 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అలాగే దీని లాంగ్ రేంజ్ వేరియంట్‌ రూ.14.49 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

ఈ లాంగ్ రేంజ్ వేరియంట్‌కు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 421 కి.మీ మైలేజీ అందిస్తుంది. అదే సమయంలో టాటా టియాగో ఎలక్ట్రిక్ వెహికల్‌పై ఈ జూలై నెలలో దాదాపు రూ.50,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఈ టియాగో ఎలక్ట్రిక్ వెహికల్ గతేడాది టాటా కంపెనీ నుండి అత్యధికంగా సేల్ అయిన కారుగా నిలిచింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో సేల్స్ కొనసాగిస్తూ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఎలక్ట్రిక్ కారు టాటా మోటార్స్ నుంచి వచ్చిన అతిచిన్న అఫర్డ‌బుల్ కారు.

Tags

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×