BigTV English
Advertisement

Joe Biden Calls Zelensky: మరోసారి బయటపడిన బైడెన్ మతిమరుపు.. జెలెన్‌స్కీని పుతిన్ అంటూ సంబోధన!

అమెరికా రాజకీయాలలో ప్రెసిడెంట్ జో బైడెన్ ఆరోగ్య సమస్యలపై జోరుగా చర్చలుగా జరుగుతున్న సమయంలో మరోసారి ఆయనకు వయసురీత్యా మతిమరుపు ఉన్నట్లు బయటపడింది. బహిరంగ సభలో అది కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన స్నేహితుడిని తన శత్రువు పేరుతో సంబోధించి మరో బ్లండర్ చేశారు జో బైడెన్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ పేరుతో ఆయన సంబోధించారు. దీంతో మరోసారి ఆయనకు మతిమరుపు, వృద్ధాప్య సమస్యలున్నట్లు బయటపడింది.

Joe Biden Calls Zelensky: మరోసారి బయటపడిన బైడెన్ మతిమరుపు.. జెలెన్‌స్కీని పుతిన్ అంటూ సంబోధన!

Joe Biden Calls Zelenskyy(Today international news headlines): అమెరికా రాజకీయాలలో ప్రెసిడెంట్ జో బైడెన్ ఆరోగ్య సమస్యలపై జోరుగా చర్చలుగా జరుగుతున్న సమయంలో మరోసారి ఆయనకు వయసురీత్యా మతిమరుపు ఉన్నట్లు బయటపడింది. బహిరంగ సభలో అది కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన స్నేహితుడిని తన శత్రువు పేరుతో సంబోధించి మరో బ్లండర్ చేశారు జో బైడెన్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ పేరుతో ఆయన సంబోధించారు. దీంతో మరోసారి ఆయనకు మతిమరుపు, వృద్ధాప్య సమస్యలున్నట్లు బయటపడింది. నవంబర్ నెలలో జరగబోయే ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఆయన డెమొక్రాట్ పార్టీ తరపున ప్రధాన అభ్యర్థి కావడంతో బైడెన్‌కు వయసు రీత్యా ఆ పదవి అర్హుడు కాదేమో అని ప్రజల్లో సందేహం కలుగుతోంది.


అమెరికాలో నాటో దేశాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశం తరువాత ప్రెసిడెంట్ బైడెన్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో నాటో కూటమి, ఉక్రెయిన మధ్య కుదిరిన ఒక ఒప్పందం గురించి ప్రకటించారు. ఆ ప్రకటన చేస్తున్న సందర్భంతో ఆయన ఇలా మాట్లాడారు. ”ఇప్పుడు చివరగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రసంగం చేస్తారు, ఆయన ఎంతో ఓర్పు కలవాడు, చాలా ధైర్యవంతుడు. లేడీస్ అండ్ జెంటిల్ మెన్ మీ ముందుకు వస్తున్నారు.. ప్రెసిడెంట్ పుతిన్” అంటూ బైడెన్ స్టీజీ దిగబోయారు, అంతలో ఆయనకు తన తప్పు తెలిసినట్లు అర్థమైంది.. అందుకే తిరిగి మైక్ వద్దకు వచ్చి ఇలా అన్నారు.. ”ఈయన ప్రెసిడెంట్ పుతిన్ ‌ని ఓడించే ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ. నేను పుతిన్ ఎలా ఓడించాలా? అని ఎక్కువగా ఆలోచిస్తుంటాను.. అందుకే ఆయన పేరు పలికేశాను” అని తన తప్పుని కవర్ చేసుకున్నారు.

Also Read: ‘రష్యాకు ఆయుధాల సరఫరా ఆపండి’.. ఇరాన్, చైనాలకు నాటో వార్నింగ్!


బైడెన్ తప్పును మిగతా నాటో దేశాల నాయకులు కవర్ చేశారు. జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ స్కూల్జ్ మాట్లాడుతూ.. మాట్లాడేటప్పుడు పదాలు తడబడడం, నోరు జారడం వంటివి జరుగుతుంటాయి. ఇలా చాలామందికి జరుగుతూనే ఉంటుంది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మానుయెల్ మాక్రాన్, యుకె కొత్త ప్రధాన మంత్రి కీర్ స్టార్ మర్ బైడెన్ ఆరోగ్యంగానే ఉన్నారని.. ఈ విషయంలో అనుమానాలు లేవని చెప్పారు.

కమలా హ్యారిస్‌ని ట్రంప్ అంటూ సంబోధన
బైడెన్ ఏదో తడబడ్డారని అని సర్దుకునే లోపే ఆయన మరో బ్లండర్ చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌ను.. వైస్ ప్రెసిడెంట్ ట్రంప్ అని పిలిచారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో విలేకరులు ఆయనకు ఒక ప్రశ్న అడిగారు.

మీడియా ప్రశ్న: మీరు ఒకవేళ ఎన్నికల్ల నుంచి తప్పుకుంటే.. వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్.. మీ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించగలదని మీకు నమ్మకం ఉందా?

బైడెన్ సమాధానం: నాకు వైస్ ప్రెసిడెంట్ ట్రంప్‌పై నమ్మకం లేకపోతే.. నేనెందెకు ఆమెను వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తాను. ఆమె చాలా సమర్థురాలు.

బైడెన్ ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూపోతుంటే.. ఆయనను సమర్థించే వాళ్లు కూడా ఆయనపై సందేహం కలుగుతోంది. త్వరలోనే ఆయన వైట్ హౌస్ బిగ్ బాయ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మీడియా ముందు ప్రసంగించాలి. అక్కడ ఆయన ఎలాంటి స్కిప్ట్ లేకుండా ప్రసంగించాలి.. పైగా మీడియా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. మతిమరుపు విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో బైడెన్‌కు ఈ కాన్ఫెరెన్స్ ఒక పరీక్షలా మారింది.

Also Read: ‘ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకోవడమే బెటర్’.. హలీవుడ్ సీనియర్ హీరో షాకింగ్ ప్రకటన!

మరోవైపు బైడెన్ కు సొంత పార్టీ నేతలు, ఆయన స్నేహితుల నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటివరకు ఆయన పార్టీలోని 14 మంది ఎంపీలు ఓపెన్ గా ఆయన ఎన్నికలను నుంచి తప్పుకోవాలని సూచించారు. ఈ సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది.

 

Joe Biden’s Gaffe, Calls Ukraine President Zelenskyy as Putin

Tags

Related News

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

Big Stories

×