E-Paper
Advertisement

BSNL Budget Plans 2026: BSNL టాప్ – 5 బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఖర్చు తక్కువ.. ప్రయోజనాలు ఎక్కువ!

BSNL Budget Plans 2026: BSNL టాప్ – 5 బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఖర్చు తక్కువ.. ప్రయోజనాలు ఎక్కువ!
Advertisement

BSNL Budget Plans 2026: కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్.. ప్రైవేటు టెలికాం సంస్థలతో పోలిస్తే తక్కువ బడ్జెట్ లో రీఛార్జ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తుంటుంది. ముఖ్యంగా తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వారు ఎక్కువగా బీఎస్ఎన్ఎల్ పై ఆసక్తి చూపిస్తుంటారు. రెండు సిమ్స్ లో కనీసం ఒక్కటైనా బీఎస్ఎన్ఎల్ సిమ్ వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ లో టాప్ -5 బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

రూ.107 ప్లాన్

ఇంటర్నెట్ తో పనిలేకుండా తక్కువ ఖర్చులో సిమ్ యాక్టివ్ ప్లాన్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. రూ.107 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 3GB డేటాతో పాటు 200 నిమిషాల ఉచిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. 35 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ ఉపయోగించుకోవచ్చు. సెకండ్ సిమ్ కింద బీఎస్ఎన్ఎల్ వాడే వారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది.

రూ.153 ప్లాన్

Advertisement

నెల రోజుల వ్యవధితో మంచి బడ్జెట్ ప్లాన్ కోసం చూసే వారికి రూ.153 ప్లాన్ ఉత్తమమైన ఆప్షన్ గా నిలుస్తోంది. రోజుకు 1GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందవచ్చు. 26 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, జింగ్ మ్యూజిక్ సబ్ స్క్రిప్షన్స్ సైతం ఈ ప్లాన్ పై ఉచితంగా పొందవచ్చు.

రూ.197 ప్లాన్

తక్కువ ధరలో ఎక్కువ రోజులు ఇన్ కమింగ్ కాల్స్ కోరుకునేవారికి ఈ ప్లాన్ బెస్ట్. ఈ ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. తొలి 18 రోజులు అపరిమితంగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోజుకు 2GB డేటా లభిస్తుంది. 18 రోజుల తర్వాత కాల్స్, డేటాకు ఛార్జీలు వర్తిస్తాయి. కానీ సిమ్ యాక్టివ్ గా ఉంటుంది.

రూ.199 ప్లాన్

Advertisement

ఇది సరిగ్గా 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB హై స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందవచ్చు. రోజువారి ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా ఉన్న వ్యక్తులు, విద్యార్థులు, ఉద్యోగులకు ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది.

Also Read: Best Selling Fridges Feb 2026: గత నెల మార్కెట్‌ను షేక్ చేసిన ఫ్రిడ్జ్‌లు.. ఎగబడి కొన్న జనం!

రూ. 997 ప్లాన్ (హోలీ స్పెషల్ ఆఫర్)

BSNL హోలీ ఆఫర్ కింద ఈ ప్లాన్ పై అదనపు వ్యాలిడిటీని ప్రకటించింది. సాధారణంగా ఇచ్చే 150 రోజుల వ్యాలిడిటీకి అదనంగా మరో 14 రోజులు అందించింది. రోజుకు 2GB డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు 164 రోజుల కాలానికి పొందవచ్చు. పదే పదే రీఛార్జ్ చేసే పని లేకుండా 5 నెలల కాలానికి నిర్విరామంగా ఈ ప్లాన్ ను ఉపయోగించుకోవచ్చు.

Also Read: ACs Buying Tips: కొత్త ఏసీ కొనాలంటే.. ఈ నాలెడ్జ్ తప్పనిసరి.. లేదంటే ఈజీగా మోసపోతారు!

Related News

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

ఏఐ సునామీ.. ఐబీఎంకు ఊహించని షాక్! గంటల్లోనే రూ. 6.7 లక్షల కోట్లు మాయం!

Big Stories

Advertisement
×