E-Paper
Advertisement

Best Selling Fridges Feb 2026: గత నెల మార్కెట్‌ను షేక్ చేసిన ఫ్రిడ్జ్‌లు.. ఎగబడి కొన్న జనం!

Best Selling Fridges Feb 2026: గత నెల మార్కెట్‌ను షేక్ చేసిన ఫ్రిడ్జ్‌లు.. ఎగబడి కొన్న జనం!

Best Selling Fridges Feb 2026: సమ్మర్ లో అధికంగా సేల్ అయ్యే గృహోకరణ వస్తువుల్లో రిఫ్రిజిరేటర్లు ఒకటి. వేసవి కాలంలో ఉండే వేడి పరిస్థితుల నుంచి ఆహారాన్ని తాజాగా ఉంచుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఫ్రిడ్జ్ లను కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో 2026 ఫిబ్రవరి నాటికి అత్యధికంగా అమ్ముడైన ఫ్రిడ్జ్ లు, వాటి ఫీచర్ల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

Samsung Bespoke AI Series (2026 Edition)

శాంసంగ్ కంపెనీకి చెందిన బెస్పోక్ ఏఐ ఫ్రిడ్జ్ సిరీస్ ఫ్రిడ్జ్ లు గత నెలలో అత్యధికంగా అమ్ముడుపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇది చాలా అడ్వాన్స్డ్ ఫీచర్లు కలిగిన ఫ్రిడ్జ్. దీనిలోని ఇంటర్నల్ కెమెరాల ద్వారా ఫ్రిడ్జ్ తెరవకుండానే లోపల ఏమున్నాయో మెుబైల్ లో చూడవచ్చు. అలాగే ఏఐ ఎనర్జీ మోడ్ ఫ్రిడ్జ్ వాడకాన్ని బట్టి విద్యుత్ వినియోగాన్ని 15-20 శాతం వరకు తగ్గించుకుంటుంది. అవసరమైతే ఇందులోని ఫ్రీజర్ ను ఫ్రిడ్జ్ గాను మార్చుకునే వెసులుబాటు ఉంది.

LG 343L 3-Star Frost Free Convertible

ఫిబ్రవరిలో మధ్యతరగతి ప్రజలు అత్యధికంగా కొనుగోలు చేసిన మోడల్ గా ఈ ఎల్జీ ఫ్రిడ్జ్ నిలిచింది. ఇందులోని డోర్ కూలింగ్ + టెక్నాలజీ ఫ్రిడ్జ్ డోర్ వైపు ఉన్న వస్తువులను అత్యంత వేగంగా చల్లబరుస్తుంది. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే చల్లగా మారిపోతాయి. దీనిలోని ఏఐ హ్యాబిట్ లెర్నింగ్ (AI Habit Learning) మీరు ఏ సమయంలో ఫ్రిడ్జ్ ఎక్కువగా ఉపయోగిస్తారో ముందుగానే అవగాహనకు వచ్చి.. ఆ టైంకు ముందే కూలింగ్ ను పెంచుతుంది.

Haier 520L Lumiere 4-Door / Vogue Series

పెద్ద కుటుంబం అయ్యి ఉండి.. స్టైలిష్ లుక్, స్మార్ట్ ఫీచర్లు కోరుకున్నవారికి గత నెలలో ఈ ఫ్రిడ్జ్ బెస్ట్ ఛాయిస్ గా నిలిచింది. ఇందులోని మ్యాజిక్ కన్వర్టబుల్ జోన్ ను -18 డిగ్రీల నుంచి +5 డిగ్రీల వరకూ మార్చుకోవచ్చు. ఫ్రీజర్ కింద భాగంలో ఉండటం వల్ల.. కూరగాయాల కోసం పదే పదే వంగాల్సిన అవసరం ఉండదు. మిర్రర్ గ్లాస్ ఫినిష్ తో రావడం వల్ల.. ఈ ఫ్రిడ్జ్ లుక్ మీ కిచెన్ ను రిచ్ గా మార్చేస్తుంది.

Also Read: ACs Buying Tips: కొత్త ఏసీ కొనాలంటే.. ఈ నాలెడ్జ్ తప్పనిసరి.. లేదంటే ఈజీగా మోసపోతారు!

Bosch MaxFlex 332L (Triple Door)

జర్మనీ టెక్నాలజీతో రూపొందిన గతనెలలో మంచి సేల్స్ అందుకుంది. దీనిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ మధ్యలో ఉన్న కంపార్ట్ మెంట్. ఇందులో తాజా కూరగాయాలు, మాంసం, ఆహార పదార్థాలను భద్రపరుచుకోవచ్చు. మార్కెట్ అత్యంత సైలెంట్ కంప్రెసర్ గా పిలువబడుతున్న Vario Inverter Compressor టెక్నాలజీ ఇందులో ఉంది. ఇది కూరగాయలు, పండ్లను ఏకంగా 15 రోజుల పాటు తాజాగా ఉంచేందుకు సాయపడుతుంది.

Also Read: iPhone 16e Discount: ఐఫోన్ 16eపై సూపర్ డీల్.. ఏకంగా రూ.11000 తగ్గింపు.. ఆఫర్ ఎక్కడంటే

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×