Home Stay Schemes: దేశంలో టూరిజం సెక్టార్ డీసెంట్రలైజేషన్ మోడల్ పై ఎక్కువగా ఆధారపడుతోంది. వీటిల్లో ఎక్కువగా ప్రభుత్వ బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్, హోమ్‌స్టే స్కీమ్ లు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో.. ఇంట్లోని ఖాళీ రూమ్ ల నుంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. యజమాని నివసిస్తు్న్న ఇంట్లో ఒకటి నుంచి ఆరు ఖాళీ గదులు ఉంటే వాటిని హోమ్‌స్టే యూనిట్లుగా మార్చి టూరిస్టులకు ఆతిథ్యం ఇవ్వవచ్చు. ఇది చిన్న తరహా ఆతిథ్య రంగం బిజినెస్ లాంటిది.
పంజాబ్, గోవా సహా పలు రాష్ట్రాల్లో బీ అండ్ బీ, హోమ్ స్టే పథకాలు కింద ప్రైవేట్ గృహ యజమానులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్న గదులను హోమ్‌స్టే యూనిట్లుగా నమోదు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో హోస్టేలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇవి ప్రైవేట్ వ్యక్తులు, సొంత నిర్వహణలో ఉన్నాయి. బీ అండ్ బీ లో సాధారణంగా అల్పాహారంతో పాటు వసతిని అందిస్తారు. అయితే హోమ్‌స్టేలో టూరిస్టులకు.. ఇంటి ఓనర్ కుటుంబంతో కలిసి ఉండడానికి అవకాశం కల్పిస్తారు. ఫర్నిచర్ ఉన్న గదులు, శుభ్రమైన పరిసరాలు, వాడకానికి నీళ్లు ఇలా అన్ని సదుపాయాలు ఉంటాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హోమ్ స్టేలకు ఏర్పాటు చేసుకునేందుకు పలు ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాయి.
నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ పోర్టల్ లో హోమ్‌స్టే నమోదు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సభ్యులు ఈ జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చు. అధికారిక పర్యటనలు లేదా పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు వీటికి డిమాండ్ పెరుగుతుంది. అయితే, గోవా, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు నిబంధనలు, పలు సౌకర్యాలు తప్పనిసరి చేశాయి.
పదవీ విరమణ చేసిన వారు, గృహిణులకు తక్కువ ప్రవేశ రుసుముతో హోమ్‌స్టే విధానంలో అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఇంటిని హోమ్ స్టేగా మార్చుకోవచ్చు.
హోస్ట్‌ల ఆక్యుపెన్సీ లెవల్స్, సీజన్‌లను సెలెక్ట్ చేసుకోవచ్చు. సాధారణ వ్యాపారాల తరహాలో నిత్యం బిజినెస్ ఉండకపోవచ్చు. సానుకూల సమీక్షలు, తరచూ వచ్చే పర్యాటకులతో ఆదాయం పెంచుకోచవచ్చు.
భారత్ లో హోమ్‌స్టే వ్యవస్థ సూక్ష్మ వ్యాపార అవకాశంగా మారుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు, ఆర్థిక సహాయం, పర్యాటక డిమాండ్‌తో, ఖాళీగా ఉన్న గదులను ఆదాయం ఇచ్చే ఆస్తులుగా మార్చుకోవచ్చు.