E-Paper
Advertisement

పోస్టాఫీసు డబ్బా ఎరుపు రంగులోనే ఎందుకు? అసలు మ్యాటర్ ఇదన్నమాట!

పోస్టాఫీసు డబ్బా ఎరుపు రంగులోనే ఎందుకు? అసలు మ్యాటర్ ఇదన్నమాట!
Advertisement

Red Post Box History: వీధి చివర ఉండే పోస్టాఫీసు లెటర్ బాక్స్ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది దగాదగా మెరిసే ఎరుపు రంగు. వాట్సప్, ఫేస్ బుక్, టెలిగ్రామ్ వంటి యాప్స్ వచ్చినప్పటికీ.. ఇప్పటికీ పోస్టాఫీసు బాక్స్ కు క్రేజ్ తగ్గలేదు. నమ్మకమైన, సురక్షిత మార్గంలో సమాచార పంపిణీకి కేరాఫ్ గా ఇప్పటికీ పోస్టాఫీసు బాక్స్ లు నిలుస్తున్నాయి. అయితే ఈ పోస్టాఫీసు డబ్బాలు ఎప్పుడూ ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఇతర దేశాల్లోనూ ఇదే రంగు ఉందా? వంటి ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రెడ్ కాదు.. తొలుత గ్రీన్

లెటర్ బాక్స్‌లు మెుట్టమెుదటి సారిగా 19వ శతాబ్దంలో బ్రిటన్‌లో అందుబాటులోకి వచ్చాయి. అందరికీ స్పష్టంగా కనిపించాలనే ఉద్దేశంతో మెుదట్లో వీటిపై ‘ఆకుపచ్చ’ (Green) రంగు వేసేవారు. కానీ, ఈ ఆకుపచ్చ రంగు చుట్టూ ఉన్న చెట్లు, పచ్చదనంలో కలిసిపోయి ప్రజలకు సరిగ్గా కనిపించేది కాదు. దీంతో జనాలు పోస్ట్ బాక్స్‌లను గుర్తుపట్టడం కష్టంగా మారేది.

మరి ఎరుపు రంగు ఎలా..?

Advertisement

ఆకుపచ్చ రంగు సమస్యను పరిష్కరించడానికి 1874లో బ్రిటిష్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. దట్టమైన పొగమంచులో కూడా ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉండే రంగు కోసం వెతికారు. అలా ప్రతిపాదనలోకి వచ్చిందే ‘ఎరుపు రంగు’. సాధారణంగా రెడ్ కలర్ ను దేనికైనా హెచ్చరిక వాడుతుంటారు. ఇతర రంగులతో పోలిస్తే ఇది వెంటనే మనుషుల దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే 1874 నుండి 1879 మధ్య కాలంలో అన్ని పోస్ట్ బాక్స్‌లకు ఎరుపు రంగు పూయడం ప్రారంభించారు.

భారత పోస్టల్‌పై బ్రిటిష్ ముద్ర

బ్రిటిష్ పాలనా కాలంలోనే భారత్ లో పోస్టల్ వ్యవస్థ రూపుదిద్దుకుంది. అందువల్ల బ్రిటన్ లో పాటించిన నియమాలనే ఇక్కడా అమలు చేశారు. మన దేశంలో మొదటిసారిగా పరిచయం చేసిన లెటర్ బాక్స్‌లకు కూడా అదే ఎరుపు రంగు వేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఎరుపు రంగు పోస్ట్ బాక్స్ ఒక ఐకానిక్ గుర్తుగా మారిపోయింది.

Advertisement

Also Read: వీఐ యూజర్లకు పండగే.. రూ. 189కే ఫ్రీ కాల్స్, డేటా.. సామాన్యులకు పర్ఫెక్ట్ ప్లాన్!

ఇతర దేశాల్లో పరిస్థితేంటి?

భారత్ తరహాలో ఇతర దేశాల్లోనూ పోస్టాఫీసు ఎరుపు రంగులో లేవు. ఒక్కో దేశం తమ సౌకర్యం, సాంస్కృతిక ప్రాధాన్యతలకు అనుగుణంగా వేర్వేరు రంగులను ఎంచుకుంది. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్పెయిన్ వంటి అనేక ఐరోపా దేశాల్లో లెటర్ బాక్స్‌లు పసుపు రంగులో దర్శనమిస్తాయి. అటు అమెరికా, రష్యా దేశాల్లో పోస్ట్ బాక్స్‌లను నీలం రంగులో చూడొచ్చు. నెదర్లాండ్స్‌లో ఆరెంజ్ రంగు పోస్ట్ బాక్స్‌లను ఉపయోగిస్తారు. భారత్ వంటి ఆంగ్లేయులు పరిపాలించిన దేశాలతో పాటు బ్రిటన్, జపాన్, కెనడాల్లో మాత్రమే ఎరుపు రంగు పోస్టాఫీసు బాక్స్ ను వినియోగిస్తున్నారు.

Also Read: జియో బంపర్ ఆఫర్.. రూ. 175కే 10 జీబీ డేటా.. ఉచితంగా 11 ఓటీటీలు!

Related News

PPF vs SIP.. నెలకు రూ.10,000 పెట్టుబడి చేసేందుకు ఏది లాభదాయకం?

డిగ్రీ లేదు.. పెట్టుబడి లేదు.. రూ.కోట్ల వ్యాపారం చేస్తున్న 65 ఏళ్ల మహిళ

స్వతహాగా ఆదివారాలు, రాత్రిళ్లు కూడా పనిచేస్తున్న ఆ కంపెనీ ఉద్యోగులు.. డబ్బు కోసం కాదు

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

Big Stories

Advertisement
×