E-Paper
Advertisement

టికెట్ ఉంటే స్టేషన్‌ లో ఎంతసేపు ఉండొచ్చు? చాలామందికి తెలియని రైల్వే రూల్!

టికెట్ ఉంటే స్టేషన్‌ లో ఎంతసేపు ఉండొచ్చు? చాలామందికి తెలియని రైల్వే రూల్!
Advertisement

Indian Railways Rules: రైలు దిగిన వెంటనే స్టేషన్‌ లో నుంచి వెళ్లి పోవాలని చాలా మంది భావిస్తారు. కానీ, భారతీయ రైల్వే రూల్స్ ప్రకారం, కొన్ని పరిస్థితుల్లో ప్రయాణికులు టికెట్ ఆధారంగా కొంత సమయం వరకు స్టేషన్ ప్రాంగణంలో ఉండవచ్చు. ముఖ్యంగా అదే స్టేషన్ నుంచి మరో రైలు ఎక్కే అవకాశం ఉండటం, పిక్ చేసుకునేందుకు కుటుంబ సభ్యులు రావడానికి ఆలస్యం కావచ్చు, లేదంటే ఇతర కారణాలతో స్టేషన్‌లో వేచి ఉండాల్సి వస్తే రైల్వే అందించే సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు.

పగటిపూట 2 గంటలు, రాత్రిపూట 6 గంటలు..

సాధారణంగా ప్యాసింజర్స్ ప్రయాణించిన టికెట్ ఆధారంగా రైలు దిగిన తర్వాత పగటి సమయంలో రెండు గంటల వరకు స్టేషన్ లో ఉండేందుకు అనుమతి ఉంటుంది. కొన్ని పెద్ద రైల్వే స్టేషన్లలో రాత్రి సమయంలో ఆరు గంటల వరకు కూడా ప్రయాణికులు స్టేషన్‌లో ఉండవచ్చు. అయితే, సంబంధిత స్టేషన్ నిబంధనలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ స్టేషన్‌లో ఎక్కువ సమయం గడపాల్సి వస్తే, భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం పలు సౌకర్యాలను అందుబాటులో ఉంచింది. అవేంటంటే..

వెయిటింగ్ రూమ్

Advertisement

మీ దగ్గర కన్ఫర్మ్ టికెట్ లేదంటే RAC టికెట్ ఉంటే స్టేష న్‌లో ఉన్న వెయిటింగ్ రూమ్‌ను ఉపయోగించుకోవచ్చు. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నెక్ట్స్ రైలు కోసం వేచి ఉండే ప్రయాణికులకు ఈ సౌకర్యం చాలా ఉపయోగపడుతుంది.

క్లాక్ రూమ్

మీ దగ్గర ఎక్కువ లగేజీ ఉంటే దానిని మోస్తూ తిరగాల్సిన అవసరం లేదు. స్టేషన్‌ లో ఉన్న క్లాక్ రూమ్ లో సామానును   భద్రపరచవచ్చు. నిర్ణయించిన ఛార్జీ చెల్లించి కొన్ని గంటలు లేదంటే అవసరమైన సమయం వరకు లగేజీని అక్కడ ఉంచే అవకాశం ఉంటుంది.

రిటైరింగ్ రూమ్

Advertisement

ఒకవేళ ఎక్కువసేపు స్టేషన్ సమీపంలో ఉండాల్సి వస్తే IRCTC రిటైరింగ్ రూమ్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ గదులను ఆన్‌ లైన్‌ లో ముందుగానే బుక్ చేసుకోవాలి. లేదంటే స్టేషన్‌లో అందుబాటులో ఉంటే అక్కడే బుక్ చేసుకోవచ్చు. సాధారణ హోటళ్లతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ఈ సదుపాయం లభిస్తుంది.

ఈ సర్వీసులు ముఖ్యంగా రాత్రి వేళల్లో, కనెక్టింగ్ రైలు కోసం ఎదురుచూసే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే, ప్రతి స్టేషన్‌లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండకపోవచ్చు. అందువల్ల అవసరమైతే స్టేషన్‌ లో  స్టేషన్ మాస్టర్‌ను సంప్రదించడం మంచిది. ప్రయాణానికి ముందు రైల్వే నిబంధనలు తెలుసుకోవడం వల్ల అనవసర ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే స్టేషన్‌లో అందుబాటులో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

Read Also: లోకో పైలెట్ నిద్రపోతే ఏం జరుగుతుంది? భారతీయ రైల్వేలో ఈ సీక్రెట్ సిస్టమ్ గురించి తెలుసా!

Related News

స్పీడందుకుంటున్నాయ్ లగ్జరీ ప్రయాణాలు.. విజయవాడ ప్రయాణికులకు వందే భారత్ స్లీపర్ ధమాకా!

వీధులను ముంచెత్తిన బీరు వరద.. ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన ఘటన గురించి మీకు తెలుసా?

పక్షులతో యుద్ధం చేసి ఓడిపోయిన దేశం.. ఈ ఆసక్తికర చరిత్ర మీకు తెలుసా?

విమానాలతో పోటీపడి దూసుకెళ్తున్న రైళ్లు.. వీటి స్పీడ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

గోవా కంటే బెటర్.. పర్యాటకులను ఆకట్టుకుంటున్న 5 కొత్త టూరిస్ట్ డెస్టినేషన్స్

లోకో పైలెట్ నిద్రపోతే ఏం జరుగుతుంది? భారతీయ రైల్వేలో ఈ సీక్రెట్ సిస్టమ్ గురించి తెలుసా!

గంగమ్మ నిత్యం జలాభిషేకం చేసే అద్భుత శివలింగం.. ఈ దృశ్యం చూస్తే మైమరచిపోతారు!

Big Stories

Advertisement
×