BigTV English

Spiritual Deities : కుల దైవాన్ని పూజించే వాళ్లు ఇష్ట దేవతల్ని పూజించకూడదా…?

Spiritual Deities : కుల దైవాన్ని పూజించే వాళ్లు ఇష్ట దేవతల్ని పూజించకూడదా…?


Spiritual Deities : ప్రతీ ఇంటి పేరుకి కులదైవానికి ఒక సంబంధం ఉండి తీరుతుంది. ఇంటి పేరు తోట అని ఉంటే వారు మహకాళిని పూజించాలి. బెహరా అని ఉంటే అమ్మవారిని ఆరాధించాలి. పాత రోజుల్లో కులదేవతను, తోటల్లోను, పొలాల్లో పెట్టి పూజలు జరిపించే వారు. ఆ తల్లి వల్లే వాళ్లకి ఆ ఇంటి పేరు వచ్చింది. కాబట్టి వారు ఆ దేవిని పూజించాలి. ఆ ఇంటి పేరుతో జన్మించం కాబట్టి ఆ నియమాన్ని పాటించాలి. కులదేవతలతోపాటు అప్పుడప్పుడు మనం పెద్దలకి కలలో కొంతమంది దేవతలు, దేవుళ్లు కనిపించారని చెబుతుంటారు. అప్పుడు కలలో కనిపించే ఏ దేవుడే వారికి ఇలవేల్పు అవుతారు. అప్పటి నుంచి ఆయనే ఇంటికి దేవుడుగా మారతాడు.

కులదేవతలు అంటే ఇంట్లో అమ్మమ్మ, నానమ్మలాంటి వారు. మార్కండేయ గోత్రం ఉన్న వారు శివుడ్ని ఆరాధించాలి. విభూతి పండును ముద్దలగా పెట్టాలి. మహిపాల గోత్రం ఉన్న వారు వీరభద్రుడు కులదైవంగా ఉంటారు. కొంతమందికి సుబ్రమణ్యేశ్వరుడు కులదైవంగా ఉంటారు. నాగుల పంచమిని చాలా విశిష్టగా వారి ఇళ్లల్లో నిర్వహిస్తుంటారు. అలా మొదలైన ఇలవేల్పులే కులదేవతలు అయ్యారు. కాబట్టి కులదేవతల్ని పూజించకుండా ఏ పని మొదలుపెట్టకూడదని పెద్దలు అంటుంటారు. యాదవులకి కులదేవత అంబిక. అందుకే శ్రీకృష్ణుడు, అంబికను ఛండికను కొలిచాడు. కులదేవతను పూజించినప్పుడు కుటుంబం మంచిగా ఉంటుంది.


కొంతమందికి ఇంటిదేవత వేరు. ఇష్టమైన దైవం వేరుగా కూడా ఉంటారు. అందులో తప్పేమీ లేదు. ఇద్దరు దేవతలను లేదా ఇద్దరు దేవుళ్లను పూజించడ చేయవచ్చు. కానీ ఇంట్లో ఏ శుభ కార్యం జరిగినా కులదేవతకి పూజ చేసిన తర్వాత ఇష్టమైన దేవతలు పూజలు చేయమని శాస్త్రం చెబుతోంది. వంశాచారం ప్రకారం ఏ రోజైనా సరే వంశదేవతను వదిలిపెట్టకూడదు. సంవత్సరానికి ఒకసారి కులదేవతారాధన చేయాలి. ఎన్ని తరాలు మారిన కులదైవాన్ని మాత్రం విస్మరించకూడదు.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×