E-Paper
Advertisement

TG SET-2025: తెలంగాణ సెట్-2025 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?

TG SET-2025: తెలంగాణ సెట్-2025 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?
Advertisement

TG SET-2025: తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాల అర్హత పరీక్ష స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET-2025)కు నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. 2025 డిసెంబర్ రెండో వారంలో సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. పేపర్-1లో 50 ప్రశ్నలు, పేపర్-2లో 100 ప్రశ్నలు.. మొత్తం మార్కులు 300 ఉంటాయి. ప్రతి పేపర్ కు 3 గంటల సమయం కేటాయిస్తారు.

రెండు పేపర్లు

టీజీ సెట్-2025 ఉత్తీర్ణతకు.. పేపర్-1, పేపర్-2 రెండింటిలో ఉత్తీర్ణత సాధించాలి. సెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు అసిస్టెంట్, లెక్చరర్ పోస్టులకు అర్హులవుతారు. పేపర్-1లో సాధారణ బోధన, పరిశోధన అప్టిట్యూడ్, బోధనా నైపుణ్యాలు, తార్కిక విశ్లేషణ, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వివిధ అంశాలు ఉంటాయి. పేపర్-2లో అభ్యర్థి సెలెక్ట్ చేసిన స్పెషలైజేషన్ లేదా సబ్జెక్ట్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. దీంతో అభ్యర్థులు రెండు విధాలుగా ప్రిపేర్ అవ్వాలి.

Advertisement

Also Read: Canara Bank Notification: డిగ్రీతో భారీ అప్రెంటీస్ పోస్టులు.. అప్లై చేస్తే చాలు.. సెలెక్ట్ అవుతారు..!

అక్టోబర్ 10 నుంచి అప్లికేషన్లు

TG SET-2025 ఆన్ లైన్ దరఖాస్తులు అక్టోబర్ 10 నుంచి అందుబాటులో ఉంటాయి. ఆన్ లైన్ అప్లికేషన్ కోసం అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసి, అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. నిర్దేశించిన దరఖాస్తు ఫీజు చెల్లించాలి. టీజీ సెట్-2025 అధికారిక వెబ్సైట్ www.telanganaset.org లో అప్లై చేసుకోవాలి. సెట్ గురించి పూర్తి సమాచారం కోసం ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ www.osmania.ac.in ను సందర్శించవచ్చు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×