Airtel Offers: ఎయిర్‌టెల్, భారత్‌లో అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటి. దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్‌వర్క్, అద్భుతమైన కాల్ క్వాలిటీ, స్పీడీ డేటా సర్వీసెస్‌తో ఎయిర్‌టెల్ ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ – అన్ని రకాల కస్టమర్ల కోసం వైవిధ్యమైన ప్లాన్స్ అందిస్తుంది. ముఖ్యంగా, బడ్జెట్‌లో సరిపడే, యూజర్ నీడ్స్‌కు తగ్గ ప్లాన్స్‌తో ఎయిర్‌టెల్ అందరి గుండెల్లో చోటు సంపాదించింది. అలాంటి ఒక సూపర్ ఆప్షన్ గురించి ఇప్పుడు చూద్దాం.
వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్
ఎయిర్‌టెల్ ప్రకటించిన రూ.155 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం టెలికాం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు రీచార్జ్ ప్లాన్‌లలో ఎక్కువగా డేటా, ఎస్ఎంఎస్ సౌకర్యాలను చూసే కస్టమర్లకే ఆప్షన్లు ఎక్కువగా ఉండేవి. కానీ డేటా వాడకపోయినా, మెసేజ్ సర్వీస్ అవసరం లేకపోయినా, కేవలం వాయిస్ కాల్స్ కోసం మాత్రమే ఫోన్ వాడేవారికి మాత్రం సరైన ప్లాన్ దొరకడం కష్టమే. అలాంటి వారికోసమే ప్రత్యేకంగా ఎయిర్‌టెల్ ఈ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
రీచార్జ్ ప్రయోజనం ఏమిటి?
ఈ రూ.155 ప్లాన్ రీచార్జ్ చేసుకున్న వెంటనే యూజర్లకు దొరికే ప్రధాన ప్రయోజనం అపరిమిత వాయిస్ కాలింగ్. అంటే రోజుకు ఎన్ని సార్లు కావాలన్నా, ఎంతసేపు కావాలన్నా, ఏ నెట్‌వర్క్‌కైనా ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా కాల్ చేసుకోవచ్చు. ఈ స్వేచ్ఛ యూజర్లను మరింత సౌకర్యవంతంగా ఉంచుతుంది.
ఈ ప్లాన్ ఎందుకు స్పెషల్?
ఇందులో ముఖ్యంగా డేటా సదుపాయం లేకపోవడం గమనించాలి. ఇప్పుడు మనం డిజిటల్ యుగంలో ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరికి డేటా అవసరం ఉంటుంది అని చెప్పడం తప్పుడు. కొంతమంది పెద్దవాళ్లు, రిటైర్డ్ వ్యక్తులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు ఇంకా ఎక్కువగా ఫోన్‌ను వాయిస్ కాల్స్ కోసం మాత్రమే వాడుతున్నారు. వారికి డేటా అవసరం లేకపోవడంతో ఈ రూ.155 ప్లాన్ నిజంగా సరైన ఎంపిక అవుతుంది.
Also Read: Infinix Hot 50 Ultra 2025: ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ధర కూడా రూ. 10వేల లోపే
కానీ .. చిన్న ట్విస్ట్ ఉందండోయ్
కానీ ఈ ప్లాన్‌లో ఒక పరిమితి ఉంది. అది ఎస్ఎంఎస్ సౌకర్యం లేకపోవడమే. మెసేజ్‌లు పంపే అవసరం ఉన్నవారికి ఈ ప్యాక్ సరిపోడు. అయితే మీకు కావల్సింది కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే అయితే, ఈ ప్లాన్ కచ్చితంగా మీకోసమే.
28 రోజులపాటు నిరంతరం
రూ.155తో రీచార్జ్ చేసుకుంటే మొత్తం 24 గంటలు, 28 రోజులపాటు నిరంతరంగా వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర పెద్ద ప్లాన్‌లతో పోల్చితే చాలా తక్కువ ధరలో లభిస్తోంది. ఇంతవరకు డేటా వాడని కస్టమర్లు కూడా మినిమమ్ 200 రూపాయలకంటే ఎక్కువ ఖర్చు చేసి రీచార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అదే ప్రయోజనం తక్కువ ధరలో దొరకడం వల్ల ఈ ప్లాన్ ప్రత్యేకంగా నిలుస్తోంది.
సీనియర్ సిటిజన్లకు సరైన ప్లాన్
ఈ ప్లాన్ ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు, తల్లిదండ్రులకు, గ్రామాల్లో ఉండి కేవలం మాటల కోసం మాత్రమే మొబైల్ వాడే వారికి సరైనదిగా భావించవచ్చు. ఎందుకంటే వారు ఎక్కువగా డేటా వాడరు కాకుండా, ఎస్ఎంఎస్ కూడా అవసరం పడదు. కాబట్టి తక్కువ ఖర్చులో ఫోన్ వాడాలనుకునే వారి కోసం ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
డేటా అవసరం లేకుండా కేవలం కాల్స్
ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ ద్వారా ఒక విధంగా బడ్జెట్ రేంజ్‌లో కొత్త ఆప్షన్‌ను కస్టమర్లకు అందిస్తోంది. మార్కెట్‌లో రకరకాల డేటా ప్యాక్స్ ఉన్నప్పటికీ, వాయిస్ ఓన్లీ ప్లాన్స్ చాలా అరుదు. ఈ ఖాళీని పూడ్చడానికి ఈ రూ.155 ప్యాక్ ముందుకు వచ్చింది. ఖర్చు తక్కువగా ఉండి, అపరిమిత కాలింగ్ లభించడం వల్ల ఇది కస్టమర్లకు డబుల్ లాభంగా మారింది. కాబట్టి, మీరు కూడా డేటా అవసరం లేకుండా కేవలం కాల్స్ కోసం మాత్రమే ఫోన్ వాడుతున్నారా? అయితే ఈ రూ.155 ప్లాన్ మీకోసమే అని నిస్సందేహంగా చెప్పొచ్చు.