MSVPG : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తో రియంట్రీ ఇచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసింది చాలా తక్కువ.
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కొంతమేరకు ఎంటర్టైన్మెంట్ గా నిలిచి మంచి సక్సెస్ సాధించింది. మెగాస్టార్ చిరంజీవి లోని కామెడీ టైమింగ్ ను మరోసారి ఆ సినిమాతో బయటికి తీసాడు బాబి. పూర్తిస్థాయిలో ఇప్పుడు అనిల్ రావిపూడి మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాతో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను బయటకు తీసే పనిలో ఉన్నారు. మామూలుగా అనిల్ రావిపూడి సినిమాలు అంటేనే ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్. మెగాస్టార్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా వాడినట్లు తెలుస్తుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతుంది.
ఈ పాటకు సంబంధించిన ప్రోమోను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ పాటలో నయనతారను ఉద్దేశిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓయ్ మీసాల పిల్ల అని పిలుస్తారు. వెంటనే నయనతార దగ్గరగా వచ్చి ఏమన్నావ్ అని అడుగుతుంది. మీసాల పిల్ల అన్నాను, అదేమీ తిట్టు కాదు. మా ఊర్లో పొగరుబోతు పిల్లని క్యూట్ గా మీసాల పిల్ల అని పిలుస్తారు. అని మెగాస్టార్ చెప్పిన కొద్దిసేపటి తర్వాత మీసాల పిల్ల అనే సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఉదిత్ నారాయణ వాయిస్ లో ఈ పాట వింటుంటే తన్మయత్వానికి గురవడం ఖాయం.
ఖచ్చితంగా ఈ సాంగ్ ‘గోదావరి గట్టు పైన రామచిలకవే’ కంటే కూడా పెద్ద హిట్ అవుతుంది అని అనిపిస్తుంది. ఆ పాటతో ఎలా అయితే సంక్రాంతి వస్తున్నాం సినిమాను భీమ్స్ నిలబెట్టారో, ఈ పాటతో కూడా మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా నిలబడే స్థాయిలో ఉంది అని చెప్పొచ్చు. కేవలం ఈ పాట మాత్రమే కాకుండా ఈ సినిమాకు సంబంధించి పాటలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి అని విశ్వసనీయవర్గాల నుండి సమాచారం వినిపిస్తుంది. మొత్తానికి కొన్ని సంవత్సరాలు తర్వాత ఉదిత్ మెగాస్టార్ చిరంజీవికి పాట పాడుతున్నారు.
మా ఊర్లో కుర్రోళ్ళు పొగరుమోతు పిల్లని క్యూట్ గా… “మీసాల పిల్ల” అని పిలుస్తారు.😎#MeesaalaPilla Promohttps://t.co/PUaiZBEQ8s
Enjoy it in the legendary vocals of #UditNarayan ji#ManaShankaraVaraPrasadGaru @AnilRavipudi #Nayanthara #Bheemsceciroleo @bhaskarabhatla… pic.twitter.com/I2SzZp5VLt
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 2, 2025
మెగాస్టార్ చిరంజీవి కి గతంలో కూడా ఉదిత్ నారాయణ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. అన్నిటిని మించి రామ్మా చిలకమ్మా అనే పాట బాగా పాపులర్ అయింది. అప్పటికే ఎస్పీ బాలసుబ్రమణ్యం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు, మణిశర్మ ఉదిత్ నారాయణను తీసుకొచ్చి రామ్మా చిలకమ్మా పాటను పాటించారు. ఆశ్చర్యకరంగా ఆ రోజుల్లోనే ఆ పాట సూపర్ హిట్ అయిపోయింది. ఇప్పటికీ కూడా ఆ పాట వింటే ఒక కొత్త వైబ్ లో లోపల స్టార్ట్ అవుతుంది. మరోసారి మన శంకర్ వరప్రసాద్ గారి కోసం భీమ్స్ దానినే ప్లాన్ చేసినట్లు ఉన్నారు.
Also Read : Raashii Khanna: స్క్రిప్ట్ ముఖ్యం కాదు… పవన్ కళ్యాణ్ అంటే సరిపోతుంది