BigTV English

American Gun Culture: హద్దులు దాటుతున్న అమెరికా గన్ కల్చర్.. ట్రంప్ ఫ్రెండ్ చార్లీ కిర్క్ పై గన్ ఫైర్ దేనికి సంకేతం?

American Gun Culture: హద్దులు దాటుతున్న అమెరికా గన్ కల్చర్.. ట్రంప్ ఫ్రెండ్ చార్లీ కిర్క్ పై గన్ ఫైర్ దేనికి సంకేతం?

American Gun Culture: శత్రువులు ఎక్కడో కాదు చుట్టూనే ఉంటారు.. తన శత్రువులు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వెతికి వేటాడే అమెరికా సొంత దేశంలో జనం మధ్యే తిరుగుతూ విచక్షణారహితంగా కాల్చి పడేసే వాళ్లను కనిపెట్టలేకపోతోందా? ముఖ్యంగా ట్రంప్ ఈ విషయంలో ఫెయిల్ అయ్యారా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ట్రంప్ సన్నిహితుడైన చార్లీ కిర్క్ షూటవుట్ పెద్ద సంచలనంగా మారింది. అందరూ చూస్తుండగానే షార్ప్ షూటర్ సరిగ్గా మెడ భాగంలో షూట్ చేశాడు. దీంతో క్షణాల్లో కిర్క్ చనిపోయాడు. మరి చార్లీ కిర్క్ పై గన్ ఫైర్ దేనికి సంకేతం?


ట్రంప్ కు సన్నిహితుడు చార్లీ కిర్క్

చార్లీ కిర్క్. వయసు 31 ఏళ్లు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చాలా సన్నిహితుడు. కన్జర్వేటివ్‌ యాక్టివిస్ట్‌. అంటే అమెరికా ప్రయోజనాలు, సంప్రదాయాలు, వారసత్వం, హక్కులు ఇలాంటి వాటిపై మాట్లాడుతూ స్టూడెంట్స్ లో ఉత్సాహం నింపుతుంటాడు. లేటెస్ట్ గా అమెరికాలో గన్ కల్చర్ పై మాట్లాడుతుండగా.. ఇదిగో ఇలా అదే గన్ కల్చర్ కు కిర్క్ బలయ్యాడు. అమెరికాలో మాస్‌ షూటింగ్స్‌ అన్న అంశంపై వర్సిటీలో చర్చాకార్యక్రమం జరిగింది. దీనికి కిర్క్ హాజరయ్యాడు. టెంట్‌లో అతడు కూర్చొని ఓ విద్యార్థి ప్రశ్నకు బదులిస్తున్న సమయంలో ఒకే ఒక్క బుల్లెట్ దూసుకొచ్చింది. ఘటనకు ముందు కిర్క్ మాట్లాడిన చివరి మాటలు గ్యాంగ్ హింసను కౌంట్ చేయాలా, వద్దా? అని అడిగారు. ఇవి ఇప్పుడు వైరల్ గా మారాయి.


కిర్క్ సెషన్ రద్దు కోరుతూ ఫిర్యాదు

నిజానికి యుటా వ్యాలీ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు కిర్క్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ ఇంటరాక్షన్ సెషన్ ను రద్దు చేయాలని కోరుతూ 1000 మంది సంతకాలు చేసిన ఓ ఫిర్యాదు యూనివర్సిటీకి అందింది. అయితే వర్సిటీ మాత్రం కార్యక్రమాన్ని రద్దు చేయలేదు. తాము ప్రతి ఒక్కరి భావ ప్రకటన స్వేచ్ఛకు.. నిర్మాణాత్మక చర్చలకు మద్దతు ఇస్తామని.. అందువల్ల కార్యక్రమాన్ని రద్దు చేయలేమని తేల్చి చెప్పింది. దీంతో ప్రోగ్రామ్ నిర్వహించారు. నిజానికి ఈ కార్యక్రమం రద్దై ఉంటే కిర్క్ బతికి ఉండే వాడేమో.

ట్రంప్ అన్ని సందర్భాల్లో కిర్క్ సపోర్ట్

18 ఏళ్లకే చార్లీ కిర్క్ టర్నింగ్‌ పాయింట్‌ యూఎస్‌ఏ ఆర్గనైజేషన్‌ను స్థాపించాడు. ట్రంప్‌ చేపట్టిన రైట్‌ రిపబ్లికన్‌ ఉద్యమానికి సపోర్ట్ గా ఉన్నాడు. పవర్ ఫుల్ స్పీచ్ లతో యూత్ ను ఆకట్టుకునే తత్వం. కిర్క్ కు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. తమ సంప్రదాయ భావజాలాన్ని విమర్శించేవారిపై కిర్క్‌ విరుచుకుపడుతుండేవాడు. అదే తనను ట్రంప్‌కు దగ్గర చేసింది. 2020లో ఓడిపోయినప్పుడు ఎన్నికల్లో గోల్‌మాల్‌ జరిగిందని ట్రంప్‌ విమర్శలు చేయగా కిర్క్‌ అండగా నిలిచాడు. వలసదారులు, ట్రాన్స్‌జెండర్లను కూడా కిర్క్‌ లక్ష్యంగా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రూవ్‌ మీ రాంగ్‌ అనే డిబేట్ ద్వారా కాలేజీ క్యాంపస్‌లలో లైవ్ డిబేట్ లు నిర్వహిస్తూ వచ్చారు. అలా ఆయన పేరు అమెరికా అంతటా మారుమోగింది. టర్నింగ్ పాయింట్ USAకి ఇప్పుడు 850కిపైగా కాలేజీల్లో సంఘాలు ఉన్నాయి.

కిర్క్ హత్యపై రగిలిపోతున్న డినాల్డ్ ట్రంప్

చార్లీ కిర్క్ దారుణ హత్య బాధ, ఆగ్రహం కలిగించాయన్నారు ట్రంప్. చార్లీ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచాడని, ఆయన నిజమైన దేశభక్తుడన్నారు ట్రంప్. అమెరికాలో రాజకీయ హింసపైనా ట్రంప్ మాట్లాడారు. ఇందుకు కారణమైన ఏ ఒక్కరినీ తమ ప్రభుత్వం విడిచిపెట్టదన్నారు. కిర్క్‌ మృతికి సంతాపంగా జాతీయజెండాను అవనతం చేయాలన్నారు. అమెరికాలో చార్లీ కంటే బాగా యువత హృదయాన్ని అర్థం చేసుకున్న వారు ఎవరూ లేరన్నారు ట్రంప్. ట్రంప్ రిలీజ్ చేసిన వీడియో సందేశంలో ఒక అర్థం ఉంది. అయితే సొంతదేశంలో హింసాత్మక ఘటనలను కట్టడి చేయడంలో ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి. పక్కదేశాల గురించి మాట్లాడడం, అక్కడి చర్యలపై ఫోకస్ పెట్టడం వరకు ఓకేగానీ.. సొంత దేశంలో అరాచకాలకు చెక్ పెట్టలేకపోతున్నారా అనడానికి ఈ ఘటన నిదర్శనంగా మారుతోంది.

షార్ప్ షూటర్ పనే అంటున్న FBI

కిర్క్ చనిపోవడంతో ఆయన సెప్టెంబర్ 2న Xలో చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. భారత్‌ నుంచి వచ్చే ప్రజలకు అమెరికా మరిన్ని వీసాలు మంజూరు చేయాల్సిన అవసరం లేదని, చట్టపరమైన వలసల కారణంగా అమెరికన్‌ వర్కర్ల స్థానంలో ఇండియన్లు చేరిపోయారని, ఇక చాలు అన్నారు. అమెరికా నిండిపోయిందని, మన వాళ్లకు తొలి ప్రాధాన్యం ఇద్దామని పోస్ట్ పెట్టారు. అదిప్పుడు వైరల్ అవుతోంది. సో కిర్క్ మాట్లాడుతున్న ప్రాతానికి అతి సమీపంలో ఉన్న బిల్డింగ్ రూఫ్‌టాప్ నుంచే కాల్పులు జరిగినట్లు ఎఫ్‌బీఐ అనుమానిస్తోంది. దీంతో ఇది షార్ప్‌ షూటర్‌ పని అయ్యి ఉండొచ్చంటున్నారు. ఘటన సమయంలో ఆ బిల్డింగ్ మీద ఓ వ్యక్తి దాక్కొన్న సీన్లు వెలుగులోకి వచ్చాయి. షార్ప్ షూటర్ ను పట్టుకునేందుకు FBI రంగంలోకి దిగింది. చార్లీ కిర్క్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భార్య ఎరికా కిర్క్‌ మాజీ మిస్‌ అరిజోనా యూఎస్‌ఏ.

చార్లీ కిర్క్‌ షూటవుట్ అమెరికాలో రాజకీయ హింసపై తీవ్ర చర్చకు కారణమవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై కాల్పుల తర్వాత.. ఈ తరహా దాడులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే.. కిర్క్‌ను చంపేంత పగ, కోపం ఎవరికి ఉన్నాయనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇంతకీ అమెరికాలో గన్ కల్చర్ హద్దులు దాటుతోందా? ఎక్కడెక్కడో కంట్రోల్ చేస్తానంటున్న ట్రంప్ సొంత దేశంలో ఇలాంటి అరాచకాలపై ఫోకస్ పెట్టడం లేదా?

యూస్‌లో పొలిటికల్ లీడర్లపై కాల్పులు కామనే

అమెరికాలో జనాల పరిస్థితి ఎలా ఉందంటే.. ఈ ఏడాది జనవరిలో పీపుల్స్ మార్చ్ లో పాల్గొన్నవారిలో 33 శాతం మంది దేశ రక్షణ కోసం అవసరమైతే హింసకు దిగాల్సిందే అన్న అభిప్రాయం చెప్పారు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది రాజకీయ హింసపై అమెరికా సమాజంలో పెరుగుతున్న ఒత్తిడిని చూపిస్తుంది. ఇక యూఎస్ లో మనిషికో గన్ కామన్. అక్కడి అధ్యక్షులు, పొలిటికల్ లీడర్లపై కాల్పులు కూడా కామనే. 1776 నుంచి ఇప్పటి వరకు అమెరికాలో అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులపై 15 డైరెక్ట్ ఎటాక్స్ జరిగాయి. వీరిలో పదవిలో ఉన్నప్పుడు నలుగురు అధ్యక్షులు గన్ ఫైరింగ్ కు బలయ్యారంటే అమెరికన్ల మానసిక పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

బుల్లెట్ నుంచి తృటిలో తప్పించుకున్న ట్రంప్

అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై ఓ వ్యక్తి కాల్పులకు దిగాడు. జస్ట్ మిస్.. చెవికి గాయమైంది. రక్తం వచ్చింది అంతే. లేకపోతే అప్పటికే ట్రంప్ ఫోటో దగ్గర పుష్పాంజలి ఘటించేవారే. జూలై 13, 2024: పెన్సిల్వేనియా ర్యాలీలో ఈ ఘటన జరిగింది. అదే ఏడాది సెప్టెంబర్ 15న ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్స్ దగ్గర రెండో మర్డర్ అటెంప్ట్ జరిగింది. అప్పుడూ కూడా ప్రాణాలతో బయటపడ్డాడు ట్రంప్. అమెరికాలో 2023 మొత్తంలో 647 మాస్ షూటింగ్స్ జరగాయి. 2024లో మొత్తం మాస్ షూటింగ్స్ 630కు పైగా నమోదయ్యాయి. 2025లో ఆగస్ట్ వరకు ఇప్పటికే 400 దాకా మాస్ షూటింగ్స్ జరిగాయి. సింపుల్ గా పబ్లిక్ లోకి వస్తారు బుల్లెట్లు అయిపోయే వరకు విచక్షణారహితంగా కాల్చేస్తారు. స్కూల్, కాలేజ్ లోకి వెళ్తారు.. తోటి విద్యార్థులు, టీచర్లు అని చూడరు. కాల్చేస్తారు. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. వీళ్లు సొంత దేశం వదిలి బయటి దేశాలను వణికిద్దామనుకుంటారు. కానీ వీళ్లనే వణికించే గ్యాంగులు అమెరికాలోనే ఉన్నాయి. వీటిని కట్టడి చేసే ఆలోచన ఎందుకు చేయట్లేదు?

మానసిక అనారోగ్యం, ఒంటిరితనంతో ఉన్నవారే ఎటాక్స్

అమెరికాలో మానసిక అనారోగ్యం, ఒంటరితనంతో ఉన్న వ్యక్తులు హింసలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇలాంటి వాళ్లే చేశారు. అయితే రాజకీయ హింస మాత్రం మరో రకంగా ఉంటుంది. పొలిటికల్ గా విబేధించిన వారు ఎంతకైనా తెగిస్తారు. 2011లో గాబ్రియెల్ డీ గిఫోర్డ్స్ పై దాడి, ఆమెకు బ్రెయిన్ ఇంజ్యూరీ అవడం, 2017లో స్టీవ్ స్కాలిస్‌పై జరిగిన ఫైరింగ్, 2020లో మిచిగాన్ గవర్నర్ గ్రెచెన్ విట్మర్‌పై కిడ్నాప్ కుట్ర వంటివి అమెరికాలో పొలిటికల్ వయొలెన్స్ ఎలా ఉందో చెబుతాయి. వీటికి తోడు అమెరికా చరిత్రలో అధ్యక్షులపై చాలా హత్యాయత్నాలు జరిగాయి. నలుగురు అధ్యక్షులు పదవిలో ఉండగానే ఇవే తుపాకులకు బలయ్యారు.

1881లో జేమ్స్ గార్ఫీల్డ్ మర్డర్

1865లో 16వ అధ్యక్షుడైన అబ్రహం లింకన్ ను కాల్చి చంపారు. నల్లజాతి హక్కులకు మద్దతు ఇవ్వడంతో ఈ హత్య జరిగిందంటారు. 1881లో 20వ అధ్యక్షుడిగా ఉన్న జేమ్స్ గార్ఫీల్డ్ ను వాషింగ్టన్‌ రైల్వే స్టేషన్‌లో కాల్చాడు. 1901లో 25వ అధ్యక్షుడిగా ఉన్న విలియం మెక్‌ కిన్లీని బఫెలోలో జరిగిన ఒక ఈవెంట్‌లో చంపేశారు. 1963లో అమెరికా 35వ అధ్యక్షుు జాన్ ఎఫ్. కెన్నెడీ ఇలాగే బలయ్యాడు. 1981లో రొనాల్డ్ రీగన్ పై ఎటాక్ జరిగింది. కానీ అతడు అప్పట్లో బతికాడు. పాపులారిటీ బాగా పెరిగింది. ట్రంప్ కూడా ఇలాగే ఫైరింగ్ నుంచి బయటపడడంతో పాపులారిటీ పెరిగి గెలిచాడంటారు. అమెరికాలో అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థుల ప్రాణాలకే దిక్కు లేదు. చార్లీ కిర్క్ లాంటి వాళ్ల ప్రాణాలకు సేఫ్టీ ఉంటుందా? కామన్ మ్యాన్ కు సేఫ్టీ ఉంటుందా?

Also Read: దూసుకొస్తున్న రెండు అల్పపీడనాలు.. ఈ జిల్లాల్లో మరో 5 రోజులు దబిడి దిబిడే

అమెరికాలో గన్ కల్చర్ అన్నది రాజ్యాంగ రెండో సవరణ ద్వారా వచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛ, సెల్ఫ్ ప్రొటెక్షన్ అని పైకి చెప్పినా.. హింస పెరగడానికి కారణమంటున్నారు. ప్రతి వందమంది దగ్గర 120 దాకా గన్స్ ఉంటాయని అంచనా. ఇది ప్రపంచంలోనే అత్యధికం. గన్స్ అంటే ఏవో చిన్నవే అనుకునేరు. AR-15 స్టైల్ రైఫిల్స్ లాంటివి కూడా ఈజీగానే అక్కడి మార్కెట్లలో దొరుకుతున్నాయి. ఇలా వెపన్స్ ఈజీగా అందుబాటులో ఉండడంతో రాజకీయ హింస, మాస్ షూటింగ్స్ జరుగుతున్నాయంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన తర్వాత ఆయన తన దేశ సమస్యల కంటే అంతర్జాతీయ విషయాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. చికాగో, న్యూయార్క్, వాషింగ్టన్ లలో అరెస్టులు, గన్స్ సీజ్ చేయడం వంటివి జరుగుతున్నా.. హింసను ఆపట్లేదు. ఓవైపు ట్రంప్ అంతర్జాతీయంగా శాంతి ఒప్పందాల్లో భాగస్వామ్యమవడం, నోబెల్ శాంతిబహుమతిపై కన్నేయడం, విదేశీ విధానంపై దృష్టి సారించినప్పటికీ, దేశీయ రాజకీయ హింస, నేరాల సమస్యలు మైనస్ గా మారుతున్నాయి.

Story By Vidya Sagar, Bigtv

Related News

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

Telangana BJP: నూతన రాష్ట్ర కమిటీని ప్రకటించిన బీజేపీ

Anantapur Politics: అనంతపురం జిల్లా టీడీపీ కొత్త అధ్యక్షుడు ఎవరంటే..!

Drinking Water Project: ఒక్క ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌కు తాగునీటికి నో ఢోకా.. ఎలా అంటే..!

AP Liquor Scam: వైసీపీలో గుబులు.. లిక్కర్ స్కాంలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరు?

kavitha Political Future: రాజీనామా తర్వాత కవిత సైలెంట్..! జాతీయ పార్టీలో చేరతారా?

Tadipatri Politics: జేసీ యాక్షన్ ప్లాన్..! పెద్దారెడ్డికి మళ్లీ షాక్..

Big Stories

×