BigTV English

Turmeric: పసుపుతో మ్యాజిక్ .. ఇలా వాడితే అద్భుతమైన ప్రయోజనాలు !

Turmeric: పసుపుతో మ్యాజిక్ .. ఇలా వాడితే అద్భుతమైన ప్రయోజనాలు !

Turmeric: పసుపును ఆహార పదార్థాల్లో రుచి, రంగు కోసం మాత్రమే కాకుండా.. దీనిని ఆరోగ్యం, అందానికి ఒక నిధిగా కూడా ఉపయోగిస్తారు. పసుపు దాని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల కారణంగా ఆయుర్వేదంలో ఔషధ మూలికగా పరిగణిస్తారు. పసుపు అనేక శారీరక వ్యాధులను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.


పసుపును చాలా మంది హోం రెమెడీగా కూడా ఉపయోగిస్తారు. గాయాలను నయం చేయడం, జలుబు, దగ్గును నయం చేయడం లేదా చర్మ మెరుపును పెంచడం వంటివి వాటికి పసుపు చాలా బాగా ఉపయోగ పడుతుంది. ఇది కేవలం సుగంధ ద్రవ్యం కాదు, ఆరోగ్యానికి , అందానికి రెండింటికీ ప్రయోజనకరమైన సహజ ఔషధం.

పసుపుతో హోం రెమెడీస్:


పసుపు పాలు: జలుబు, దగ్గు, శరీరంలోని నొప్పులకు పసుపు పాలు ఒక అద్భుత నివారణ. ఇందులోని కర్కుమిన్ కంటెంట్ రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. అంతే కాకుండా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయ పడుతుంది. పడుకునే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగడం వల్ల నిద్ర బాగా పట్టడమే కాకుండా శరీరం విశ్రాంతి పొందుతుంది.

గాయం నయం కోసం పసుపు: పసుపును సహజ క్రిమినాశక మందుగా పరిగణిస్తారు. చిన్న గాయాలకు పసుపును అప్లై చేయడం వల్ల రక్తస్రావం ఆగిపోతుంది. అంతే కాకుండా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. పురాతన కాలంలో.. ప్రజలు చిన్న చిన్న గాయాలను తగ్గించడానికి పసుపును ఉపయోగించారు. గాయం నయం కావడాన్ని వేగవంతం చేయడంలో.. వాపును తగ్గించడంలో ఇది ప్రభావ వంతంగా ఉంటుంది.

చర్మ కాంతికి పసుపు: చర్మాన్ని కాంతి వంతం చేయడానికి పసుపు ఫేస్ ప్యాక్‌లను సాధారణంగా ఉపయోగిస్తారు. పెరుగు లేదా గంధంతో కలిపి పసుపును అప్లై చేయడం వల్ల చర్మం ప్రకాశ వంతంగా మారుతుంది. అంతే కాకుండా మొటిమలు కూడా తగ్గుతాయి. దీని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. అంతే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి.

Also Read: పెదాలు ఎరుపు రంగులోకి మారాలా ? ఈ టిప్స్ మీ కోసమే !

పసుపు జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది: పసుపు జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. భోజనానికి ముందు గోరువెచ్చని నీటిలో పసుపు కలిపి తాగడం వల్ల గ్యాస్, అసిడిటీ , కడుపు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది కాలేయాన్ని బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా  శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయ పడుతుంది.

కీళ్ల నొప్పులకు పసుపు: కీళ్ల నొప్పులు లేదా ఆర్థరైటిస్‌కు పసుపు తీసుకోవడం చాలా ప్రయోజన కరంగా ఉంటుంది. పసుపులోని శోథ నిరోధక లక్షణాలు మంటను తగ్గిస్తాయి. అంతే కాకుండా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పసుపు పాలు లేదా పసుపు గుళికలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల దృఢత్వం, నొప్పి వంటివి కూడా తగ్గుతుంది. కీళ్ల నొప్పులు తగ్గాలంటే తరచుగా పసుపును ఆహారం లో భాగంగా చేసుకోవడం మంచిది.

Also Read: చిగుళ్ల నుంచి రక్తం కారుతోందా ? కారణం ఇదేనట !

Related News

Dum Aloo Masala: రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ ఆలూ మసాలా.. ఇలా చేస్తే అద్భుతమైన రుచి !

Tips For Red Lips: పెదాలు ఎరుపు రంగులోకి మారాలా ? ఈ టిప్స్ మీ కోసమే !

Warm Milk: రాత్రి పూట గోరు వెచ్చని పాలు తాగితే.. మతిపోయే లాభాలు !

Health oil tips: ఆహారంలో ఈ నూనెలు వాడటం మానేయండి? లేదంటే ప్రమాదమే!

High Blood Pressure: కంటి సమస్యలా ? మీకు.. హైబీపీ కావొచ్చు !

Dandruff Tips: కేవలం వారం రోజులు చాలు.. చుండ్రు లేకుండా మెరిసే జుట్టు రహస్యం..

Gums Problem:చిగుళ్ల నుంచి రక్తం కారుతోందా ? కారణం ఇదేనట !

Big Stories

×