Little Hearts 2: డైరెక్టర్ సాయి మార్తాండ్ (Sai Marthand) దర్శకత్వంలో మౌళి తనూజ్ (Mouli Tanuj)శివాని నాగారం(Shivani Nagaram) జంటగా నటించిన తాజా చిత్రం లిటిల్ హార్ట్స్(Little Hearts). ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక చిన్న సినిమాగా విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు 35 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా థియేటర్లలో ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకొని ప్రస్తుతం ఓటీటీలో ప్రేక్షకులను సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఈటీవీ విన్(Etv Win) లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా థియేటర్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతోంది అంటూ ఇదివరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సీక్వెల్ సినిమాపై డైరెక్టర్ సాయి మార్తాండ్ స్పందిస్తూ అధికారికంగా తెలియజేయడమే కాకుండా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలను కూడా తెలియజేశారు. ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని అయితే ఈ సినిమాలో హీరో మారిపోయినట్లు వెల్లడించారు. లిటిల్ హార్ట్స్ సినిమాలో మౌళి అన్నయ్య సీక్వెల్ సినిమాలో హీరోగా కనిపించబోతున్నారని తెలియజేశారు.
ఇక లిటిల్ హార్ట్స్ మౌళి అన్నయ్య పాత్రలో డైరెక్టర్ సాయి మార్తాండ్ నటించారు. ఈ క్రమంలోనే సీక్వెల్ సినిమాలో హీరోగా దర్శకుడు సాయి మార్తాండ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక హీరోయిన్ పాత్రల్లో కూడా శివాని నాగారం(Shivani Nagaram) కాకుండా ధీరా రెడ్డిని(Dheera Reddy) ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాలను స్వయంగా దర్శకుడు సాయి మార్తాండ్ వెల్లడించడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడించబోతున్నట్లు తెలిపారు. ఇలా సీక్వెల్ సినిమాలో హీరో హీరోయిన్లు మారిపోయారనే విషయం తెలియడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చలకు కారణం అయ్యింది.
#LittleHearts2 Announced:
Director #SaiMarthand, who played Moul ’s brother in the first film, will be making his debut as a hero in the sequel. #DheeraReddy has been cast as the heroine. More updates will be revealed soon. pic.twitter.com/tV26fytMtC
— MOHIT_R.C (@Mohit_RC_91) October 2, 2025
లిటిల్ హార్ట్స్ సినిమా మంచి సక్సెస్ కావడంతో మౌళి తనూజ్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. అంతేకాకుండా మౌలికి తదుపరి సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే ఈ సీక్వెల్ సినిమాలో ఆయనని తప్పించి డైరెక్టర్ హీరోగా మారడం వెనుక ఉన్న మర్మం ఏమిటి? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సీక్వెల్ సినిమాలో హీరో మారిపోవడం పట్ల నటుడు మౌళి తనూజ్ స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక మౌళి 90 ‘s కిడ్స్ వెబ్ సిరీస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఇతనికి సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈ వెబ్ సిరీస్ ద్వారా లిటిల్ హార్ట్స్ సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో పలువురి దర్శక నిర్మాతల దృష్టి మౌలి పై ఉందని చెప్పాలి.
Also Read: Rahul Ramakrishna: కేటీఆర్, కేసీఆర్ మీరే రావాలి.. నన్ను చంపేయండి, రాహుల్ రామకృష్ణ సంచలన పోస్ట్!