స్పీడ్ రైళ్లు ప్రయాణ సమయాన్ని మరింత తగ్గిస్తున్నాయి. వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న నగరాలను గంటల వ్యవధిలో అనుసంధానిస్తున్నాయి. ప్రయాణాలను వేగవంతంగా, సౌకర్యవంతంగా మార్చుతున్నాయి. జపాన్ ఐకానిక్ షింకన్‌సెన్ నుంచి చైనా మాగ్లెవ్ వరకు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. మన దేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ గంటలకు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ, ప్రస్తుతం గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చైనా, జపాన్ లాంటి దేశాల్లో పలు రైళ్లు గంటకు 300 కి.మీకి మించి వేగంతో దూసుకెళ్తున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే టాప్ 10 రైళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
⦿షాంఘై మాగ్లెవ్: షాంఘై ట్రాన్స్ రాపిడ్ అని పిలిచే షాంఘై మాగ్లెవ్ రైలు చైనాలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ప్రయాణించే రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు గంటకు 460 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
⦿CR హార్మొనీ: చైనాలో 2007లో ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు గంటకు 350 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.
⦿CR ఫక్సింగ్: వేగం, సామర్థ్యం, అధునాతన రైల్వే టెక్నాలజీలో దీనిని రూపొందించారు. ఇది ప్రపంచంలోని అత్యంత అధునాతన రైలు నమూనాలలో ఒకటి. దీని గరిష్ట వేగం గంటకు 350 నుంచి 400 కి.మీ వరకు ఉంటుంది.
⦿DB ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్ 3: సీమెన్స్, బాంబార్డియర్ తయారు చేసిన ICE 3, 2000 సంవత్సరం నుంచి జర్మనీలో నడుస్తుంది. గంటకు 330 కి.మీ గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. జర్మనీ పొరుగున ఉన్న యూరోపియన్ దేశాలకు ఈ రైలు ద్వారా సర్వీసులను కొనసాగిస్తుంది.
⦿SNCF TGV: ఆల్స్టామ్, SNCF కలిపి తయారు చేశారు ఫ్రాన్స్ కు చెందిన TGV. ఈ రైలు గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
⦿JR షింకన్‌సెన్: 1964లో జపాన్ లో షింకన్‌సెన్ బుల్లెట్ రైలు అందుబాటులోకి వచ్చింది. అత్యంత వేగం, భద్రతకు కేరాఫ్. ఇది గంటకు 320 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
⦿ONCF అల్ బోరాక్: మోరాకోకు చెందిన అల్ బోరాక్ ఆఫ్రికాలో మొట్టమొదటి హై-స్పీడ్ రైలు. మొరాకోకు చెందిన ONCF, ఫ్రాన్స్ కు చెందిన ఆల్ స్టామ్ భాగస్వామ్యంతో తయారు చేయబడింది. ఈ రైలు గరిష్ట వేగంతో 320 కి.మీ/గం.
⦿Renfe AVE క్లాస్ 103: ఈ రైలు 2007ఓ అందుబాటులోకి వచ్చింది. ఇది స్పానిష్ నగరాలను కలుపుతుంది. తరచుగా దేశీయ విమానాల కంటే రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. ఈ రైలు గంటకు 310 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంది
⦿Korail KTX-Sancheon: 2010లో ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ రైలు గంటకు 305 కి.మీ. గరిష్ట వేగాన్ని కలిగి ఉంది.
⦿Trenitalia Frecciarossa 1000: ఇది ఇటలీలో అత్యంత వేగవంతమైన రైలు. దాని సొగసైన డిజైన్, విలాసవంతమైన ఇంటీరియర్‌లతో ప్రయాణీకులను ఆకట్టుకుటుంది. ఇది గంటకు 360 కి.మీ వేగంతో నడుస్తుంది.
Read Also: రైల్వే నుంచి డబ్బులు సంపాదించవచ్చు, సింపుల్ గా ఇలా చేస్తే సరిపోతుంది!