BigTV English

Viral News: ఛీ.. సూప్ లో మూత్రం పోసిన టీనేజర్, రూ.2.56 కోట్లు జరిమానా విధించిన కోర్టు!

Viral News: ఛీ.. సూప్ లో మూత్రం పోసిన టీనేజర్, రూ.2.56 కోట్లు జరిమానా విధించిన కోర్టు!

Chinese Viral News:

ఈ రోజుల్లో చాలా మంది మంది యువతీ యువకులు ప్రాంక్ ల పేరుతో జనాలను చిరాకు పెడుతున్నారు. కొన్నిసార్లు భయపెడుతున్నారు కూడా. చివరకు ప్రాంక్ అంటూ ఫన్నీ చేస్తున్నారు. అప్పటిలోగా చాలా మంది తీవ్ర మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. తాజాగా ఇలాంటి పని చేసిన  ఇద్దరు యువకులకు చైనా కోర్టు తగిన శాస్తి చేసింది. ఏకంగా రూ. 2.56 కోట్ల జరిమానా విధించింది. జీవితంలో మరోసారి ప్రాంక్ అంటేనే సుస్సు పోసుకునేలా చేసింది. ఈ తీర్పుపై చైనాతో పాటు ఇతర దేశాల నెటిజన్లు కూడా సంతోషం వ్యక్తం చేశారు. బాగయ్యింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?  

షాంఘైలో హైడిలావ్ హాట్ పాట్ అనే ఫేమస్ రెస్టారెంట్ ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. 1990లో సిచువాన్ ప్రావిన్స్‌ లో స్థాపించబడిన హైడిలావ్.. ప్రపంచ వ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ అవుట్‌ లెట్లను కలిగి ఉంది. తాజాగా షాంఘైలో హైడిలావ్ హాట్ పాట్ రెస్టారెంట్ లో ఊహించని ఘటన జరిగింది. ఇద్దరు 17 ఏళ్ల కుర్రాళ్లు ఓ సూప్ బౌల్ లో మూత్రం పోశారు. ఒకరు టాయిలెల్ చేస్తుండగా, మరొకరు దాన్ని షూట్ చేశాడు. ఈ వీడియోను వాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిజానికి ఇది ప్రాంక్ వీడియో.. కానీ, చాలా మంది నిజమే అనుకున్నారు. ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేసింది. ఇలాంటి సూప్ తమకు వడ్డిస్తారా? అంటూ ఆ రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్లు యాజమాన్యం మీద తిరగబడ్డారు. ఊహించని పరిణామంతో రెస్టారెంట్ యాజమాన్యం ఆ రోజు రెస్టారెంట్ కు వచ్చిన వారందరికీ పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. వారి వారి బిల్లులు వెనక్కి ఇచ్చింది. సుమారు 4 వేల మందికి డబ్బులు రిటర్న్ చేసింది.

ఈ వ్యవహారంపై సీరియస్ అయిన రెస్టారెంట్ యాజమాన్యం

తమ రెస్టారెంట్ లో జరిగిన ఈ వీడియో వ్యవహారంపై యాజమాన్యం సీరియస్ అయ్యింది. ఈ వీడియోను షూట్ చేసిన యువకులపై కోర్టులో కేసు వేసింది. తాము కస్టమర్లకు చెల్లించిన వాపసుతో పాటు రెస్టారెంట్ క్రెడిబులిటీకి జరిగిన డ్యామేజ్ కి పరిహారం చెల్లించేలా చూడాలని కోర్టును వేడుకుంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇద్దరు కుర్రాళ్లకు ఏకంగా 2.2 మిలియన్ యువాన్ల ( భారత కరెన్సీలో సుమారు రూ. 2.56 కోట్లు) జరిమానా విధించింది. ఈ డబ్బులను సదరు రెస్టారెంట్ యాజమాన్యానికి చెల్లించాలని ఆదేశించింది. టీనేజర్లు చేసిన ఈ వీడియో కారణంగా ఓ ప్రతిష్టాత్మక రెస్టారెంట్ పరువుపోయిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. పిల్లలను సరిగి పెంచడంలో విఫలం అయిన తల్లిదండ్రులు ఈ జరిమానా భరించాలని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం పట్ల సదరు యువకుల కుటుంబ సభ్యులు షాక్ కు గురికాగా, తీర్పు పట్ల నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. చెత్త పనులు చేసేవారికి ఇలాంటి పని కావాల్సిందే అంటూ చురకలు అంటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చైనాలో హాట్ టాపిక్ గా మారింది.


Read Also:  వీధి కుక్కలకు జీవిత ఖైదు.. జైల్లో పెట్టి మక్కెలు ఇరగదీసుడే.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

Related News

Viral video: దారుణ ఘటన.. భార్యను కట్టేసి.. బెల్టుతో కొడుతూ పైశాచిక ఆనందం..!

Viral Video: ఒకే వ్యక్తితో తల్లి, కూతురు సంబంధం.. ఒకేసారి గర్భం కూడా, ఛీ పాడు!

Stray Dogs: వీధి కుక్కలకు జీవిత ఖైదు.. జైల్లో పెట్టి మక్కెలు ఇరగదీసుడే.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

Gemini AI: అంత బద్దకం ఎందుకు? జెమినీ AI శారీ ట్రెండ్‌పై టాటా ఫ్రెండ్ శాంతను నాయుడు సెటైర్!

Gemini AI Saree Photos Trend: జెమిని AI శారీ ఫోటో ట్రెండ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్!

Paris: పారిస్ నగరం ఇలా ఉంటుందా..? ఇండియన్ టూరిస్ట్ వీడియో రిలీజ్.. మీరూ చూసేయండి

CIBIL Score: సిబిల్ స్కోర్ ఉంటేనే పెళ్లి.. వరుడికి వధువు కండిషన్లు, ఇంతకీ పెళ్లయ్యిందా?

Big Stories

×