BigTV English

Forest Officials: గ్రామస్తులకు తిక్కరేగింది.. పులికి ఎరగా ఫారెస్టు అధికారులు, బోనులో పెట్టి మరీ..

Forest Officials: గ్రామస్తులకు తిక్కరేగింది.. పులికి ఎరగా ఫారెస్టు అధికారులు, బోనులో పెట్టి మరీ..

Forest Officials:

జనాలు తిరగబడితే ఎలా ఉంటుంది అనేదానికి ఇదో ప్రత్యక్ష ఉదాహారణ. తమ ఊళ్లోకి పులి వస్తుందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయారు. పశువులను చంపుతున్నా ఫారెస్ట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని కోపంతో ఊగిపోయారు. ఏకంగా అటవీ అధికారులను బోనులో బంధించి పులికి ఎరగా వేశారు. ఈ షాకింగ్ ఘటన కర్నాటకలో జరిగింది. ఉన్నతాధికారుల జోక్యం చేసుకుని.. పులిని పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో బంధించిన ఫారెస్ట్ అధికారులను గ్రామస్తులు విడుదల చేశారు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?  

చామరాజనగర జిల్లా బొమ్మలాపుర గ్రామంలో గత నెల రోజులుగా ఓ పులి సంచరిస్తోంది. తరచుగా పొలాల్లో కనిపించడంతో పాటు ఊరిలోకి వస్తుంది. అంతేకాదు, తమ పశువులను చంపుతోంది. గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. కనీసం పొలం పనులకు, కూలి పనులకు వెళ్లలేకపోతున్నారు. పులి ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని వణికిపోతున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు.  చాలా రోజులు వారి చుట్టు తిరిగినా పట్టించుకోలేదు. చివరకు ఓ బోను తెచ్చి గ్రామ శివార్లలో పెట్టారు. పులి ఆ బోనులో పడకపోగా, తరచుగా ఊళ్లోకి రావడం మొదలు పెట్టింది. గ్రామస్తులకు తీవ్ర ఆగ్రహం కలిగింది. తమ సమస్యను పరిష్కరించాలని ఎంత విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు.

ఫారెస్ట్ అధికారులను బోనులో బంధించిన గ్రామస్తులు

ప్రాణ భయంతో వణికిపోతున్నా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ కోపంతో ఊగిపోయారు. తమ గ్రామానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులను పట్టుకుని బోనులో బంధించి, పులికి ఎరగా వేశారు. “మీరు పులిని పట్టుకోలేకపోతే, మీరే బోనులో కూర్చోండి” అంటూ ఫైర్ అయ్యారు. పులిని పట్టుకోవడంలో ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు.


గ్రామస్తులకు సర్ది చెప్పిన ఉన్నతాధికారులు

విషయం తెలుసుకుని గుండ్లుపేట రేంజ్ ఏసీఎఫ్ సురేష్, బందీపూర్ రేంజ్ ఏసీఎఫ్ నవీన్ కుమార్ బొమ్మలాపుర చేరుకున్నారు. గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పులిని పట్టుకోవడానికి ఏనుగులను ఉపయోగించి కూంబింగ్ ఆపరేషన్ వెంటనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఉన్నతాధికారుల హామీతో స్థానికులు ఫారెస్ట్ సిబ్బందిని విడిచిపెట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకసారి ఇలా జరిగితేనే, మరోసారి ఫిర్యాదు చేయగానే సీరియస్ గా చర్యలు తీసుకుంటారు. నెల రోజుల నుంచి గ్రామస్తులు భయపడుతున్నా పట్టించుకోకపోవడం నిజంగా దారుణం అని నెటిజన్లు మండిపడుతున్నారు.

మరోవైపు ఫారెస్ట్ అధికారి ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు అడిషనల్ ఎస్పీ శశిధర్ వెల్లడించారు. అధికారులను బంధించిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సుమారు 3 నెలల క్రితం చామరాజనగర జిల్లా మహదేశ్వర హిల్స్  ఓ పులి తన పశువులను చంపడంతో ఓ రైతు విషం పెట్టాడు. ఆ విషాన్ని తిని ఓ పులితో పాటు నాలుగు పిల్లలు చనిపోయాయి. అప్పట్లో ఈ ఘటన సంచలనం కలిగించింది.

Read Also: 82 ఏళ్ల బామ్మ కడుపులో స్టోన్ బేబీ.. వైద్య చరిత్రలో అరుదైన కేసు ఇది!

Related News

Viral video: పార్లమెంటును తగలబెట్టేసి రీల్స్ చేసిన జెన్ జెడ్ నిబ్బాలు.. ఇది అవినీతిపై పోరులా లేదే?

Delhi News: మహీంద్రా షోరూమ్‌.. థార్‌ ఎస్‌యూవీ ఒక్కసారిగా పల్టీలు, వైరల్ వీడియో

Gigi Hadid: కేవలం ఆ టేపు చుట్టుకుని నడిచినందుకు రూ.80 కోట్లు చెల్లించారట.. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటీ?

Viral Video: మినీ బస్సులో సముద్రంలో షికారు.. ఒక్క భారీ కెరటంతో సీన్ మారిపోయింది!

Viral News: కొట్టేయడం నా హాబీ.. చోరీ కేసులో మహిళ సర్పంచ్ అరెస్ట్, ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు ఔట్!

Big Stories

×