భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. తక్కువ ఖర్చులో ఆహ్లాదకరంగా ప్రయాణం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది రైలు ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, టికెట్ల బుకింగ్ విషయంలో ప్రయాణీకులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. బుకింగ్ విండో ఓపెన్ అయిన కాసేపట్లోనే టికెట్లు అన్నీ అయిపోతున్నాయి. రైల్వే ఏజెంట్లు టికెట్లను క్షణాల్లోనే బ్లాక్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజమైన లబ్దిదారులకు మేలు కలిగేలా ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగా ఐఆర్‌సీటీసీ అకౌంట్ కు ఆధార్ తో లింక్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. టికెట్ బుకింగ్ సమయంలో సాధారణ ప్రయాణీకులకే ముందుగా ప్రయారిటీ ఇస్తోంది. తొలి 30 నిమిషాల వరకు రైల్వే ఏజెంట్లు టికెట్ బుక్ చేయకుండా నిరోధిస్తుంది. త్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ బేస్డ్ ఓటీపీని తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపింది. తాజాగా ఐఆర్‌సీటీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు తత్కాల్ టికెట్ బుకింగ్స్ కు ఆధార్ ధృవీకిరణ తప్పనిసరి చేసిన భారతీయ రైల్వే ఇప్పుడు జనరల్ టికెట్ బుకింగ్ కూ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి చేసింది. అంతేకాదు, ఆధార్ లింక్ అయిన వినియోగదారులకు జనరల్ టికెట్ విండో ఓపెన్ అయిన తర్వాత తొలి 15 నిమిషాలు వారికే ప్రయారిటీ ఇస్తుంది. ఆ తర్వాత లింక్ చేసుకోని వినియోగదారులు టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: జొమాటోతో మేక్ మై ట్రిప్ జోడీ, ఇక రైల్వే ప్రయాణీకులకు నేరుగా ఫుడ్ డెలివరీ!
ఇక ఇప్పటికే ఐఆర్‌సీటీసీ ముందస్తు టికెట్ బుకింగ్ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు కుదించిన విషయం తెలిసిందే. ఆన్ లైన్ ట్రైన్ టికెట్ రిజర్వేషన్ సాధారణంగా ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు ఉదయం 8:00 గంటలకు అందుబాటులోకి వస్తుంది. ఉదాహరణకు.. ఇవాళ (సెప్టెంబర్ 18, 2025) అయితే, నవంబర్ 17, 2025 తేదీకి టికెట్ల రిజర్వేషన్ ఉదయం 8:00 గంటలకు ఓపెన్ అవుతుంది. ఇక తత్కాల్ టికెట్స్ కోసం ఒకరోజు ముందుగానే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. AC క్లాస్ టికెట్ల కోసం ఉదయం 10 గంటలకు విండో మొదలవుతుంది. స్లీపర్ క్లాస్ టికెట్ల కోసం ఉదయం 11 గంటలకు బుకింగ్ విండో ఓపెన్ అవుతుంది. ఈ టికెట్లను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లు, రైల్వే స్టేషన్లలోని కౌంటర్ల నుండి బుక్ చేసుకోవచ్చు. అయితే, మిగిలిపోయిన బెర్తులను ప్రయాణ సమయానికి గంట ముందు కూడా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది భారతీయ రైల్వే. ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: ఇండియన్ రైల్ ఎక్కిన కెనడా అమ్మాయి.. రైల్వే గురించి ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు అవుట్!