Jayammu Nischayammuraa: జగపతిబాబు (Jagapathi Babu)హోస్టుగా ప్రసారమవుతున్న జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nischayammuraa) టాక్ షో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు హాజరవడంతో జగపతిబాబు వారికి సంబంధించి ఎన్నో రహస్యాలను ఈ షో ద్వారా బయటపెడుతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి నాగార్జున, శ్రీ లీల, మీనా సిమ్రాన్ వంటి ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక తదుపరి ఎపిసోడ్ లో భాగంగా నాగచైతన్య ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన మరొక ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా జగపతిబాబు నాగచైతన్యను పలు వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రశ్నించారు. జీవితమనే పుస్తకంలో పులి స్టాప్ కి చోటు ఉండదని, కామాలు పెట్టుకుంటూ జీవితాన్ని ముందుకు కొనసాగించాల్సిందే అంటూ ఈ సందర్భంగా చైతన్య చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కార్యక్రమంలో గొడవలు గురించి కూడా జగపతిబాబు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో గొడవలు ఉండాల్సిందేనని గొడవలు లేకపోతే అది రియల్ రిలేషన్షిప్ కాదని వెల్లడించారు. తనకు శోభితకు మధ్య కూడా చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇక నాగచైతన్య నటించిన తండేల్(Thandel) సినిమా విడుదలైన తర్వాత శోభిత (Sobhita) తనతో కొద్దిరోజులు మాట్లాడటం లేదంటూ ఈ సందర్భంగా నాగచైతన్య తెలియజేశారు. శోభిత ఎందుకు మాట్లాడలేదు అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇలా శోభిత మాట్లాడలేదు అంటూ నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే ఈయన చివరిగా చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు.
?igsh=MXFpYXZtNWh5d3k1ZQ%3D%3D
ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక నాగచైతన్య వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకమే అని చెప్పాలి. ఈయన ముందు సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అనంతరం నాగచైతన్యకు శోభిత పరిచయం కావటం, శోభితను ప్రేమించి పెద్దల సమక్షంలో గత ఏడాది డిసెంబర్ నెలలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట తమ వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక పెళ్లి తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉంటారని భావించారు. కానీ ఈమె మాత్రం పలు సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్నారు.
Also Read: Little Hearts 2 : లిటిల్ హార్ట్స్ 2 ప్రకటించిన డైరెక్టర్.. హీరో హీరోయిన్లు మారిపోయారా?