E-Paper
Advertisement

Anvesh – Sivaji:శివాజీకి నా అన్వేషణ క్షమాపణలు… మాటలు వెనక్కి తీసుకుంటున్నా అంటూ వీడియో

Anvesh – Sivaji:శివాజీకి నా అన్వేషణ క్షమాపణలు… మాటలు వెనక్కి తీసుకుంటున్నా అంటూ వీడియో
Advertisement

Anvesh – Sivaji: టాలీవుడ్ నటుడు శివాజీ (Sivaji)మహిళల వస్త్రధారణ గురించి చేస్తున్న వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఇప్పటికి ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. శివాజీ చెప్పిన మాటలలో తప్పులేదు కానీ ఆయన చెప్పిన విధానం తప్పు అంటూ కొంతమంది ఆయనకు మద్దతుగా ఉండగా, మరికొంతమంది తీవ్రస్థాయిలో శివాజీని విమర్శిస్తూ పోస్టులు, వీడియోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖం యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ(Naa Anveshana) సైతం శివాజీకి కౌంటర్ ఇస్తూ ఒక వీడియోని చేశారు . అలాగే ఈ వీడియోలో భాగంగా హిందూ దేవతల గురించి కూడా ప్రస్తావనకు తీసుకురావడంతో నా అన్వేషణ కూడా వివాదంలో చిక్కుకున్నారు .

శివాజీకి క్షమాపణలు..

ఇలా నా అన్వేషణ శివాజీకి కౌంటర్ ఇస్తూనే మహిళల గురించి, హిందూ దేవతల గురించి అసభ్యకరంగా మాట్లాడటంతో మహిళా సంఘాలు, హిందూ సంఘాలు నా అన్వేషణ వ్యవహార శైలిని తప్పుపడుతూ ఈయనపై కేసులు నమోదు చేయటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా దాదాపు లక్ష మందికి పైగా ఫాలోవర్స్ అన్ ఫాలో చేశారు.. ప్రస్తుతం వివాదంలో నిలిచిన నా అన్వేషణ తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా మరొక వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా శివాజీకి క్షమాపణలు తెలియజేశారు. శివాజీ గారు నా అభిమాని అనే విషయం నాకు తెలియదు అంటూ మాట్లాడారు . ఈ నేపథ్యంలోనే శివాజీ గారికి తాను క్షమాపణలు చెబుతున్నానని తెలియజేశారు.

సీతాదేవి అపహరణ..

Advertisement

శివాజీ ఎలాగైతే మహిళల గురించి మాట్లాడుతూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు క్షమాపణలు చెప్పారో. నేను కూడా అదే విధంగా ఆయనకు నా మాటలు వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెబుతున్నానని తెలియజేశారు. అదేవిధంగా అన్వేషణ మాట్లాడుతూ సీతాదేవి చీర కట్టుకొని ఉన్నప్పటికీ రావణాసురుడు అపహరించారు చివరికి చచ్చిపోయాడు ద్వాపర యుగంలో కూడా ద్రౌపతి చీరను కీచకుడు లాగాడు కానీ చనిపోయారు అయితే 2024, 25 లో వేల మంది మహిళలపై రే** జరిగింది. వీళ్లంతా కూడా చీరలు కట్టుకున్న వాళ్లే కానీ ఎవరూ చనిపోలేదే అంటూ ప్రశ్నించారు.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA%3D%3D

Advertisement

ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏంటంటే అమ్మాయి చీర కట్టుకుందా, లేకపోతే ఎలాంటి డ్రస్సు వేసుకుందా అని కాదు, మారాల్సిందే అబ్బాయి మైండ్ సెట్ అని చెప్పాలి. గత ఆరు సంవత్సరాలుగా నేను మహిళల స్వేచ్ఛ గురించి అవకాశం దొరికిన ప్రతిసారి మాట్లాడుతున్నానంటూ మరోసారి ఈ వివాదం గురించి నా అన్వేషణ ఒక వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా శివాజీ వివాదం గురించి నా అన్వేషణ ఎప్పుడైతే స్పందించారో అన్వేషణ కూడా విమర్శలను ఎదుర్కొంటున్నారు. కేవలం గంటల వ్యవధిలోనే అన్వేషణ లక్ష ఫాలోవర్స్ ను కోల్పోయారు అంటేనే ఈయన పట్ల ఎలాంటి వ్యతిరేకత ఉందో స్పష్టమవుతుంది.

Related News

NBK 111:బాబాయ్ కోసం అబ్బాయ్ ఎమోషనల్ మెసేజ్.. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడంటే?

జాన్ అబ్రహం కొత్త ఇల్లు ఎంతో తెలుసా ..రేటు చూస్తే మతి పోవాల్సిందే !

అమితాబ్ కి సర్జరీ.. ఎంత పెద్ద తోపైనా ఓటమి తప్పదంటూ పోస్ట్!

‘టాక్సిక్’ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. రొమాంటిక్ మోడ్‌లోకి రాకింగ్ స్టార్!

“గెట్ వెల్ సూన్ బాబాయ్” – బాలయ్య ప్రమాదంపై కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్!

షూటింగ్ లో జారిపడ్డ బాలకృష్ణ.. హెల్త్ కండిషన్ పై డైరెక్టర్ గోపీచంద్ క్లారిటీ!

OGకి కొరియన్ కనకరాజుకి ఉన్న కనెక్షన్ ఏంటి?

NBK 111: కాకినాడ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణకు గాయాలు.. హెల్త్ కండిషన్ పై డాక్టర్ల క్లారిటీ!

Big Stories

Advertisement
×