E-Paper
Advertisement

Imran Khan: ఉగ్రవాదులతో నన్ను చంపడానికి కుట్ర: ఇమ్రాన్ ఖాన్

Imran Khan: ఉగ్రవాదులతో నన్ను చంపడానికి కుట్ర: ఇమ్రాన్ ఖాన్
Advertisement

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీకే ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులతో తనను హత్య చేయించడానికి మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. గతంలో కూడా తనను చంపడానికి ప్రయత్నించి విఫలమయ్యారని.. ఇప్పుడు ప్లాన్ సి అమలు చేస్తున్నారని తెలిపారు.

ఆసిఫ్ అలీ జర్దారీ వద్ద లెక్కలేనంత అవినీతి సొమ్ము ఉందని ఆరోపించారు. ఆ డబ్బుతో తనను హత్య చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ కుట్ర వెనుక ప్రభుత్వ ఏజెన్సీల పాత్ర కూడా ఉందని అన్నారు.

Advertisement

పోయిన ఏడాది నవంబర్‌లో ఇమ్రాన్‌ఖాన్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లోని అధికార షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వజీరాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న అతడిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇమ్రాన్‌ ఖాన్‌తో సహా మరో నలుగురికి గాయాలయ్యాయి. ఇమ్రాన్ కాలికి తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Tags

Related News

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

Big Stories

Advertisement
×