E-Paper
Advertisement

Street Foods: మగ్గిన మాంసంతో బర్గర్లు.. తేల్చిన పరిశోధనలు..

Street Foods: మగ్గిన మాంసంతో బర్గర్లు.. తేల్చిన పరిశోధనలు..
Advertisement

Street Foods:స్ట్రీట్ ఫుడ్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదని ఇప్పటికీ చాలామంది తమ వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. కానీ గత కొన్నాళ్లలో స్ట్రీట్ ఫుడ్‌కు పాపులారిటీ విపరీతంగా పెరిగింపోయింది. డోర్ డెలివరీ లాంటివి మొదలైన తర్వాత స్ట్రీట్ ఫుడ్ నెంబర్ 1 బిజినెస్‌గా మారింది. కానీ ఇప్పటికీ బయట చికెన్‌ను తింటున్నవారిలో చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి. తాజాగా పరిశోధకులు వాటికి సమాధానం కనుక్కునే ప్రయత్నం చేశారు.

బయట చికెన్ బర్గర్, కట్లెట్, నగ్గెట్‌లాంటివి తిన్నప్పుడు అందులో పూర్తిగా మీట్ శుభ్రంగా ఉంది అన్న సందేహాలు చాలామందిలో ఉంటాయి. తాజాగా నేషనల్ రీసర్చ్ ఆఫ్ మీట్ (ఎన్‌ఆర్సీఎమ్).. బయట దొరికే చికెన్‌లో ఎంతవరకు శుభ్రంగా ఉన్న మీట్ ఉంది, ఎంతవరకు మగ్గిపోయిన మీట్ ఉంది అని తెలియడానికి పరిశోధనలు చేపట్టారు. ఈ పరిశోధనల తర్వాత వీటి గురించి పరిశోధకులకు అవగాహన వచ్చేసింది.

Advertisement

మనం బయట తినే బర్గర్స్, నగ్గెట్స్, కీమాలాంటి వాటిలో దాదాపు 5 శాతం మగ్గిన మాంసం ఉంటుందని వారి పరిశోధనల్లో తేలింది. ఇతర దేశాల్లో మాంసాన్ని ఎంత మోతాదులో ఉపయోగించారో వివరాలు ఆహార పదార్థంపై ఉంటాయి. కానీ అలాంటివి ఇండియాలో లేవు. ఎన్‌ఆర్సీఎమ్ శాస్త్రవేత్తలు మాంసం ఎలా ఉందో తెలుసుకోవడానికి మైక్రోఆర్‌ఎన్ఏ అనే టెక్నాలజీని తయారు చేశారు.

మాంసంతో చేసిన ఆహార పదార్థాలు సాధారణంగా ఎలాంటి మాంసంతో చేశారు అనే వివరాలపై వాటిపై ఇవ్వాల్సి ఉంటుంది. అలా జరగకపోవడంతో శుభ్రంగా ఉన్న మాంసంలో మగ్గిన మాంసం కలపడం వల్ల తేడా తెలియదని కొన్ని రెస్టారెంట్లు ఆ పద్ధతిని పాటిస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. ఇప్పటివరకు వారు చేసిన పరిశోధనల్లో చాలావరకు కనీసం 5 శాతం మగ్గిన మాంసాన్ని ఆహార పదార్థాల్లో ఉపయోగించినట్టుగా తెలిపారు పరిశోధకులు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×