E-Paper
Advertisement

Allu Arjun Lokesh Kanagaraj: ఫాన్స్ గెట్ రెడీ.. AA 23 లోడింగ్.. ఇది కదా అసలు పండుగ!

Allu Arjun Lokesh Kanagaraj: ఫాన్స్ గెట్ రెడీ.. AA 23 లోడింగ్.. ఇది కదా అసలు పండుగ!
Advertisement

Allu Arjun Lokesh Kanagaraj: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ తదుపరి సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

బన్నీతో లోకేష్ పిక్స్..

ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ మరికొన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టారని తెలుస్తోంది. త్వరలోనే వీటికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది. ఇక గత కొద్దిరోజులుగా అల్లు అర్జున్ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అయిందని ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి.

జనవరి 23న ప్రకటన..

Advertisement

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల లోకేష్  హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన సంగతి తెలిసిందే .అయితే  ఈ సినిమా కోసమే ఈయన హైదరాబాద్ వచ్చారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా మరో ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా  గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని, ఈ సినిమాకు సంబంధించి జనవరి 23 తేదీ ప్రకటన రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తిగా బన్నీ..

Advertisement

సంక్రాంతి పండుగ అనంతరం ఈ సినిమాకు సంబంధించి ప్రకటన రాబోతుందని తెలిసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ లోకేష్ సినిమా గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాదిలో షూటింగ్ పనులు పూర్తి కాబోతున్నాయని తెలుస్తుంది. ఈ ఏడాది చివరిలోనే లోకేష్ తో అల్లు అర్జున్ సినిమా ఉండబోతుందంటూ కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ విభిన్న పాత్రలో కనిపించబోతున్నారని కుడి చేతిని కోల్పోయి సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తి పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Also Read: vicky Kaushal Katrina Kaif: కొడుకును పరిచయం చేసిన కత్రినా..పేరు ఎంత క్యూట్ గా ఉందో!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×