E-Paper
Advertisement

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషాలతో విసిగిపోయారా? ఈ 6 నివారణలతో మీ కష్టాలకు స్వస్తి !

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషాలతో విసిగిపోయారా? ఈ 6 నివారణలతో మీ కష్టాలకు స్వస్తి !
Advertisement

Vastu Tips: ప్రతి ఒక్కరూ తాము సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ప్రేమ, ఆనందం, శ్రేయస్సు , మానసిక శాంతి కేంద్రంగా ఇల్లు ఉండాలని అనుకుంటారు. కొన్నిసార్లు.. కష్టపడి పనిచేయడం, డబ్బులు ఉన్నప్పటికీ, గొడవలు, విభేదాలు కొనసాగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. దీనికి ప్రధాన కారణం ఇంట్లో శక్తి అసమతుల్యత కావచ్చు. కొన్ని సరళమైన ,ప్రభావవంతమైన వాస్తు నివారణలను క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించవచ్చు.

1. ప్రధాన ద్వారం శుభాలకు ద్వారంగా ఉండాలి:
వాస్తులో ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇక్కడే శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. బూట్లు, చెప్పులు, విరిగిన వస్తువులు లేదా చెత్తను తలుపు ముందు ఉంచకూడదు. ప్రతి రోజూ ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంచండి. తరచుగా మెయిన్ డోర్ పై గంగా జలాన్ని చల్లుకోండి. ఇది ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది. అంతే కాకుండా సానుకూల శక్తులు ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది.

Advertisement

2. ఉప్పుతో ప్రతికూలతను దూరం చేయండి:
రాతి ఉప్పు వాస్తులో చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. వారానికి ఒకసారి, మీ ఇంటిలోని అన్ని గదులను రాతి ఉప్పు కలిపిన నీటితో తుడుచుకోండి. ప్రత్యామ్నాయంగా, ఒక గిన్నెలో రాతి ఉప్పును నింపి రాత్రిపూట ఒక మూలలో ఉంచండి. ఉదయం, దానిని నీటిలో పోయాలి. ఈ పరిహారం మీ ఇంటి నుంచి ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది.

3. మీ పూజ గదిని శుభ్రంగా ఉంచుకోండి:
పూజ గది సానుకూల శక్తికి ప్రధాన వనరు. ప్రతి రోజూ దీపం వెలిగించి, ధూపం వేయండి. వారానికి ఒకసారి పూజగదిని మొత్తం శుభ్రం చేయండి. విరిగిన దీపాలు, విరిగిన విగ్రహాలు లేదా పాత పువ్వులను అక్కడ ఉంచకుండా ఉండండి. అలా చేయడం వల్ల ఇంట్లో శాంతి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.
.
4. మొక్కలతో ప్రేమ, శ్రేయస్సు:
వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా చెబుతారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంటికి ఆనందం ,శ్రేయస్సు వస్తుంది. ఇంకా.. ఉత్తరం లేదా తూర్పు దిశలో మనీ ప్లాంట్ లేదా వెదురు మొక్కను నాటడం వల్ల ఆర్థిక శ్రేయస్సు బలపడుతుంది. అంతే కాకండా సంబంధాలను పెంచుతుంది.

Advertisement

Also Read: ప్రేమ పెళ్లికి అడ్డంకులా ? అయితే ఈ 5 వాస్తు చిట్కాలతో మీ కల నిజం చేసుకోండి !

5. బెడ్ రూమ్‌లో సమతుల్యత:
వివాహ జీవితంలో ప్రేమను కాపాడుకోవడానికి బెడ్ రూమ్ యొక్క వాస్తు చాలా ముఖ్యం. మంచం ముందు అద్దం ఉండకూడదు. మంచం కింద చెత్త నిల్వ చేయకూడదు. బెడ్ రూమ్ లో లేత రంగులను ఉపయోగించండి. అంతే కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులను పరిమితం చేయండి. ఇది మానసిక ప్రశాంతతను కాపాడుతుంది. అంతే కాకుండా సంబంధాలలో సామరస్యాన్ని తెస్తుంది.

6. వారానికి ఒకసారి శంఖం మోగించండి:
ఇంట్లో పూజ సమయంలో కనీసం వారానికి ఒకసారి శంఖం లేదా గంట మోగించడం చాలా శుభప్రదంగా చెబుతారు. దీని శబ్దం ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది. అంతే కాకుండా పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×