BigTV English

Face Packs: ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేశారంటే మేకప్ లేకుండానే మెరిసిపోవచ్చు!

Face Packs: ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేశారంటే మేకప్ లేకుండానే మెరిసిపోవచ్చు!

Homemade Face Packs: ముఖంపై మొటిమలు, మచ్చలు లేకుండా అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అందుకోసం రకరకాల క్రీములు, ఫేస్ వాష్‌లు వాడుతుంటారు. అయితే ఇవేమీ కాకుండా ఇంట్లోని వంట గదిలో లభించే పదార్థాలతో ఫేస్ ప్యాక్ ట్రై తయారు చేసి వాడటం వల్ల అందంగా మెరిసిపోవచ్చు.


చాలా మంది బ్యూటీ పార్లర్‌కు వెళ్లి తమ అందానికి మెరుగులు దిద్దుకుంటారు. బ్యూటీ పార్లర్‌లకు వెళ్లి ముఖానికి మేకప్, ఫేషియల్స్ ఎన్నిసార్లు చేయించుకున్నా సరే ఆ అందం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అలా చేయడం వల్ల మొటిమలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఈ అన్నింటికీ చక్కటి పరిష్కారం ఇంట్లోనే ఫేస్ ప్యాక్‌లు తయారు చేసి వాడటం. ఇందుకోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పని కూడా ఉండదు. ఇంట్లోనే ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసి ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మెరిసే ముఖం కోసం కొన్ని ఫేస్‌ప్యాక్స్..
1.గుమ్మడి పండుతో ఫేస్‌ప్యాక్:
కావలసినవి:


  • బాగా పండిన గుమ్మడి పండు గుజ్జు – రెండు టేబుల్ స్పూన్లు
  • తేనె- అర చెంచా
  • పాలు- అర చెంచా

దాల్చిన చెక్క పొడి – పావు చెంచా
తయారీ విధానం:
బాగా పండిన గుమ్మడి గుజ్జును ఒక గిన్నెలో తీసుకోవాలి. ఆ తర్వాత అందులో తేనే, పాలు, దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మిక్స్ చేయాలి.
ఫేషియల్ చేయండిలా..
ముందుగా ముఖాన్ని చల్లని నీటితో కడుక్కుని కొద్దిసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత గుమ్మడిపండు మిశ్రమాన్ని ఫేస్‌ప్యాక్‌లాగా ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 – 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత మెత్తని క్లాత్‌తో తుడుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా 15 రోజుల పాటు చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా చర్మం కూడా మెరుస్తుందని అంటున్నారు. గుమ్మడి పండులో ఉండే విటమిన్ ఏ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది.
2. కోడిగుడ్డు ఫేస్‌ప్యాక్:
కావలసినవి:

  • కోడిగుడ్డు- ఒకటి
  • నిమ్మరసం- అర చెంచా
  • పెరుగు- ఒక చెంచా

తయారీ విధానం: గుడ్డులోని తెల్లసొనను వేరు చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో నిమ్మరసం, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.
ఫేషియల్ చేయండిలా..
ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆరనివ్వాలి. ఆ తర్వాత కోడిగుడ్డు మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లై చేయాలి. దాదాపు 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక వారం రోజుల పాటు ఈ ఫేస్‌ప్యాక్ వాడటం వల్ల చర్మంపై ఉండే జుట్టు తొలగిపోయి కోమలంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు.
3. ఈస్ట్ పౌడర్ ఫేస్‌ప్యాక్:
కావాల్సినవి:

  • కోడిగుడ్డు- ఒకటి
  • ఈస్ట్ పౌడర్- రెండు చెంచాలు
  • కలబంద గుజ్జు- ఒక చెంచా
    తయారీ విధానం: ముందుగా ఎగ్ లోని తెల్లసొనను ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. దానిలో ఈస్ట్ పౌడర్, కలబంద గుజ్జుని వేసి బాగా మిక్స్ చేయాలి.
    ఫేషియల్ చేయండిలా..
    శుభ్రంగా ఫేస్‌వాష్ చేసుకుని శుభ్రంగా ముఖాన్ని ఆరనివ్వాలి. తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 30 నిమిషాలు ఆరబెట్టాలి. అనంతరం గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా తరుచుగా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

Related News

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×