Su from So OTT: వేరే భాషల్లో వచ్చిన సినిమాలు తెలుగులో సక్సెస్ అవుతున్నాయి. ఇప్పటికే వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమా ‘సు ఫ్రమ్ సో’ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నిన్న తెలుగులో రిలీజ్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు. మొదటి షో తోనే కామెడీ మూవీ గా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అంతే కాదు రోజురోజుకీ కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది.. ఈమధ్య ఇలాంటి హారర్ కామెడీ చిత్రం రాకపోవడంతో తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమాని చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు.. తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
‘సు ఫ్రమ్ సో’ ఓటీటీ ..
ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. నాలుగున్నర కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ఇప్పటివరకు 40 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది.. థియేటర్లలో సక్సెస్ఫుల్ టాక్ తో రన్ అవుతున్న సమయంలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు డీల్ కుదుర్చుకుంది. సెప్టెంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది.. అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటికే ఇలాంటి సూపర్ హిట్ చిత్రాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలను అందిస్తుంది..
Also Read: ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..
‘సు ఫ్రమ్ సో’ కలెక్షన్స్…
కన్నడ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న షనీల్ గౌతమ్, సంద్య అరకెరె ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్.బి.శెట్టి , శశిధర్ శెట్టి బరోడా, రవిరాయ్ కలస నిర్మించారు. ఆసక్తికరమైన కథ, కథనంతో నిండిన ఈ చిత్రం ప్రేక్షకులకు నవ్వుల పండగను అందించిందని నిన్న వచ్చిన రివ్యులను చూస్తే ఎవ్వరికైన అర్థమవుతుంది.. అదే విధంగా తెలుగులో కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. జూలై 25 న కన్నడలో థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీని కేవలం 5 కోట్ల వ్యయంతో నిర్మించారు. 80 కోట్లకు పై వసూల్ చేసింది.. తెలుగు లో కూడా పాజిటివ్ గా మౌత్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా వచ్చినట్లు తెలుస్తుంది. దర్శకుడు రాజ్ బి శెట్టి ఈ సినిమాలో స్వామిజి పాత్ర పోషించడం జరిగింది. ఆయన కథ కాబట్టి.. పాత్రని ఓన్ చేసుకుని హానెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. జెపి తుమినాడ్ బాగా చేశాడు. షనీల్ గౌతమ్,. సంధ్య అరకెరె కూడా బాగా చేశారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పాలి.. ఇక ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..