BigTV English

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Babar Azam : పాకిస్తాన్ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శిస్తున్నారు.  ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తూ వన్డే సిరీస్ ఆడుతోంది. దీనిలో భాగంగా ట్రినిడాడ్‌లోని బ్రయాన్ లారా స్టేడియంలో రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు కాస్త తడబడింది. పాకిస్థాన్ జట్టులోని కీలక ఆటగాడు బాబర్ ఆజం 9వ ఓవర్లో యువ పేసర్ జేడెన్ సీల్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 3 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ షాక్ నుంచి కోలుకోని పాకిస్థాన్ జట్టు వర్షం కారణంగా ప్రభావితమైన ఈ మ్యాచ్‌లో చివరికి ఓటమిపాలైంది. దీంతో వెస్టిండీస్ జట్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది.


Also Read : Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

బాబర్ ఆజమ్ డకౌట్.. 


దీంతో బాబర్ పై క్రికెట్ అభిమానులు కాస్త ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. 712 రోజుల నుంచి ఒక్క సెంచరీ కూడా చేయలేదు. దీంతో డకౌట్ కావడం.. కేవలం రెండు అంకెల స్కోర్, కొన్ని మ్యాచ్ ల్లో సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో అతని పై ట్రోలింగ్స్ చేస్తున్నారు. స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం ఈ పేలవమైన ఆటతీరు అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. సోషల్ మీడియాలో అతడినీ “ఓవర్ రేటెడ్” అని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా బాబర్ ఆజం జింబాబ్వే, నేపాల్ వంటి చిన్న జట్లపై మాత్రమే పరుగులు చేస్తాడని.. బలమైన జట్లపై విఫలం చెందుతాడని విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. ” నో నేపాల్, నో పార్టీ ఫర్ స్టాట్ ప్యాడర్” అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేసి అభిమానులు అతడిని ఎగతాళి చేస్తున్నారు. బాబర్ ఆజం చివరిసారిగా 2023లో ఆసియా కప్ లో నేపాల్ జట్టుపైనే సెంచరీ చేశాడని.. ఆ తరువాత ఒక్కసారి కూడా సెంచరీ చేయలేదని అభిమానులు గణాంకాలతో సహా విమర్శిస్తున్నారు.

బాబర్ పై ట్రోలింగ్స్.. 

మరోవైపు కొందరూ అభిమానులు బాబర్ ఆజామ్ కేవలం 100 పరుగులతోనే సెంచరీ మిస్ చేసుకున్నాడని వ్యంగ్యంగా పోస్ట్ చేస్తున్నారు. వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో 47 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ.. రెండో మ్యాచ్ లో డకౌట్ అవ్వడం.. జట్టు ఓటమికి ఒక కారణం అనే చెప్పవచ్చు. దీంతో బాబర్ ఆజమ్ పై మరింత ఒత్తిడి పెరిగింది. ట్రినిడాడ్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. హుస్సె్ తలాత్ 31, నవాజ్ 36 నాటౌట్, సైమ్ అయూబ్ 23, అబ్దుల్లా షఫీ్ 26, మొహమ్మద్ రిజ్వాన్ 16, సల్మాన్ అఘా 09, మొహమ్మద్ నవాజ్, షాహీన్ అప్రిది 11 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ మాత్రం డకౌట్ అయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 33.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో 1-1తో సిరీస్ సమం అయింది. తొలి వన్డేలో పాక్, రెండో వన్డేలో వెస్టిండీస్ విజయం సాధించాయి. మూడో వన్డే ఆగస్టు 12న జరుగనుంది. ఈ మ్యాచ్ లో ఎవ్వరూ విజయం సాధిస్తే.. వారికే సిరీస్ కైవసం అవుతుంది.

Related News

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Big Stories

×