BigTV English

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Anantapur News: ఏపీలో ఊహించని ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సు ఆపలేదని డ్రైవర్‌పై చేయి చేసుకుంది ఓ మహిళ. ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారి తీసింది.  ఈ ఘటనపై ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లో వెళ్తే..


సోమవారం అనంతపురం నుంచి కల్యాణదుర్గం వైపు పల్లె వెలుగు బస్సు వెళ్తోంది. నడిమివంక ప్రాంతానికి సమీపంలోకి రాగానే డ్రైవర్ నటేష్‌బాబు ఆపకుండా వెళ్లిపోయాడు. ఆ బస్సు కోసం ఓ ప్రైవేటు ఉద్యోగి వెయిట్ చేస్తోంది. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ.. బైక్ సాయంతో చివరకు బస్సును ఓవర్ టేక్ చేసింది.

బస్సుని ఆ స్టాపు దగ్గర ఎందుకు ఆపలేదని డ్రైవర్‌ని నిలదీసింది. ఆ తర్వాత డ్రైవర్‌పై శివాలెత్తింది ఆమె. దీంతో ఇరువురు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు రెచ్చిపోయిన ఆ మహిళ డ్రైవర్ చెంప చెళ్లుమనిపించింది. ఈ సన్నివేశంతో బస్సులో ప్రయాణికులంతా ఒక్కసారిగా షాకయ్యారు.


తనపై దాడి చేసిన మహిళ బస్సు దిగే వరకు వెళ్లేది లేదని డ్రైవర్ మొండి కేశాడు. చివరకు బస్సులోని కన్వీన్స్ చేయడంతో ఆ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు డ్రైవర్. ఈ ఘటన విషయం తెలియగానే ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీలో ఉన్న ఉద్యోగిని కొట్టడం ఏంటని అంటున్నారు.

ALSO READ: రోజా అసలు ఆట మొదలు, అరెస్టుకు రంగం సిద్ధం

ఉచిత బస్సు పథకం రాకముందే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఆ పథకం అమల్లోకి వస్తే ఇంకెన్ని ఘటనలు జరుగుతాయోనని అంటున్నారు. ఉచిత బస్సు పథకం ఆగష్టు 15 నుంచి ఏపీ వ్యాప్తంగా మొదలుకానుంది.

ఈ స్కీమ్ విషయంలో పొరుగు రాష్ట్రాల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకున్న ఆర్టీసీ ఛైర్మన్, ఎండీలు కలిసి వివిధ జిల్లాల్లో పర్యటించారు. అక్కడి ఉద్యోగులకు చెప్పాల్సిన విషయాలు చెప్పారు. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో ఉద్యోగులు షాకయ్యారు.

 

 

Tags

Related News

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Big Stories

×