BigTV English

NTR Look : బక్కచిక్కిపోయిన తారక్… ఈ ప్రయోగాల ఫలితమేనా ఇది ?

NTR Look : బక్కచిక్కిపోయిన తారక్… ఈ ప్రయోగాల ఫలితమేనా ఇది ?

NTR Look : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఎన్టీఆర్ (NTR) ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈయన అంటే పడి చచ్చే అభిమానులు ఎంతోమంది. ముఖ్యంగా ఎన్టీఆర్ మేనరిజం, డైలాగ్ డెలివరీ, డాన్స్ పెర్ఫార్మెన్స్, ఆయన లుక్స్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వీటికి తోడు ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే..అయితే ఇప్పుడు సడన్ గా ఎన్టీఆర్ బక్క చిక్కిపోయి కనిపించడంతో అభిమానులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.


బక్కచిక్కిపోయిన ఎన్టీఆర్..

అసలు విషయంలోకి వెళ్తే.. ఎన్టీఆర్ బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తూ.. చేస్తున్న తొలి చిత్రం వార్ 2. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 14వ తేదీన సినిమా విడుదల కానుండగా నిన్న హైదరాబాద్ లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ లుక్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి.. సన్నగా మారిపోయారు. ఇలా మారిపోవడం వెనుక ఆయన తక్కువ సమయంలోనే సిక్స్ ప్యాక్ బాడీ పొందడానికి జిమ్ లో తెగ కష్టపడినట్లు తెలుస్తోంది.


అసలు కారణం ఇదేనా?

వాస్తవానికి లాంగ్ టర్మ్ సిక్స్ ప్యాక్ బాడీ కోసం ప్రయత్నం చేస్తే శరీరంలో మాత్రమే మార్పులు వస్తాయి. ముఖంలో ఎటువంటి మార్పులు రావు.. కానీ షార్ట్ టర్మ్ సిక్స్ ప్యాక్ బాడీ కోసం ప్రయత్నం చేస్తే ముఖంలో కూడా మార్పులు వస్తాయి. అటు శరీరం కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని పలువురు నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ యాక్షన్ పర్ఫామెన్స్ తో కూడిన చిత్రాలనే చేస్తున్నారు. ఆ సన్నివేశాలలో బలంగా కనిపించాలి అంటే సిక్స్ ప్యాక్ ఉండాల్సిందే.. అందుకే షార్ట్ టర్మ్ లోనే ఆయన సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నం చేసి.. ఇప్పుడు ముఖంలో మార్పులు తెచ్చుకున్నారేమో అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఆ హీరోల జాబితాలోకి చేరిన ఎన్టీఆర్..

ఇకపోతే ఇలా షార్ట్ టర్మ్ లోనే సిక్స్ ప్యాక్ తెచ్చుకున్న హీరోలలో ఎన్టీఆర్ మొదటి వారేం కాదు. గతంలో ప్రముఖ కమెడియన్ సునీల్ (Sunil ) కూడా ‘పూలరంగడు’ సినిమా కోసం ఇలాగే తక్కువ సమయంలో సిక్స్ ప్యాక్ బాడీ కోసం ప్రయత్నం చేసి ముఖంలో మార్పులు తెచ్చుకున్నారు. ఈయనకి తోడు గోపీచంద్ (Gopichandh) కూడా ఇలాగే.. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ జాబితాలోకి చేరిపోయారు . అటు ‘కంత్రి’ సినిమా సమయంలో కూడా ఇలా సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నం చేసి ముఖంలో మార్పులు తెచ్చుకున్నారు ఎన్టీఆర్. ఏది ఏమైనా ఇలా తక్కువ సమయంలో సిక్స్ ప్యాక్ బాడీ కోసం ప్రయత్నం చేసి బక్క చిక్కిపోయారు ఎన్టీఆర్ అని అభిమానులు నిట్టూరుస్తున్నారు.

షార్ట్ టర్మ్ సిక్స్ ప్యాక్ వల్ల జరిగే అనర్ధాలు..

ఇదిలా ఉండగా ఈ షార్ట్ టర్మ్ సిక్స్ ప్యాక్ బాడీ కోసం ప్రయత్నం చేస్తే కలిగే ప్రమాదాలు ఏంటి? అనే విషయానికి వస్తే..

కండరాల అసమతుల్యత..

ఇతర కండరాల ఫిట్నెస్ పై దృష్టి పెట్టకుండా.. కేవలం సిక్స్ ప్యాక్ బాడీ కోసం మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కండరాల పనితీరులో అసమతుల్యత ఏర్పడుతుందని, తీవ్రమైన నొప్పిని కలిగించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.

భరించలేని నొప్పులు..

స్వల్పకాలిక వ్యాయామాల కారణంగా భరించలేని నొప్పులు కూడా ఏర్పడతాయని సమాచారం. ముఖ్యంగా ఇది నిరుత్సాహానికి దారితీస్తుందట.

కేవలం సిక్స్ ప్యాక్ పైనే ఫోకస్ పెట్టడం వల్ల శరీరాన్ని నిర్లక్ష్యం చేసినట్లు అవుతుందని, ఇతర అవయవాలపై ఆ ప్రభావం చూపుతుందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు దీనివల్ల మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం వుంటాయి అని, కాబట్టి రూపంపై దృష్టి పెట్టడం కంటే శ్రేయస్సు కోసం ఆరోగ్యం, ఫిట్నెస్ కి ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమని వైద్యులు సలహా ఇస్తూ ఉండడం గమనార్హం

ALSO READ:Mass Jathara Teaser: మాస్ జాతర టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

Related News

The Paradise film: కీలక సీక్వెన్స్ పూర్తి చేసుకున్న ది ప్యారడైజ్.. వాడి జడలు ముట్టుకుంటే అంటూ!

Sundarakanda trailer: పెళ్లి కోసం రోహిత్ కష్టాలు మామూలుగా లేవుగా.. ఆకట్టుకుంటున్న సుందరకాండ ట్రైలర్!

Gayatri Gupta: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నాకు 5 లక్షలు ఇచ్చాడు.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన నటి

The Rajasaab : రీ షూట్లతో మారుతి కన్ఫ్యూజన్… బొమ్మ తేడా కొడుతుందా ఏంటి ?

Gayatri Gupta: ఆ ప్రొడ్యూసర్ నన్ను రే*ప్ చేశాడు… నటి సంచలన వ్యాఖ్యలు

WAR 2 Controversy : బజ్ ఒకే… కానీ, బద్నాం కూడా అయ్యారు

Big Stories

×