BigTV English

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Hyderabad: హైదరాబాద్ వేదికగా జన్యుపరమైన వెన్నెముక కండరాల క్షీణత వ్యాధి పట్ల అవగాహన కల్పించడానికి చేపట్టిన కార్యక్రమమే రన్ ఫర్ ఎస్ఎంఏ (స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ). దీనిపై ప్రజలలో అవగాహన కల్పించడానికి క్యూర్ ఎస్ఎంఏ ఇండియా గచ్చిబౌలిలో ఆదివారం రోజు ఉదయం రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 మూడవ ఎడిషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా జన్యుపరమైన వెన్నెముక కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు.. ఇలా ఈ వ్యాధి ప్రభావిత కుటుంబాలకు మద్దతుగా నిలుస్తూ ఎస్ఎంఏ అవగాహన మాసంలో భాగంగా 21కే, 10కే, 5కే టైమ్డ్ అలాగే 5కే నాన్ టైమ్డ్ విభాగాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది.


ఈ రన్ ను స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, సెక్రటరీ, నేషనల్ టర్మరిక్ బోర్డు, భవాని శ్రీ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీరితోపాటు పీడియాట్రీషియన్, జెనెటిసిస్ట్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాధా రమాదేవి, నిర్మాణ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు & గ్లోబల్ సీఈవో మయూర్ పట్నాల, డైరెక్టర్ తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ అర్చన సురేష్ కూడా పాల్గొన్నారు. ఇక స్టేడియం నుండి ప్రారంభమైన ఈ రన్ ఐఐఐటి సర్కిల్ , ఐ ఎస్ బి మీదుగా విప్రో సర్కిల్, పుల్లెల గోపీచంద్ అకాడమీ సమీపం నుండి తిరిగి స్టేడియం కి చేరుకున్నారు. విద్యార్థులు, వైద్య నిపుణులు, కార్పొరేట్ ఉద్యోగులు, ఎస్ఎంఏ బాధిత కుటుంబాలు, సాధారణ ప్రజలు కూడా ఈ రన్ లో పాలు పంచుకోవడం జరిగింది.

ఇకపోతే క్యూర్ ఎస్ఎంఏ ఇండియా సహ వ్యవస్థాపకురాలు ట్రస్టీ శ్రీ లక్ష్మీనలం మాట్లాడుతూ.. “ఈ వ్యాధి చిన్నారుల కండర శక్తిని, కదలిక సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. భారత్ లో అత్యంత అరుదైన వ్యాధుల బాధిత కుటుంబాల కోసం స్థిరమైన మద్దతు వ్యవస్థను ఏర్పరిచేందుకు వైద్య నిపుణులు, కార్పొరేట్లు, ప్రభుత్వ రంగాలు, పరిశోధనా సంస్థల మధ్య సమన్వయం అవసరం అని” ఆమె తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి సత్తి, మైక్రోసాఫ్ట్ సత్యా వేమూరి, నైపర్ డీన్ డాక్టర్ శ్రీనివాస్ నండూరి, విజయ్ వావిలాల, డైరెక్టర్, ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ దినేష్ చర్ల తదితరులు పాల్గొన్నారు.


ALSO READ:NTR Look : బక్కచిక్కిపోయిన తారక్… ఈ ప్రయోగాల ఫలితమేనా ఇది ?

Related News

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Heart Health: హార్ట్ ఎటాక్స్ రాకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ?

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Big Stories

×