Natural Face Packs: ప్రతి ఒక్కరూ తమ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. కానీ కాలుష్యం, సూర్యరశ్మి, చర్మంపై రసాయనాలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్స్ వాడటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. వీటి వల్ల ముఖం యొక్క సహజ కాంతి తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. ఖరీదైన బ్యూటీ ట్రీట్‌మెంట్లకు బదులుగా సహజ ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించడం సురక్షితమైన, ప్రభావవంతమైన మార్గం. ఇవి చర్మాన్ని లోపలి నుంచి పోషించడమే కాకుండా.. చాలా కాలం పాటు ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి.
కొన్ని సహజ ఫేస్ ప్యాక్‌లను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిలో ఎటువంటి హానికరమైన రసాయనాలు ఉండవు. అవి చర్మాన్ని శుభ్రపరచడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా మృతకణాలను తొలగించడంలో, తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి.
సహజ ఫేస్ ప్యాక్‌ల తయారీ:
పసుపు, పెరుగు ఫేస్ ప్యాక్:
పసుపులో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. పెరుగు చర్మాన్ని తేమ చేస్తుంది. అంతే కాకుండా మెరుపును ఇస్తుంది. పసుపు, పెరుగుతో సహజ ఫేస్ ప్యాక్ తయారు చేయడం కోసం, ఒక టీస్పూన్ పసుపు , రెండు టీస్పూన్ల పెరుగు కలిపి మిశ్రమంగా లాగా చేసి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు తొలగిపోతాయి. అంతే కాకుండా ముఖం కాంతివంతగా కనిపిస్తుంది. తరచుగా ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
శనగపిండి, తేనె ఫేస్ ప్యాక్:
శనగపిండి, తేనె కలిపిన ఫేస్ ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శనగపిండి చర్మం నుంచి మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా తేనె చర్మాన్ని తేమగా చేస్తుంది. రెండు చెంచాల శనగపిండిలో ఒక చెంచా తేనె, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా తయారు చేసి ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత కడిగేయండి.
కలబంద, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్:
కలబంద చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా ముఖాన్ని హైడ్రేట్ చేస్తుంది. రోజ్ వాటర్ చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. కలబంద జెల్ లో రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత నీటితో కడిగేయండి. దీనివల్ల ముఖం యొక్క సహజ కాంతి పెరుగుతుంది.
Also Read: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?
బొప్పాయి, పాలతో ఫేస్ ప్యాక్:
బొప్పాయిలో ఉండే ఎంజైమ్‌లు చర్మాన్ని మృదువుగా, శుభ్రంగా చేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ కోసం.. పండిన బొప్పాయిని గుజ్జు లాగా చేసి, దానికి కొంచెం పాలు కలిపి ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు చేయడం వల్ల అద్భుతమైనప్రయోజనాలు ఉంటాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
దోసకాయ, నిమ్మకాయ ఫేస్ ప్యాక్:
దోసకాయ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది. నిమ్మకాయ మచ్చలను కాంతివంతం చేస్తుంది. దోసకాయ రసం, నిమ్మరసం సమాన పరిమాణంలో కలిపి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్‌లను వారానికి 2-3 సార్లు ఉపయోగించండి. ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోండి. నిరంతరం ఉపయోగించడం వల్ల, మీ చర్మం సహజంగా ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది.