Coolie Ticket Price is Rs 4500: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీ విడుదలకు సిద్ధమౌతోంది. మరో మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కూలీ థియేటర్లలో సందడి చేయనుంది. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ముందు నుంచి విపరీతమైన బజ్ ఉంది. విక్రమ్, లియో వంటి బ్లాక్బస్టర్ సినిమాల తర్వాత లోకేష్ దర్శకత్వం నుంచి వస్తున్న చిత్రమిది. మరోవైపు రజనీకాంత్, అనిరుధ్ల కాంబో. ఇటూ అగ్ర తారగణం.. కూలీపై ఓ రేంజ్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇక ప్రచార పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీ అంచనాలను డబుల్ చేశాయి.
అక్కడ కూలీ మాస్ జాతర
దీంతో దక్షిణాదిలో కూలీ హైప్ మామూలుగా లేదు. తమిళనాట అయితే అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎక్కడ చూసి రజనీ ప్లేక్సీ, భారీ కటౌట్స్తో కూలీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్ అవ్వగా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే హౌజ్ ఫుల్ బోర్టులు కూడా పెట్టేస్తున్నారు. టికెట్ ధరతో సంబంధం లేకుండ అభిమానులు ఎగబడి టికెట్లు కొనేస్తున్నారట. వెయ్యి కాదు, రెండు వేలు కాదు. ఏకంగా రూ. 4500. టికెట్ రేట్ అంత ఉన్నప్పటి అభిమానులు టికెట్స్ కొనేందుకు ఎగబడుతున్నారట. అయితే ఇవి ప్రీమియర్స్ షో అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే.
టికెట్ రేట్ ఎందుకంత ఎక్కువంటే
ఇది రిలీజ్ డే రోజు షోకి. తమిళనాడులోని రోహిణి థియేటర్లలో టికెట్ ధరలను రూ. 4500గా నిర్ణయించారు. ఎందుకుంత అంటే ఆ రోజు థియేటర్లో ఓ స్పషాలిటీ ఉంది. అదేంటంటే.. రిలీజ్ డే రోజున ఆ థియేటర్ ముందు హెలికాప్టర్తో పూల వర్షం కురిపించన్నారట. అందుకే మొదటి రోజు టికెట్ ధర రూ. 4500కి నిర్ణయించారట. అయితే తమిళనాడులో రిలీజ్ డే టికెట్ రేట్ ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి అట అందుకే ఈ విషయం తెలిసి తొలి రోజు రోహిణి థియేటర్లలో సినిమా చూసేందుకు అభిమానులు, ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ థియేటర్ ముందు బారులుతిరారు. గెటు ఒపెన్ చేయగానే.. ఒక్కసారిగా అభిమానులు గేటు లోపలికి పరుగెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు రజనీ ప్లెక్సీ, ఫోటోలతో థియేటర్ ముందు డ్యాన్స్ చేస్తు సందడి చేస్తున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా కూలీ మూవీ ఆగష్టు 14న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ పాటు శ్రుతీ హాసన్ లు కీలక పాత్రలు పోషించారు. ఇందులో నాగ్ నెగిటివ్ షేడ్ లో కనిపించనున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో కూలీ మూవీ రూపొందింది. ఇందులో రజనీ దేవగా, నాగార్జున్ సిమోన్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం కూలీ కి ఉన్న బజ్ చూస్తుంటే ఈ చిత్రం బాక్సాఫీసు వెయ్యి కోట్ల కలెక్ట్ చేసి కోలీవుడ్ కలను తీర్చాలా కనిపిస్తోందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
#COOLIE FDFS Ticket Price in Rohini Theater – ₹4500 😳
Reason – Helicopter 🚁 Flowers Flow Celebration 🥳🎉 1st Time in Kollywood@rajinikanth
— EnishMSD (@enish__7) August 10, 2025