E-Paper
Advertisement

Home Remedies for Hair Fall: విపరీతంగా జుట్టు ఊడిపోతుందా..? అయితే ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి

Home Remedies for Hair Fall: విపరీతంగా జుట్టు ఊడిపోతుందా..? అయితే ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి
Advertisement

Home Remedies to Stop Hair Loss: విపరీతంగా మీ జుట్టు ఊడిపోతుందా ? ఏవేవో షాంపూలు, నూనెలు వాడి విసిగిపోయారా ? ఇంట్లో దొరికే సహజ పదార్థాలను వాడటం వల్ల కూడా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. బలమైన, పొడవైన జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు. కానీ దాన్ని కాపాడుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతుంటారు. ఈ మధ్య, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కుంటున్న సమస్యల్లో ప్రధానమైంది జుట్టు రాలడం. మనం తినే ఆహారం,పెరుగుతున్న కాలుష్యం, జీవనశైలి కారణాలతో జుట్టు విపరీతంగా ఊడిపోతుంది.

కొత్తగా వెంట్రుకలు రాకున్నా పర్లేదు కానీ ఉన్న జుట్టు ఊడిపోకుండా బలంగా ఉంటే చాలు దేవుడా అనుకుంటున్నారు. వెంట్రుకలు ఊడకుండా ఉండాలంటే హానికరమైన షాంపులను, నూనెలకు దూరంగా ఉండడం ఒక మార్గం అయితే ఇంట్లోనే సహజంగా దొరికే పదార్థాలను ఉపయోగించి జుట్టు రాలకుండా కాపాడుకోవడం మరో మార్గం. కొన్ని పదార్థాలతో సులభంగా వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సమతుల్య ఆహారం:
జుట్టు పెరగడం కోసం అంతేకాకుండా ఊడిపోకుండా కాపాడుకోవడం కోసం ముందుగా మనం చేయాల్సిన పని సమతుల్య ఆహారం తీసుకోవడం. అంటే మనం తినే ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కెరాటిన్ విటమిన్ బి, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు కురులను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అంతే కాకుండా వెంట్రుకల కణజాలం పెరుగుదలతో కూడా ఉపయోగపడతాయి. జుట్టు దృఢంగా ఉండడానికి ఐరన్, జింక్ ఉన్న ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటివల్ల పొడవైన, బలమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

Also Read: Cigarette: రోజుకో సిగరెట్.. మీ ప్రాణానికి ముప్పు అని తెలుసా ?

Advertisement

హెడ్ మసాజ్:
కనీసం నాలుగు నిమిషాలపాటు ప్రతిరోజు తల మసాజ్ చేసుకోవడం వల్ల వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. హెడ్ మసాజ్ అనేది హెయిర్ ఫోలికల్స్‌ను, రక్త ప్రసరణను పెంచుతుంది. అంతేకాకుండా వెంట్రుకలు మందంగా, బలంగా మారేందుకు ఇది సహాయపడుతుంది. మెరుగైన రక్తప్రసరణ, వెంట్రుకల పెరుగుదలకు, కుదుళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కనీసం రోజుకు నాలుగు నిమిషాల పాటు తలను గోరువెచ్చని నీటితో మసాజ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది.

కలబంద:
అనారోగ్య సమస్యలను నయం చేయగల దివ్య ఔషధం కలబంద. ఇది మన ఇంట్లోనే అందుబాటులో ఉంటుంది. అనేక రకాల గాయాలు, ఇన్‌ఫెక్షన్లు, చర్మ సమస్యలకు కూడా చక్కటి మందులా కలబంద పనిచేస్తుంది. మీ జుట్టు రాలకుండా కలబంద మంచి పోషణను ఇస్తుంది. కలడంద సహజ మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల పొడిబారిన వెంట్రుకల కారణంగా వచ్చే చెమట, దురద కారణంగా వచ్చే చికాకుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఇందులో ఉండే తేమ తలకు సహజమైన కండీషనర్ లాగా పనిచేస్తుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

Also Read: ఈ ఆహారాలు తింటున్నారా..? అయితే కిడ్నీ స్టోన్స్ గ్యారంటీ..!

గుడ్లు:
హెయిర్ కోసం ఎగ్స్ ఉపయోగించడం చాలా మంచిది. ఎగ్స్ ప్రోటీన్లతో నిండి ఉంటాయి. ఇందులో ఉండే బయోటిన్ ఫోలేట్ విటమిన్ ఏ, విటమిన్ డి తోపాటు ఇతర పోషకాలు వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంచేందుకు సహాయపడతాయి. ఈ పోషకాలన్నీహెయిర్ ఫోలికల్స్‌ను పెంచడంలో ఉపయోగపడతాయి. కానీ ఎలర్జీ లాంటి సమస్యలు ఉన్నవారు హెయిర్‌కు గుడ్లను వాడకపోవటం మంచిది.

గ్రీన్ టీ:
కడుపులోని చెత్తను గ్రీన్ టీ ఎలా తొలగిస్తుందో అలాగే వెంట్రుకల కుదుళ్ల సమస్యలను కూడా నయం చేస్తుంది. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు మీ జుట్టు కుదుళ్లను ఉత్తేజం చేసి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది. కాబట్టి వారంలో ఒక్కసారైనా తలకు గ్రీన్ టీ పట్టించి తలస్నానం చేయండి.

Tags

Related News

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

Big Stories

Advertisement
×