BigTV English
Advertisement

Lakshmi Narayan Yog 2024: జూలైలో లక్ష్మీ నారాయణ యోగం.. రెట్టింపు అవ్వనున్న ఈ రాశుల వారి సంపద!

Lakshmi Narayan Yog 2024: జూలైలో లక్ష్మీ నారాయణ యోగం.. రెట్టింపు అవ్వనున్న ఈ రాశుల వారి సంపద!

Lakshmi Narayan Yog 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై నెల కలిసిరానుంది. అన్ని రాశుల వారికి అదృష్టాలు వరించబోతున్నాయి. జూలై నెలలో వివిధ శుభ యోగాలు ఏర్పడనున్నాయి. దీని కారణంగా సంపద, కీర్తి, పేరు, ప్రతిష్టలు పెరగబోతున్నాయి. అందులో ముఖ్యంగా శుభ యోగాలలో ఒకటి లక్ష్మీ నారాయణ యోగం. జూలైలో ఈ శుభ యోగం కలుగుతుంది. దీని వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభించనుంది. అయితే ఈ అనుగ్రహంతో పలు రాశుల వారు అభివృద్ధి చెందనున్నారు. అయితే దీని ప్రభావం ఏ 3 రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.


మేష రాశి:

మేష రాశికి చెందిన వ్యక్తులకు జూలైలో అదృష్టం వరించనుంది. ఏ పని తలపెట్టినా కూడా విజయాలు పొందుతారు. కెరీర్‌లో విజయం ఉంటుంది. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. వ్యాపారం మెరుగుపడుతుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా మంచి వార్తలు వింటారు.


కర్కాటకం:

కర్కాటక రాశి వారు జూలై నెలలో అదృష్టవంతులు కాబోతున్నారు. ఈ రాశి వారికి చెందిన సంపద పెరగబోతుంది. కొత్త జాబ్ ఆఫర్ పొందవచ్చు. ఒంటరి వారికి వివాహ సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పనిలో విజయం ఉంటుంది. వైవాహిక జీవితం మధురంగా ​​ఉంటుంది.

Also Read: July 1st Week Lucky Rashi: జూలై మొదటి వారం నుండే ఈ రాశుల వారి జీవితాల్లో అదృష్ట మార్పు

సింహ రాశి:

సింహ రాశి వారి భవితవ్యం మారుతుంది. కెరీర్‌లో ప్రమోషన్ పొందుతారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని శుభవార్తలను పొందవచ్చు.

మరోవైపు, జ్యోతిష్యం ప్రకారం, జూలై 7న శుక్రుడు తన రాశిని మార్చబోతున్నాడు. అనంతరం చంద్రుని రాశిలో సంచరించబోతున్నాడు. అంటే శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. మేషం, కర్కాటకం, కన్య దాని ప్రభావంతో వారి తలరాతలు మారిపోబోతున్నాయి. జూన్ 28న మిథునరాశిలో శుక్రుడు కూడా ఉదయిస్తాడు. వృషభం, మిధునం, సింహ రాశులకు మిథునరాశిలో రెండు గ్రహాల పెరుగుదలలో లాభాలను చూస్తారు.

Also Read: Luckiest Zodiac Sign: రెండు గ్రహాల అరుదైన కలయికతో వచ్చే నెల ఈ రాశులపై లక్ష్మీ అనుగ్రహం..

జ్యోతిషం ప్రకారం, రాహువు జూలై 8న మీన రాశిలోని రేవతి నక్షత్రాన్ని విడిచిపెట్టి శని ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. దీని ప్రభావం వల్ల కుంభ, మీన రాశులు అదృష్టాన్ని చూస్తాయి. ప్రస్తుతం శని కుంభరాశిలో ఉంది. నేడు చంద్రుడు ఆ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా శని మరియు చంద్రుడు సంయోగం ఏర్పడతాయి. దాని ప్రభావంతో శశి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం మకరం, ధనుస్సు మరియు కుంభరాశి స్థానికుల జీవితాల్లో శుభప్రభావాలను కలిగిస్తుంది.

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×