E-Paper
Advertisement

Foods For Stress Relief: ఒత్తిడిని తగ్గించే ఫుడ్ ఇదే !

Foods For Stress Relief: ఒత్తిడిని తగ్గించే ఫుడ్ ఇదే !
Advertisement

Foods For Stress Relief : మారిన జీవన శైలి కారణంగా చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగ వ్యాపార పనుల వల్ల ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్ర పోయే వరకు సమస్యలతో ఒబ్బంది పడుతున్నారు. అనేక రకాల సమస్యల వల్ల స్ట్రెస్‌కు గురవుతుంటారు. ఆందోళన కారణంగా అనేక మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి కారణంగా రక్తపోటుతో పాటు , షుగర్ వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఆరోగ్యంగా ఉండటం కోసం ఒత్తిడిని తగ్గించుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్ లో భాగంగా చేసుకోవడం ఎంతైనా అవసరం. ఏఏ ఆహార పదార్థాలు ఆందోళన తగ్గించడానికి ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చేపలు:
చేపల్లో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాల్లో చేపలు కూడా ఒకటి సాల్మన్, సార్డినెస్ వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆందోళనను తగ్గించడంలో ఉపయోగపడతాయి. చేపలను తరుచుగా ఆహారంతో భాగంగా చేర్చుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

డ్రై ఫ్రూట్స్ :
ఇవి ఒత్తిడిని తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. వాల్ నట్స్, బాదం, గుమ్మడి కాయ గింజలతో పాటు డ్రై ఫ్రూట్స్ లల్లో హెల్ధీ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. వీటిని తరుచుగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణుగు చెబుతున్నారు.

ఆకు కూరలు:
వీటిలో విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఫుష్కలంగా ఉంటాయి. ఆకుకూరల్లో ఉండే మెగ్నీషియంతో పాటు ఇతర పోషకాలు ఒత్తిడిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. తరుచూ స్ట్రెస్ తో బాధపడేవారు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

Advertisement

పెరుగు:
ప్రోటీన్లతో పాటు ప్రోబయోటిక్స్ పెరుగులో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అంతే కాకుండా ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. రోజు ఒక కప్పు పెరుగును ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది.

Also Read: అందమైన ముఖం కోసం ఈ ఫుడ్ తినాల్సిందే !

డార్క్ చాక్లెట్:

యంటీ ఆక్సింట్లతో పాటు, ఫ్లెవనాయిడ్స్ డార్క్ చాక్లెట్ల లో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. తరుచుగా చాక్లెట్ తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని ఒక పరిశోధన ద్వారా వెల్లడైంది. స్ట్రెస్‌గా ఫీల్ అయినప్పుడు డార్క్ చాక్లెట్ తినడం వల్ల రిలీఫ్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×